ఆ వార్తలపై కేటీఆర్‌ నన్ను అడిగారు:నాయిని

హైదరాబాద్‌: తన గురించి ఇటీవల మీడియాలో వచ్చిన వార్తలపై మంత్రి కేటీఆర్‌ తనను అడిగారని మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. ఇష్టాగోష్ఠిగా మాట్లాడితే దాన్నే పెద్ద వార్తగా రాశారని ఆయనతో చెప్పానన్నారు. తెరాసే మా పార్టీ.. కేసీఆరే మా నాయకుడు అని నాయిని చెప్పారు. పదవులు మాకే దక్కుతాయి.. మాకు అన్ని హామీలూ ఉన్నాయంటూ వ్యాఖ్యానించారు. ఆర్టీసీ ఛైర్మన్‌ పదవి ఇస్తే రసం కూడా వాళ్లే పోస్తారన్న నాయిని.. కేసీఆర్‌ తనను ఎప్పుడు పిలిచినా వెళ్లి మాట్లాడతానని చెప్పారు. తనకు మంత్రి పదవి ఇస్తానని చెప్పి కేసీఆర్‌ మాట తప్పారని.. 2018 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటే మండలిలో ఉండాలని తనకు సూచించారంటూ ఇటీవల నాయిని చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. 

మరిన్ని

రూపాయి విలువ చేసే చాక్లెట్లు దొంగిలించాడని.. [00:53]

బెంగళూరులో దారుణం జరిగింది. రెండు చాక్లెట్లు దొంగిలించినందుకు ఓ బాలుడి జుట్టు, కనుబొమ్మలు, కనురెప్పల వెంట్రుకలు ఓ సూపర్‌ మార్కెట్‌ యజమాని కత్తిరించాడు...........

హైదరాబాద్‌లో కాళ్లు,చేతులు కట్టి ఉరేశారు! [00:53]

గుర్తుతెలియని వ్యక్తులు ఓ యువకుడి కాళ్లు, చేతులు కట్టేసి ఉరివేసిన ఘటన హైదరాబాద్‌ శివారులో చోటుచేసుకుంది. బాలాపూర్‌ ఠాణా పరిధిలో...

రిలయన్స్‌ పెట్రోల్‌ పంపుల్లో విక్రయాల జోరు [00:52]

దేశీయ చమురు రంగ దిగ్గజం రిలయన్స్‌ చమురు రిటైల్‌ మార్కెట్లో కూడా తన హవా కొనసాగిస్తోంది. రిలయన్స్‌కు చెందిన దాదాపు 1,400 పెట్రోల్‌...

ఎన్నెన్నో ప్రకటనలు.. కొన్నే అమలు..! [00:52]

ప్రభుత్వాలు బడ్జెట్లలో ఎన్నో ప్రకటనలను ఆర్థికమంత్రి చేస్తుంటారు. కానీ, వాస్తవంగా వీటిల్లో కొన్నే అమలవుతాయి. ప్రతి ప్రభుత్వంలో ఇవి సర్వసాధారణం...

హార్దిక్‌ కోసం టీమిండియా ఎంపిక ఆలస్యం! [00:52]

మరికొన్ని రోజుల్లో కోహ్లీసేన న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుంది. జనవరి 24 నుంచి అయిదు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. ఈ సిరీస్‌లకు భారత జట్టును ఆదివారం సెలక్టర్లు ఎంపిక చేయాల్సి ఉంది. అయితే కివీస్‌ పర్యటనకు భారత

రూ.3 కోట్ల విలువైన వజ్రాలు చోరీ! [00:51]

గుజరాత్‌లోని సూరత్‌లో రూ.3 కోట్ల విలువ చేసే వజ్రాలు చోరీకి గురయ్యాయి. మేనేజర్‌కు అప్పగించాల్సిన వజ్రాలను నమ్మకస్తులైన కార్మికులే ఎత్తుకెళ్లిపోయారని ఫ్యాక్టరీ యాజమాన్యం ....

జీవిత బీమాతో ఎయిర్‌టెల్‌ కొత్త ప్లాన్‌ [00:51]

ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్‌ జీవిత బీమాతో కూడిన మరో ప్రీపెయిడ్‌ ప్యాక్‌ను తీసుకొచ్చింది. రూ.2లక్షల జీవిత బీమాతో కూడిన రూ.179 ప్రీపెయిడ్‌...

2-1తేడాతో లెక్క సరిచేశారు [00:51]

ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో భారత్‌ కైవసం చేసుకుంది...

అండర్‌ 19లో యువ భారత్‌ విజయం [00:50]

అండర్‌ 19 ప్రపంచకప్‌లో భారత్‌ శుభారంభం చేసింది. శ్రీలంక జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా 90 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది...

రాహుల్‌ ఔటయ్యాక.. అదే అనుకున్నాం [00:50]

ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో కేఎల్‌ రాహుల్‌(19) ఔటయ్యాక.. కోహ్లీ, తాను ఇన్నింగ్స్‌ చక్కదిద్దాలని అనుకున్నామని ఓపెనర్‌ రోహిత్‌శర్మ అన్నాడు...