విరాట్‌, రోహిత్‌ లోపాల్ని సరిదిద్దాను: బంగర్‌

ముంబయి: టీమిండియా బ్యాటింగ్‌ కోచ్‌గా తిరిగి ఎంపిక చేయనందుకు నిరాశ పడ్డానని సంజయ్‌ బంగర్‌ అన్నాడు. ఐతే ఆ బాధ తక్కువ రోజులకే పరిమితమని పేర్కొన్నాడు. తాజా ఆలోచనలు చేసేందుకు, తనపై తాను సమయం పెట్టేందుకు ఈ విరామం ఉపయోగపడుతుందని వెల్లడించాడు. విదేశీ జట్లకు కోచింగ్‌ ఇవ్వడంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నాడు. తన హయాంలో రోహిత్‌, రహానె, పుజారా బ్యాటింగ్‌ టెక్నిక్‌లో మార్పులు చేశానని బంగర్‌ అన్నాడు.

‘నిరాశ కలగడం అత్యంత సహజం. అయితే కొన్ని రోజులే బాధపడ్డాను. బీసీసీఐ, కోచ్‌లు డంకన్‌, అనిల్‌, రవికి ధన్యవాదాలు. భారత క్రికెట్‌కు ఐదేళ్లు సేవ చేసే అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు. ఆలోచన ధోరణి మార్చుకొనేందుకు, నాపై నేను సమయం పెట్టేందుకు ఈ విరామం ఉపయోగించుకుంటాను’ అని బంగర్‌ అన్నాడు. అతడు బ్యాటింగ్‌ కోచ్‌గా ఉన్నప్పుడే కోహ్లీ 43, రోహిత్‌ శర్మ 28, ధావన్‌ 18, పుజారా 12 శతకాలు బాదడం గమనార్హం.

‘తన లోపాలు సరిదిద్దుకొనేందుకు విరాట్‌ నిరంతరం ప్రయత్నిస్తుంటాడు. క్రీజులో అతడు నిలబడే విధానం, వేగంగా బంతులు వచ్చే పరిస్థితుల్లో బ్యాటింగ్‌పై మేం కలిసి పనిచేశాం. శిఖర్‌ను తొలుత ఆఫ్‌సైడ్‌ ఆటగాడిగా భావించారు. అతనెప్పుడూ బంతిని పక్కగా ఆడేందుకు ప్రయత్నించేవాడు. మైదానంలోని ఇతర ప్రదేశాల్లోనూ పరుగులు చేసేలా మార్చాం. షార్ట్‌పిచ్‌ బంతులకు ఔటవ్వకుండా శిక్షణ ఇచ్చాం. తన మీదికి దూసుకొచ్చే బంతులకు ఎల్బీ అవ్వకుండా ఉండేందుకు రోహిత్‌ శర్మ తలను నిలపడంపై నిలకడగా పనిచేశాం. పుజారా విషయంలో అతడి స్టాన్స్‌ మధ్య ఖాళీని తగ్గించాం. భారత క్రికెటర్లు కాస్త ఎత్తు తక్కువ ఉంటారు కాబట్టి కాళ్ల మధ్య అంతరం ఎక్కువగా ఉండొద్దు. బ్యాట్స్‌మెన్‌ కొన్ని పాత పద్ధతులు, టెక్నిక్‌లు వదిలేసేలా డంకన్‌ నేతృత్వంలో కృషిచేశాం’ అని బంగర్‌ తెలిపాడు.

మరిన్ని

చాహల్‌, కుల్‌దీప్‌ను ఎందుకు తీసుకోలేదంటే? [09:10]

టీమిండియా నేటి నుంచి దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఇరు జట్ల మధ్యా మూడు టీ20లు, మూడు టెస్టుల సిరీస్‌లు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పొట్టి ఫార్మాట్‌లో...

రోహిత్‌ను అతడు నిలువరిస్తాడా? [14:53]

టీమిండియా తదుపరి లక్ష్యం వచ్చే ఏడాది జరగబోయే టీ20 ప్రపంచకప్‌. అందుకు ఇప్పటి నుంచే సమాయత్తమవ్వాల్సిన అవసరముంది. 2020 ప్రపంచకప్‌ వరకు కోహ్లీసేన సుమారు 17 టీ20లు ఆడనుంది...

ఒక్కో పరుగు తీసేందుకు కష్టపెడతారు [18:04]

ఇంగ్లాండ్‌ ఓపెనింగ్‌ బ్యాట్స్‌మన్‌ జోడెన్లీ ఆసీస్‌ బౌలర్లను కొనియాడాడు. ఒక్కో పరుగు తీసేందుకు కంగారూలు చాలా కష్టపెడతారని చెప్పాడు. బ్యాట్స్‌మన్‌ ఓపెనింగ్‌ చేసే ప్రతీసారి బాగా ఆడి మంచి...

స్మిత్‌ అద్భుత క్యాచ్‌ చూశారా? [17:19]

శనివారం ఓవర్‌నైట్‌ స్కోర్‌ 9/0తో మూడోరోజు ఆటను కొనసాగించిన ఇంగ్లాండ్‌ మ్యాచ్‌పై పట్టుబిగించింది. జోడెన్లీ(94), బెన్‌స్టోక్స్‌(67), జోస్‌బట్లర్‌(47) రాణించడంతో భారీ స్కోర్‌ దిశగా సాగుతోంది...

కొత్త జెర్సీలో టీమిండియా [13:29]

దక్షిణాఫ్రికాతో తలపడే నేటి మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్లు కొత్త జెర్సీలో దర్శనమివ్వబోతున్నారు. ఇన్నాళ్లు ఒప్పొ స్మార్ట్‌ఫోన్‌ సంస్థ భారత జట్టుకు స్పాన్సర్‌గా వ్యవహరించింది...

పాకిస్థాన్‌పై ప్రత్యేక విజయం గుర్తుందా? [10:48]

భారత్‌ X పాకిస్థాన్‌ క్రికెట్‌ అంటే ఇరుదేశాలకే కాదు ప్రపంచవ్యాప్తంగా యావత్‌ క్రీడాభిమానులకూ ఎంతో ఆసక్తి. రెండు జట్లూ తలపడుతున్నాయంటే సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నంత ఉద్విగ్న పరిస్థితులు. క్రికెట్‌లో ఉండే క్రేజ్‌ ఒకెత్తయితే..

రోహిత్‌శర్మ నీ ప్రత్యేకతని కొనసాగించు [00:29]

టీమిండియా హిట్‌మ్యాన్‌ రోహిత్‌శర్మ టెస్టుల్లో ఓపెనింగ్‌ చేస్తే తన ప్రత్యేకతను కొనసాగించాలని మాజీ బ్యాటింగ్‌ కోచ్‌ సంజయ్‌ బంగర్‌ అన్నాడు. టెస్టుల్లో అతడు ఓపెనర్‌గా...

ఎక్కడైనా గెలుపే మా లక్ష్యం: కోహ్లీ [00:27]

స్వదేశంలోనైనా, ఇతర దేశాల్లోనైనా మ్యాచ్ విజయం కోసమే బరిలోకి దిగుతామని భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో టీమ్‌ఇండియా

 క్రీడల వర్సిటీ ఛాన్సలర్‌గా కపిల్‌ దేవ్? [00:27]

క్రికెట్‌ దిగ్గజం, భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ కపిల్‌ దేవ్‌కు హరియాణా ప్రభుత్వం క్రీడల విశ్వవిద్యాలయం ఛాన్స్‌లర్‌గా నియమించాలని నిర్ణయించినట్టు సమాచారం. హరియాణా హరికేన్‌గా పేర్గాంచిన.........

భారత్‌ మ్యాచ్‌కు వరుణుడి ముప్పు! [00:27]

వెస్టిండీస్‌ పర్యటనను టీమ్‌ఇండియా విజయవంతంగా ముగించిన సంగతి తెలిసిందే. అన్ని ఫార్మాట్లలోనూ ఆతిథ్య జట్టు విండీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసింది. ప్రస్తుతం స్వదేశంలో సఫారీలతో పోరుకు