వీడియో చిత్రీకరించి.. భయపెట్టి అత్యాచారం

దిల్లీ: కేంద్ర మాజీ మంత్రి చిన్మయానంద్‌పై అత్యాచార కేసు పెట్టిన యువతి దిల్లీ పోలీసులకు చేసిన ఫిర్యాదులో సంచలన ఆరోపణలు చేసింది. ఫిర్యాదులో వెల్లడించిన వివరాల ప్రకారం.. ‘యూపీలోని షాజహాన్‌పూర్‌లో చిన్మయానంద పలు ఆశ్రమాలతో పాటు, విద్యా సంస్థలు కూడా నడుపుతున్నారు. నేను న్యాయవిద్యను అభ్యసించేందుకు ఆ కళాశాలలో చేరదామని వెళ్లాను. అక్కడ గతేడాది జూన్‌లో కళాశాల ప్రవేశాల సమయంలో మొదటి సారి నేను చిన్మయానందను కలిశాను. అప్పుడు నా నంబరు తీసుకోవడమే కాకుండా నాకు ఆయన లైబ్రరీలో రూ.5వేలకు ఉద్యోగం కూడా ఇప్పించారు. ఆ తర్వాత అక్టోబర్‌లో ఒక మహిళ నా వద్దకు వచ్చి ఆశ్రమానికి రావాలని పిలిచింది. నేను ఒప్పుకోకపోయే సరికి నేను బాత్‌రూంలో స్నానం చేస్తుండగా తీసిన వీడియోను చూపించి భయపెట్టారు. ఆ తర్వాత ఆ వీడియోను చూపించి బ్లాక్‌మెయిల్‌ చేసిన చిన్మయానంద్‌  ఈ ఏడాది జులై వరకు అత్యాచారానికి పాల్పడ్డారు. దీనికి సంబంధించిన సాక్ష్యాలు సైతం నా వద్ద ఉన్నాయి. కావాలంటే అవి బయటపెడతాను. నేను ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా యూపీ పోలీసులు కనీసం ఆయనపై కేసు కూడా నమోదు చేయలేదు’ అని  వెల్లడించింది. తనపై జరిగిన అత్యాచారానికి సంబంధించిన పలు ఆధారాలను పెన్‌డ్రైవ్‌లో ఉంచి స్నేహితుల ద్వారా దర్యాప్తు బృందం చేపట్టిన 15 గంటల విచారణ సమయంలో అప్పగించినట్టు ఆమె చెప్పింది.

భాజపా నేత, కేంద్ర మాజీ మంత్రి చిన్మయానంద్‌ తనను లైంగికంగా వేధించారంటూ గత నెల 24న బాధితురాలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆ ఆరోపణలు చేసిన అనంతరం ఆమె అదృశ్యం కావడం కలకలం రేపింది. ఆమె తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమెను రాజస్థాన్‌లో గుర్తించారు. అనంతరం సుప్రీంకోర్టు ఈ కేసును ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్)కు అప్పగించింది. ఇదిలా ఉండగా భాజపా నాయకుడు చిన్మయానంద్‌ మాత్రం రాజకీయంగా తన పరువుకు భంగం కలిగించేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారనడం గమనార్హం.

మరిన్ని

బంగారు మరుగుదొడ్డిని దోచేశారు! [07:29]

అచ్చంగా 18 కేరట్ల బంగారంతో చేసిన మరుగుదొడ్డి ఇది. లండన్‌లోని బ్లనియమ్‌ ప్రాసాదంలోని ప్రదర్శనశాలలో ఉన్న దీనిని శనివారం దొంగలు అపహరించినట్లు పోలీసులు...

నాన్న గుండె పగిలింది [08:42]

నాన్న.. భరోసా కల్పించేవాడు.. బతుకుకు బాట పరిచేవాడు.. అలాంటి నాన్న గుండెలపై చిన్నప్పుడు ఆడుకున్న బిడ్డల చర్యలే ఆ తండ్రిని కలతకు గురిచేశాయి..

అప్పుడు డబ్బు కోసం.. ఇప్పుడు ఆమె కోసం [11:13]

బాలికను అపహరించి అజ్ఞాతంగా ఉంటున్న ఓ యువకుడు... తమ ఖర్చుల కోసం చోరీల బాటపట్టాడు. ఈ క్రమంలో నెల రోజుల్లో 6 చోరీలకు పాల్పడి తప్పించుకుని..

గోదావరిలో పర్యాటక బోటు మునక [13:44]

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం సమీపంలో పర్యాటక బోటు మునిగింది. ఈ బోటులో 50 మంది..

ప్రధానోపాధ్యాయుడి దారుణ హత్య [12:51]

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ గ్రామీణ మండలం తూరంగిలో వెంకట్రావు అనే ప్రధానోపాధ్యాయుడు దారుణ హత్యకు గురయ్యారు...

భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త [11:42]

అనుమానంతో తన భార్యను ఓ భర్త అతి కిరాతకంగా గొడ్డలితో నరికి చంపేశాడు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం మండలంలోని వేగాయమ్మపేట గ్రామంలో...

అన్న చేతిలో తమ్ముడి హతం [10:09]

బనగానపల్లి మండలం చిన్నరాజుపాలెం తండాలో శనివారం హత్య జరిగింది. తాగునీటి విషయమై వివాదం నెలకొనగా తమ్ముడిపై అన్న కట్ట్టెతో దాడిచేసి కత్తితో పొడిచి ...

ప్రాణాలు తీసిన ప్రేమ వ్యవహారం [09:52]

కలిసి బతకాలనుకున్నారు.. పెద్దలు అంగీకరిస్తారో లేదో అనే సందేహం వారికి కలిగింది.. అయినవారికి దూరంగా వెళ్లారు.. అడవిలో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ..

‘సామాజిక’ హత్య [08:31]

వాస్తవాలేంటో తెలియకుండా సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టులు.. రవాణాశాఖ ఇన్‌స్పెక్టర్‌ మృతికి కారణమయ్యాయి. బెంగళూరు ఎలక్ట్రానిక్‌ సిటీ వద్ద మంజునాథ్‌ నడుపుతున్న ...

మస్కట్‌లో ప్రమాదం..ముగ్గురు తెలుగువారి మృతి [06:53]

మస్కట్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌ టోలీచౌకి సాలార్‌జంగ్‌ కాలనీలోని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృత్యువాత పడ్డారు. వరంగల్‌కు చెందిన అజ్మతుల్లాఖాన్‌ కొంత కాలంగా సాలార్జంగ్‌కాలనీలో ఉంటున్నారు...