వేలానికి మోదీ కానుకలు

దిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశ, విదేశాల్లో పర్యటించినప్పుడు ఆయనకు ఎన్నో జ్ఞాపికలు, కానుకలు వస్తుంటాయి. అయితే వాటిని కేవలం ప్రదర్శనకు మాత్రమే పరిమితం చేయకుండా.. ఆ బహుమతులను సమాజసేవ కోసం వినియోగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే మోదీకి వచ్చిన దాదాపు 2,700లకు పైగా వస్తువులను వేలానికి పెట్టేందుకు సిద్ధమైంది.

మోదీ అందుకున్న 2,772 వస్తువులను సెప్టెంబరు 14 నుంచి ఆన్‌లైన్‌ ద్వారా వేలం వేయనున్నట్లు  కేంద్రమంత్రి ప్రహ్లాద్‌ పటేల్‌ తెలిపారు. వీటి కనీస ధరలు రూ. 200 నుంచి రూ. 2.5లక్షల వరకు ఉన్నట్లు పేర్కొన్నారు. 

కాగా.. మోదీకి వచ్చిన బహుమతులు వేలం వేయడం ఇదే తొలిసారి కాదు. ఈ ఏడాది జనవరి-ఫిబ్రవరి మధ్య 1800 వేలకు పైగా కానుకలను పదిహేను రోజుల పాటు వేలం వేశారు. వాటి ద్వారా వచ్చిన మొత్తాన్ని నమామి గంగా ప్రాజెక్టుకు విరాళంగా ఇచ్చారు. 

మరిన్ని

సీఏఏని విభేదించే హక్కు రాష్ట్రాలకుంది: కాంగ్రెస్ [00:00]

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం విషయంలో విభేదించే హక్కు రాష్ట్రాలకు ఉందని కాంగ్రెస్‌ పార్టీ పేర్కొంది. సీఏఏ అంశం కోర్టులో తేలే వరకు రాజ్యాంగ విరుద్ధమైన చట్టాన్ని....