ప్రభాస్‌ రాకపోతే ఆత్మహత్య చేసుకుంటా!

సెల్‌ టవర్‌ ఎక్కి యువకుడి హల్‌చల్‌

జనగామ పట్టణం: కథానాయకుడు ప్రభాస్‌ తనను కలవడానికి రావాలని, లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ఓ యువకుడు హల్‌చల్‌ చేశాడు. జనగామ జిల్లా కేంద్రంలోని హన్మకొండలో ఈ సంఘటన చోటుచేసుకుంది. పట్టణ ఇంఛార్జ్‌ సీఐ సంతోష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం ఉదయం తొమ్మిది గంటల సమయంలో మహబూబ్‌నగర్‌కు చెందిన వెంకన్న హన్మకొండ రహదారి పక్కనున్న సెల్‌టవర్‌పైకి ఎక్కాడు. అతడ్ని గమనించిన స్థానికులు కిందికి దిగమని కోరగా.. ససేమిరా అన్నాడు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అతడ్ని కిందికి దిగమని కోరగా.. హీరో ప్రభాస్‌ ఇక్కడికి వస్తేనే దిగుతానని, లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానని అన్నాడు. అలా దాదాపు నాలుగు గంటలపాటు టవర్‌పైనే హల్‌చల్‌ చేశాడు. డీసీపీ శ్రీనివాసరెడ్డి, ఏసీపీ వినోద్‌ కుమార్‌ టవర్‌ వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఎట్టకేలకు పోలీసులు, స్థానికుల విజ్ఞప్తి మేరకు వెంకన్న టవర్‌ దిగి, కిందికి వచ్చాడు. అతడి మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో యువకుడిని జిల్లా ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు.


మరిన్ని

సరికొత్త లుక్‌లో బాలకృష్ణ.. ఎందుకోసం..? [00:54]

పాత్ర అంటే ప్రాణం పెట్టే నటుల్లో అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ ఒకరు. ప్రస్తుతం ఆయనకు సంబంధించిన ఒక ఫొటో సామాజిక మాధ్యమాల...

‘దొరసాని’ రెండో సినిమా ఖరారు [00:55]

‘దొరసాని’తో హీరోయిన్‌గా రంగప్రవేశం చేసి అభిమానుల మనసు దోచుకున్న శివాత్మిక మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. రొమాంటిక్‌ హీరో ...

మోదీ ట్వీట్‌ను కాపీ కొట్టిన బ్యూటీ [00:54]

చాలామంది ప్రముఖులు దేశంలో జరుగుతున్న పరిణామాలపై ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల వేదికగా స్పందిస్తుంటారు. వారి స్పందన...