విరాట్‌, రోహిత్‌ లోపాల్ని సరిదిద్దాను: బంగర్‌

ముంబయి: టీమిండియా బ్యాటింగ్‌ కోచ్‌గా తిరిగి ఎంపిక చేయనందుకు నిరాశ పడ్డానని సంజయ్‌ బంగర్‌ అన్నాడు. ఐతే ఆ బాధ తక్కువ రోజులకే పరిమితమని పేర్కొన్నాడు. తాజా ఆలోచనలు చేసేందుకు, తనపై తాను సమయం పెట్టేందుకు ఈ విరామం ఉపయోగపడుతుందని వెల్లడించాడు. విదేశీ జట్లకు కోచింగ్‌ ఇవ్వడంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నాడు. తన హయాంలో రోహిత్‌, రహానె, పుజారా బ్యాటింగ్‌ టెక్నిక్‌లో మార్పులు చేశానని బంగర్‌ అన్నాడు.

‘నిరాశ కలగడం అత్యంత సహజం. అయితే కొన్ని రోజులే బాధపడ్డాను. బీసీసీఐ, కోచ్‌లు డంకన్‌, అనిల్‌, రవికి ధన్యవాదాలు. భారత క్రికెట్‌కు ఐదేళ్లు సేవ చేసే అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు. ఆలోచన ధోరణి మార్చుకొనేందుకు, నాపై నేను సమయం పెట్టేందుకు ఈ విరామం ఉపయోగించుకుంటాను’ అని బంగర్‌ అన్నాడు. అతడు బ్యాటింగ్‌ కోచ్‌గా ఉన్నప్పుడే కోహ్లీ 43, రోహిత్‌ శర్మ 28, ధావన్‌ 18, పుజారా 12 శతకాలు బాదడం గమనార్హం.

‘తన లోపాలు సరిదిద్దుకొనేందుకు విరాట్‌ నిరంతరం ప్రయత్నిస్తుంటాడు. క్రీజులో అతడు నిలబడే విధానం, వేగంగా బంతులు వచ్చే పరిస్థితుల్లో బ్యాటింగ్‌పై మేం కలిసి పనిచేశాం. శిఖర్‌ను తొలుత ఆఫ్‌సైడ్‌ ఆటగాడిగా భావించారు. అతనెప్పుడూ బంతిని పక్కగా ఆడేందుకు ప్రయత్నించేవాడు. మైదానంలోని ఇతర ప్రదేశాల్లోనూ పరుగులు చేసేలా మార్చాం. షార్ట్‌పిచ్‌ బంతులకు ఔటవ్వకుండా శిక్షణ ఇచ్చాం. తన మీదికి దూసుకొచ్చే బంతులకు ఎల్బీ అవ్వకుండా ఉండేందుకు రోహిత్‌ శర్మ తలను నిలపడంపై నిలకడగా పనిచేశాం. పుజారా విషయంలో అతడి స్టాన్స్‌ మధ్య ఖాళీని తగ్గించాం. భారత క్రికెటర్లు కాస్త ఎత్తు తక్కువ ఉంటారు కాబట్టి కాళ్ల మధ్య అంతరం ఎక్కువగా ఉండొద్దు. బ్యాట్స్‌మెన్‌ కొన్ని పాత పద్ధతులు, టెక్నిక్‌లు వదిలేసేలా డంకన్‌ నేతృత్వంలో కృషిచేశాం’ అని బంగర్‌ తెలిపాడు.

మరిన్ని

భాజపా జాతీయ అధ్యక్షుడి ఎన్నిక నేడు [00:05]

భాజపా జాతీయ అధ్యక్షుడి కోసం సోమవారం ఎన్నిక నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం 10:30 నుంచి నామినేషన్‌ ప్రక్రియ చేపట్టనున్నారు. మధ్యాహ్నం 12.30 వరకు

రాహుల్‌ ఔటయ్యాక.. అదే అనుకున్నాం [00:01]

ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో కేఎల్‌ రాహుల్‌(19) ఔటయ్యాక.. కోహ్లీ, తాను ఇన్నింగ్స్‌ చక్కదిద్దాలని అనుకున్నామని ఓపెనర్‌ రోహిత్‌శర్మ అన్నాడు...

సీఏఏని విభేదించే హక్కు రాష్ట్రాలకుంది: కాంగ్రెస్ [00:00]

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం విషయంలో విభేదించే హక్కు రాష్ట్రాలకు ఉందని కాంగ్రెస్‌ పార్టీ పేర్కొంది. సీఏఏ అంశం కోర్టులో తేలే వరకు రాజ్యాంగ విరుద్ధమైన చట్టాన్ని....