అన్నయ్యా.. సారీ!

ముంబయి: దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు టీమిండియా సిద్ధమైంది. ధర్మశాల పోరు కోసం జట్టు సభ్యులు సాధన చేస్తున్నారు. ఇందులో భాగంగా ముంబయి ఇండియన్స్‌ సోదరులు హార్దిక్‌ పాండ్య, కృనాల్‌ పాండ్య కఠినంగా శ్రమించారు. నెట్స్‌లో కృనాల్‌ బంతులు విసరగా హార్దిక్‌ భారీ షాట్లు సాధన చేశాడు. అయితే ఓ బంతిని దాదాపుగా కృనాల్‌ తలకు తగిలేలా బ్యాటింగ్‌ చేశాడు హార్దిక్‌. ఆ వీడియోను అభిమానులతో పంచుకున్నాడు.

నెట్స్‌లో సాధన ముగిసిన తర్వాత అన్నకు క్షమాపణలు చెబుతూ తమ్ముడు ట్వీట్‌ చేశాడు. ‘సాధనలో పాండ్య వర్సెస్‌ పాండ్య. నేను ఈ రౌండ్‌ గెలిచాననే అనుకుంటున్నాను పెద్దన్నా.. నోట్‌: దాదాపు నీ తలకు తగిలేలా బంతి ఆడినందుకు సారీ’ అని వీడియో పోస్ట్‌ చేశాడు. దీనికి పెద్ద పాండ్య స్పందించాడు. ‘హహహా.. కూల్‌ బ్రో. కానీ నువ్వెందుకు ఈ వీడియో అప్‌లోడ్‌ చేయలేదు?’ అని ప్రశ్నించాడు. ఆ వీడియోలో బంతిని ఆడలేక ‘తమ్ముడు పాండ్య’ క్రీజులో తడబడ్డాడు. దక్షిణాఫ్రికాతో టీమిండియా మూడు టీ20లు, మూడు టెస్టులు ఆడనుంది. ధర్మశాల వేదికగా సెప్టెంబర్‌ 15న తొలి టీ20 జరగనుంది. పనిభారం సమీక్షలో భాగంగా తమ్ముడు పాండ్యను బీసీసీఐ వెస్టిండీస్‌ పర్యనకు ఎంపిక చేయలేదు. అతడి సోదరుడు కృనాల్‌ కరీబియన్‌ దీవుల్లో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.


 మరిన్ని

రాహుల్‌ ఔటయ్యాక.. అదే అనుకున్నాం [00:01]

ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో కేఎల్‌ రాహుల్‌(19) ఔటయ్యాక.. కోహ్లీ, తాను ఇన్నింగ్స్‌ చక్కదిద్దాలని అనుకున్నామని ఓపెనర్‌ రోహిత్‌శర్మ అన్నాడు...