ప్రశాంతంగా ఉంటే రెచ్చగొట్టారు:చింతమనేని

ఏలూరు: తనపై బనాయించినవి అక్రమ కేసులని.. వాటిని నిరూపిస్తే ఎంతటి శిక్షకైనా సిద్ధమని తెదేపా నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా దుగ్గిరాల నుంచి పోలీసులు అరెస్ట్‌ చేసి తరలిస్తున్న సమయంలో చింతమనేని మీడియాతో మాట్లాడారు. పోలీసులు ఫిర్యాదుదారుల్ని భయపెట్టి తనపై అక్రమ కేసులు బనాయించారని ఆయన ఆరోపించారు. 

కేసులు పెట్టి తన కుటుంబాన్ని, తెదేపా కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని చింతమనేని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఈ మధ్యకాలంలో నేను ఒక్కరోజు కూడా బయటకు రాలేదు. మీడియా ముందు కనిపించలేదు. నా పనేదో నేను చేసుకుంటున్నా. ప్రశాంతంగా ఉన్న నన్ను రెచ్చగొట్టారు. ఏం చేయదలుచుకున్నారో చేయండి. ఏ విచారణకైనా నేను సిద్ధం’’ అంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు. తనపై మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన ఆరోపణలు రుజువు చేస్తే ఆస్తులన్నీ పేదలకు రాసిస్తానని..లేదంటే బొత్స తన పదవి నుంచి తప్పుకుంటారా అని ఆయన సవాల్‌ విసిరారు. జిల్లాలో తెదేపా లేకుండా చేయడానికే తనపై కుట్రలు చేస్తున్నారని చింతమనేని ప్రభాకర్‌ దుయ్యబట్టారు.

మరిన్ని

దీపికపై అభిమానుల ఫైర్‌ [01:02]

బాలీవుడ్‌ నటి దీపిక పదుకొణె ఈ మధ్య కాలంలో ప్రధానంగా వార్తల్లో నిలుస్తోంది. మొన్నటి వరకూ జేఎన్‌యూ సందర్శనపై రాజకీయ నాయకుల నుంచి...

ప్రకాశం బ్యారేజీ మీదుగా రాకపోకలపై ఆంక్షలు [00:55]

అమరావతి పరిరక్షణ సమితి, రాజకీయ పార్టీలు తలపెట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యమానికి అనుమతి లేదని విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు...

‘దొరసాని’ రెండో సినిమా ఖరారు [00:55]

‘దొరసాని’తో హీరోయిన్‌గా రంగప్రవేశం చేసి అభిమానుల మనసు దోచుకున్న శివాత్మిక మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. రొమాంటిక్‌ హీరో ...

రాజధాని కోసం ఆగిన మరో గుండె [00:55]

రాజధాని తరలింపు ప్రకటనల నేపథ్యంలో మరో మహిళా రైతు గుండె ఆగింది. అమరావతి రాజధానిని తరలించవద్దని చేపట్టిన దీక్షా శిబిరంలో...

మోదీ ట్వీట్‌ను కాపీ కొట్టిన బ్యూటీ [00:54]

చాలామంది ప్రముఖులు దేశంలో జరుగుతున్న పరిణామాలపై ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల వేదికగా స్పందిస్తుంటారు. వారి స్పందన...

ఆ రైల్వే స్టేషన్లలో సంస్కృతం [00:54]

ఉత్తరాఖండ్‌ రైల్వేస్టేషన్లలోని నామ ఫలకాలపై ఉర్దూ స్థానంలో ఇకపై సంస్కృతం వచ్చి చేరనుంది. రైల్వే ప్లాట్‌ఫాంపై ఉండే నామ ఫలకాలు ఆ రాష్ట్రానికి చెందిన ద్వితీయ భాష....

సరికొత్త లుక్‌లో బాలకృష్ణ.. ఎందుకోసం..? [00:54]

పాత్ర అంటే ప్రాణం పెట్టే నటుల్లో అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ ఒకరు. ప్రస్తుతం ఆయనకు సంబంధించిన ఒక ఫొటో సామాజిక మాధ్యమాల...

గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం [00:53]

గుజరాత్‌ రాష్ట్రంలోని సురేంద్రనగర్‌ జిల్లా ఘోర దేవ్‌పరా వద్ద ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ప్రకాశం జిల్లాకు చెందిన ఐదుగురు దుర్మరణం చెందగా, మరో ఐదుగురు గాయపడ్డారు.

ఫేస్‌బుక్‌ పోస్టు.. సినిమాలాంటి ట్విస్టు [00:53]

మంచి చేసేవాళ్లకు ఎప్పటికైనా మంచి జరుగుతుందని చాలామంది నమ్ముతారు. ఈ వార్త చదివితే ఎవరికైనా అది  నిజమనిపించక మానదు.

రూపాయి విలువ చేసే చాక్లెట్లు దొంగిలించాడని.. [00:53]

బెంగళూరులో దారుణం జరిగింది. రెండు చాక్లెట్లు దొంగిలించినందుకు ఓ బాలుడి జుట్టు, కనుబొమ్మలు, కనురెప్పల వెంట్రుకలు ఓ సూపర్‌ మార్కెట్‌ యజమాని కత్తిరించాడు...........