నరేశ్‌ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలి!

‘మా’ అసోసియేషన్‌లో లుకలుకలు!
నరేశ్‌కు షోకాజ్‌ నోటీసు

హైదరాబాద్‌: మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా)లో మొదటి నుంచి లుకలుకలు బయటపడుతున్న సంగతి తెలిసిందే. ‘మా’ నూతన అధ్యక్షుడిగా నరేశ్‌ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి వివిధ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రమాణ స్వీకారం రోజున నరేశ్‌ మీడియాతో మాట్లాడిన తీరుపై కూడా ‘మా’ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌ రాజశేఖర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘నరేశ్‌ నేను, నేను అని కాకుండా.. మేమంతా అని ప్రస్తావిస్తే బాగుంటుంది’ అని నవ్వుతూనే చురకలు అంటించారు.

ఇప్పుడు రాజశేఖర్‌, నరేశ్‌ల మధ్య స్నేహబంధం మరింత దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. రాజశేఖర్‌ వర్గం నరేశ్‌కు షోకాజ్‌ నోటీసు ఇచ్చింది. ‘మా’ అధ్యక్షుడి పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్‌ చేసింది. ఇటీవల జరిగిన ‘మా’ ఎన్నికల్లో 268 ఓట్లతో నరేశ్‌ అధ్యక్షుడిగా గెలుపొందిన సంగతి తెలిసిందే. జనరల్‌ సెక్రటరీగా జీవిత రాజశేఖర్‌, ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా రాజశేఖర్ గెలుపొందారు.

మరిన్ని

దీపికపై అభిమానుల ఫైర్‌ [01:02]

బాలీవుడ్‌ నటి దీపిక పదుకొణె ఈ మధ్య కాలంలో ప్రధానంగా వార్తల్లో నిలుస్తోంది. మొన్నటి వరకూ జేఎన్‌యూ సందర్శనపై రాజకీయ నాయకుల నుంచి...

‘దొరసాని’ రెండో సినిమా ఖరారు [00:55]

‘దొరసాని’తో హీరోయిన్‌గా రంగప్రవేశం చేసి అభిమానుల మనసు దోచుకున్న శివాత్మిక మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. రొమాంటిక్‌ హీరో ...

మోదీ ట్వీట్‌ను కాపీ కొట్టిన బ్యూటీ [00:54]

చాలామంది ప్రముఖులు దేశంలో జరుగుతున్న పరిణామాలపై ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల వేదికగా స్పందిస్తుంటారు. వారి స్పందన...

సరికొత్త లుక్‌లో బాలకృష్ణ.. ఎందుకోసం..? [00:54]

పాత్ర అంటే ప్రాణం పెట్టే నటుల్లో అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ ఒకరు. ప్రస్తుతం ఆయనకు సంబంధించిన ఒక ఫొటో సామాజిక మాధ్యమాల...