ట్రాఫిక్‌ జరిమానాలు రాష్ట్రాల ఇష్టమే: గడ్కరీ

దిల్లీ: కేంద్ర ప్రభుత్వం పెంచిన ట్రాఫిక్‌ జరిమానాల విధింపుపై రాష్ట్రాలే సొంతంగా నిర్ణయాలు తీసుకోవచ్చని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ స్పష్టంచేశారు. దేశవ్యాప్తంగా పెరిగిన ట్రాఫిక్‌ జరిమానాలను గుజరాత్‌ ప్రభుత్వం మంగళవారం తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల సవరించిన మోటారు వాహనాల చట్టం-2019 ప్రకారం పెరిగిన ట్రాఫిక్‌ జరిమానాలను రాష్ట్ర ప్రభుత్వాలు తగ్గించుకొనే వెసులుబాటు ఉంటుందని వెల్లడించారు. 21వ శతాబ్దపు యువత (మిలీనియల్స్‌) ఎక్కువగా క్యాబ్‌లపై ఆసక్తి కనబరుస్తుండడంతోనే కార్ల అమ్మకాలు తగ్గిపోయాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మంగళవారం చేసిన వ్యాఖ్యలపై సోషల్‌ మీడియాలో తీవ్ర విమర్శలకు తావివ్వడంతో దీనిపైనా ఆయన వివరణ ఇచ్చారు. నిర్మల చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని, వాహన అమ్మకాలు పడిపోయేందుకు ఇది కూడా ఒక కారణమని వివరించారు. బీఎస్‌-6 ప్రమాణాలతో హోండా యాక్టివా 125 స్కూటర్‌ ఆవిష్కరణ సందర్భంగా ఆయన దీనిపై స్పందించారు. ప్రతి నెలా దిగజారుతున్న వాహన అమ్మకాలకు పలు కారణాలు ఉన్నాయని అన్నారు. విపణిలోకి ఈ-రిక్షాల అరంగేట్రంతో సంప్రదాయ ఇంధన వాహనాల అమ్మకాలు పడిపోవడం, దేశ వ్యాప్తంగా ప్రజా రవాణా మెరుగుపడడం వంటి కారణాల వల్ల వాహన రంగం కష్టాల్లో ఉందని వివరించారు.‘‘వాహనాలపై ప్రస్తుతం ఉన్న జీఎస్టీని పది శాతం తగ్గించాలని, దీనివల్ల తమకు తాత్కాలిక ఊరట లభిస్తుందని ఆటోమొబైల్‌ రంగం కోరుతోంది. కానీ ఇది జీఎస్టీ మండలి పరిధిలోని అంశం. దీనిపై నేను ఆర్థికశాఖను సంప్రదించాను. ఇది వారి చేతుల్లోనే ఉంది’’ అని అన్నారు.


మరిన్ని

తెదేపా నేతల గృహనిర్బంధం [01:05]

అమరావతి పరిరక్షణ సమితి, రాజకీయ పార్టీలు తలపెట్టిన అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో రాష్ట్రంలో ఎక్కడికక్కడ తెదేపా నేతలను పోలీసులు గృహనిర్బంధం చేస్తున్నారు. 13 జిల్లాల్లో తెదేపా నాయకులు, ఐకాస నేతలను పోలీసులు గృహనిర్బంధం చేశారు. ముందు జాగ్రత్తగా పోలీసులు ఇప్పటికే ప్రతిపక్ష తెదేపా నేతలకు నోటీసులు జారీ చేశారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో

ప్రకాశం బ్యారేజీ మీదుగా రాకపోకలపై ఆంక్షలు [00:55]

అమరావతి పరిరక్షణ సమితి, రాజకీయ పార్టీలు తలపెట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యమానికి అనుమతి లేదని విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు...

‘దిల్లీలో కొట్లాట..గల్లీలో షేక్‌హ్యాండ్‌’ [01:04]

తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి ఓటు వేయాలని మంత్రి హరీశ్‌రావు ఓటర్లను కోరారు. మున్సిపల్‌ ఎన్నికల...

దీపికపై అభిమానుల ఫైర్‌ [01:02]

బాలీవుడ్‌ నటి దీపిక పదుకొణె ఈ మధ్య కాలంలో ప్రధానంగా వార్తల్లో నిలుస్తోంది. మొన్నటి వరకూ జేఎన్‌యూ సందర్శనపై రాజకీయ నాయకుల నుంచి...

అణిచివేత చర్యలు అప్రజాస్వామికం: చంద్రబాబు [01:05]

అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో తెదేపా నేతల గృహనిర్బంధాలు, అక్రమ అరెస్టులను తెదేపా అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. పోలీసుల చర్యను హేయమైందిగా చంద్రబాబు పేర్కొన్నారు. తమ భవిష్యత్తుపై ఆందోళనతో ప్రజలు

మంత్రి మల్లారెడ్డి టికెట్లు అమ్ముకున్నారు:రేవంత్‌ [01:04]

దిల్లీ నుంచి తాను నిధులు తీసుకొస్తానని.. వాటిని సక్రమంగా ఖర్చు పెట్టాలని కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి అన్నారు. కాలనీలను అభివృద్ధి చేయాలంటే...

‘దొరసాని’ రెండో సినిమా ఖరారు [00:55]

‘దొరసాని’తో హీరోయిన్‌గా రంగప్రవేశం చేసి అభిమానుల మనసు దోచుకున్న శివాత్మిక మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. రొమాంటిక్‌ హీరో ...

రాజధాని కోసం ఆగిన మరో గుండె [00:55]

రాజధాని తరలింపు ప్రకటనల నేపథ్యంలో మరో మహిళా రైతు గుండె ఆగింది. అమరావతి రాజధానిని తరలించవద్దని చేపట్టిన దీక్షా శిబిరంలో...

మోదీ ట్వీట్‌ను కాపీ కొట్టిన బ్యూటీ [00:54]

చాలామంది ప్రముఖులు దేశంలో జరుగుతున్న పరిణామాలపై ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల వేదికగా స్పందిస్తుంటారు. వారి స్పందన...

ఆ రైల్వే స్టేషన్లలో సంస్కృతం [00:54]

ఉత్తరాఖండ్‌ రైల్వేస్టేషన్లలోని నామ ఫలకాలపై ఉర్దూ స్థానంలో ఇకపై సంస్కృతం వచ్చి చేరనుంది. రైల్వే ప్లాట్‌ఫాంపై ఉండే నామ ఫలకాలు ఆ రాష్ట్రానికి చెందిన ద్వితీయ భాష....