బంగారు లడ్డూ వేలం..ఎంతపలికిందంటే!

ముషీరాబాద్‌: వినాయక ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌లోని భోలక్‌పూర్‌ డివిజన్‌లో ఏర్పాటు చేసిన మండపం వద్ద బంగారు లడ్డూ వేలం కోలాహలంగా జరిగింది. శ్రీసిద్ధి వినాయక భగత్‌సింగ్‌ యూత్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో భోలక్‌పూర్‌లో వినాయక మండపాన్ని ఏర్పాటు చేశారు. అసోసియేషన్‌ నిర్వాహకులు బుధవారం స్వామివారి ప్రసాదంగా వుంచిన లడ్డూకు వేలం పాట నిర్వహించారు. ప్రసాదం లడ్డూతో పాటు ఆకర్షణ గొల్పేందుకు బంగారం లడ్డూను వేలంలో ఉంచడం ఇక్కడి ప్రత్యేకత. ఈ ఏడాది రూ.5 లక్షల విలువ చేసే 123 గ్రాముల బంగారం లడ్డూను నిర్వాహకులు తయారు చేయించారు. నిమజ్జనానికి ఒక రోజు ముందు వేలంపాట నిర్వహించడంతో భక్తులు పోటాపోటీగా పాల్గొన్నారు. రూ.5001 నుంచి ప్రారంభమైన వేలం పాట రూ.7.56 లక్షతో ముగిసింది. స్థానిక చేపల విక్రయ వ్యాపారి బైరు విష్ణుప్రసాద్‌ ఈ బంగారు లడ్డూను దక్కించుకున్నారు.

గతేడాది ఏర్పాటు చేసిన వేలంపాటలో 120 గ్రాముల బంగారు లడ్డూను స్థానికుడు కె.భాస్కర్‌ రూ.8.1లక్షలకు సొంతం చేసుకున్నారు. గతేడాదితో పోలిస్తే ఈసారి లడ్డూ తక్కువ ధర పలకడం గమనార్హం. ఈ వేలం కార్యక్రమానికి ముఖ్య అతిథులగా ముషీరాబాద్‌ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌, తెరాస యువజన విభాగ నాయకుడు జయసింహ, భాజపా నియోజకవర్గ కో-కన్వీనర్‌ నవీన్‌ గౌడ్‌, అసోసియేషన్‌ నిర్వాహకులు జి.అనిల్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని

13 అంతస్తుల భవనంపైకి ఎక్కి రైతుల నిరసన [13:36]

ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ నిర్మాణంలో ఉన్న ఎమ్మెల్యే క్వార్టర్స్‌ భవనంపైకి ఇద్దరు రైతులు ఎక్కడం ఆందోళన కలిగిస్తోంది. తుళ్లూరు, నెక్కల్లు గ్రామాలకు చెందిన కొందరు రైతులు నూతనంగా నిర్మిస్తున్న ఎమ్మె్ల్యే క్వార్టర్స్‌ వద్ద

‘డమ్మీ కాన్వాయ్‌తో ట్రయల్‌ రన్‌..సిగ్గుచేటు’ [19:32]

హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ పెరిగే విధంగా తెలంగాణ సీఎం కేసీఆర్‌తో ఏపీ సీఎం జగన్‌ ఒప్పందం చేసుకున్నారని.. అందుకే అమరావతిని చంపేస్తున్నారని...

‘దిల్లీలో కొట్లాట..గల్లీలో షేక్‌హ్యాండ్‌’ [20:54]

తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి ఓటు వేయాలని మంత్రి హరీశ్‌రావు ఓటర్లను కోరారు. మున్సిపల్‌ ఎన్నికల...

గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం [23:44]

గుజరాత్‌ రాష్ట్రంలోని సురేంద్రనగర్‌ జిల్లా ఘోర దేవ్‌పరా వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాకు చెందిన ఐదుగురు దుర్మరణం పాలవగా, మరో ఐదుగురు గాయపడ్డారు. వీరంతా గుజరాత్‌లోని సోమనాథ్‌ ఆలయాన్ని దర్శించుకుని తిరిగి వస్తుండగా ఈ దారుణం చోటు చేసుకుంది

అణిచివేత చర్యలు అప్రజాస్వామికం: చంద్రబాబు [23:38]

అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో తెదేపా నేతల గృహనిర్బంధాలు, అక్రమ అరెస్టులను తెదేపా అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. తమ భవిష్యత్తుపై ఆందోళనతో ప్రజలు ఉన్నారని, ప్రభుత్వానికి తమ ఆకాంక్షలను తెలియజేయాలనుకున్న తరుణంలో ఈ విధమైన అణిచివేత చర్యలు...

మోదీ ట్వీట్‌ను కాపీ కొట్టిన బ్యూటీ [23:32]

చాలామంది ప్రముఖులు దేశంలో జరుగుతున్న పరిణామాలపై ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల వేదికగా స్పందిస్తుంటారు. వారి స్పందన...

తెదేపా నేతల గృహనిర్బంధం [23:24]

అమరావతి పరిరక్షణ సమితి, రాజకీయ పార్టీలు తలపెట్టిన అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో రాష్ట్రంలో ఎక్కడికక్కడ తెదేపా నేతలను పోలీసులు గృహనిర్బంధం చేస్తున్నారు. 13 జిల్లాల్లో తెదేపా నాయకులు, ఐకాస నేతలను పోలీసులు గృహనిర్బంధం చేశారు. ముందు జాగ్రత్తగా పోలీసులు ఇప్పటికే ప్రతిపక్ష తెదేపా నేతలకు నోటీసులు జారీ చేశారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో

రాజధాని కోసం ఆగిన మరో గుండె [23:19]

రాజధాని తరలింపు ప్రకటనల నేపథ్యంలో మరో మహిళా రైతు గుండె ఆగింది. అమరావతి రాజధానిని తరలించవద్దని చేపట్టిన దీక్షా శిబిరంలో...

దీపికపై అభిమానుల ఫైర్‌ [23:02]

బాలీవుడ్‌ నటి దీపిక పదుకొణె ఈ మధ్య కాలంలో ప్రధానంగా వార్తల్లో నిలుస్తోంది. మొన్నటి వరకూ జేఎన్‌యూ సందర్శనపై రాజకీయ నాయకుల నుంచి...

ఫేస్‌బుక్‌ పోస్టు.. సినిమాలాంటి ట్విస్టు [22:52]

మంచి చేసేవాళ్లకు ఎప్పటికైనా మంచి జరుగుతుందని చాలామంది నమ్ముతారు. ఈ వార్త చదివితే ఎవరికైనా అది  నిజమనిపించక మానదు.