కేటీఆర్‌కు మహేష్‌ మద్దతు

హైదరాబాద్‌: తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌కు ప్రిన్స్‌ మహేష్‌బాబు మద్దతు తెలిపారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు జ్వరాల బారిన పడి తీవ్రంగా బాధపడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై ఇటీవల తెలంగాణ పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ సోషల్‌మీడియా వేదికగా స్పందిస్తూ .. జ్వరాల బారిన పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేశారు. ‘వైరల్ జ్వరాలు, డెంగీ రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. మీ ఇంటి ఆవరణలో ఉన్న నీటి తొట్టెలు, పూల కుండీలు, ఎయిర్ కూలర్లలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోండి. దోమల వ్యాప్తికి ఇవే కారణం. నా ఇంటి పరిసరాలను నేను తనిఖీ చేసి నిల్వ ఉన్న నీటిని తొలగించాను. మీరు కూడా ఆ పనిచేసి ఫొటోలను నాతో పంచుకోండి’ అని కేటీఆర్‌ ట్వీట్ చేశారు. అయితే కేటీఆర్‌ ట్వీట్‌కు టాలీవుడ్‌ యువ కథానాయకుడు ప్రభాస్‌ స్పందించిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో టాలీవుడ్‌ కథానాయకుడు ప్రిన్స్‌ మహేష్‌బాబు కేటీఆర్‌కు సోషల్‌మీడియా వేదికగా మద్దతు తెలిపారు. ‘డెంగీ, వైరల్‌ జ్వరాలు ప్రస్తుతం నగరంలో వ్యాపిస్తున్నాయి. మీ చుట్టూ ఉన్న పరిసరాలలో నీటి నిల్వ లేకుండా చూసుకోండి. అప్రమత్తంగా ఉండడంతోపాటు మీ గురించి మీరు జాగ్రత్త తీసుకోండి. హైదరాబాద్‌ నగరవాసులరా..’ అంటూ మహేష్‌ ట్వీట్‌ చేశారు.

మరిన్ని

భారతీయుడు-2 వేగం పెంచండి:కమల్‌హాసన్‌ [08:05]

తాను కథనాయకుడిగా నటిస్తున్న ‘ఇండియన్‌ 2’ చిత్రం షూటింగ్‌ పనులను వేగవంతం చేయాలని నటుడు కమల్‌హాసన్‌ చిత్ర బృందానికి సూచించినట్లు తెలిసింది....

‘మాఫియా’ బృందానికి రజనీ అభినందనలు [09:30]

కార్తిక్‌ నరేన్‌ దర్శకత్వంలో అరుణ్‌ విజయ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘మాఫియా’. ఈ చిత్ర బృందాన్ని సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ అభినందించారు...

డెంగీ నుంచి కోలుకుంటున్న రేణూదేశాయ్‌ [13:19]

ప్రముఖ నటి, దర్శకురాలు రేణూదేశాయ్‌ డెంగీ బారినపడ్డారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నారు. ఈ విషయాన్ని ఇన్‌స్టా వేదికగా రేణూ తెలిపారు. ..

హ్యాట్రిక్‌ కొట్టేందుకు సిద్ధమయ్యారు! [17:31]

నందమూరి బాలకృష్ణ-దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో మూడో సినిమా రాబోతోంది. వీరిద్దరూ ‘సింహా’, ‘లెజెండ్‌’ సినిమాలతో సక్సెఫుల్‌ కాంబినేషన్‌ అనిపించుకున్నారు. ఇప్పుడు మరో ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇంకా సినిమా టైటిల్‌ ఖరారు చేయలేదని పేర్కొన్నారు. డిసెంబరు నుంచి చిత్రీకరణ ప్రారంభం అవుతుందని తెలిపారు.

నా కటౌట్లు పెట్టొద్దు: సూర్య [16:17]

తమిళ నటుడు సూర్య నటిస్తున్న చిత్రం ‘బందోబస్త్‌’. తాజాగా ఈ సినిమా ప్రీరిలీజ్‌ వేడుక చెన్నైలో జరిగింది. ఈ వేడుకలో సూర్య తన అభిమానులకు ఓ విజ్ఞప్తి చేశారు. తన చిత్రాల విడుదల సమయంలో

అవి అత్యంత విలువైన జ్ఞాపకాలు:సుస్మిత [15:47]

టాలీవుడ్‌ అగ్రకథానాయకుడు, మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్‌ నటుడు బిగ్‌బి అమితాబ్‌ బచ్చన్‌ ముఖ్యపాత్రలో

ఫన్నీగా ‘తెనాలి రామకృష్ణ’ టీజర్‌ [14:40]

యువ కథానాయకుడు సందీప్‌ కిషన్‌ నటించిన సినిమా ‘తెనాలి రామకృష్ణ’. జి.నాగేశ్వర‌రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. హన్సిక కథానాయిక పాత్ర పోషిస్తున్నారు...

గోవాకి బై బై చెప్పిన ‘డిస్కోరాజా’ [14:10]

టాలీవుడ్‌ కథానాయకుడు మాస్‌ మహారాజా రవితేజ నటిస్తున్న చిత్రం ‘డిస్కోరాజా’. ఈ సినిమా షూటింగ్‌ గోవాలో జరుగుతున్న విషయం తెలిసిందే...

‘ఈ కన్యను తాకాలని చూస్తే మరణం తప్పదు’ [12:10]

‘రాజుగారి గది’ సీక్వెల్స్‌లో భాగంగా తెరకెక్కుతోన్న సినిమా ‘రాజుగారి గది 3’. అవికాగోర్‌, అశ్విన్‌బాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్ర ట్రైలర్‌ని సోషల్‌మీడియా వేదికగా చిత్రబృందం...

‘సాహో’ విషయంలో చాలా సంతోషంగా ఉన్నా! [11:00]

‘సాహో’ ఫలితం విషయంలో తను చాలా సంతోషంగా ఉన్నట్లు బాలీవుడ్‌ కథానాయిక శ్రద్ధా కపూర్‌ తెలిపారు. ప్రభాస్‌కు జోడీగా ఆమె నటించిన సినిమా ఇది...