భావితరాలకు కాలుష్య తెలంగాణఇస్తామా?:పవన్‌

హైదరాబాద్‌: నల్లమలలో యురేనియం తవ్వకాలపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మరోసారి స్పందించారు. ఈ మేరకు బుధవారం ఆయన ట్వీట్‌ చేశారు. భావి తరాలకు బంగారు తెలంగాణ ఇస్తామా? యురేనియం కాలుష్య తెలంగాణ ఇస్తామా? అనేది అన్ని ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు ఆలోచించుకోవాలని సూచించారు. నల్లమల అడవుల సంరక్షణకు జనసేన పార్టీ మద్దతుగా నిలబడుతుందని స్పష్టంచేశారు. ఇటీవల కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ వీహెచ్‌ కూడా పవన్‌ను కలిసి యురేనియం సమస్యపై చర్చించిన విషయం తెలిసిందే. యురేనియం తవ్వకాల వల్ల తెలుగు రాష్ట్రాలకు ముప్పు వాటిల్లుతుందని.. కృష్ణా జలాలు సైతం కలుషితమవుతాయని పవన్‌ ఆందోళన వ్యక్తంచేశారు. ఈ అంశంపై అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. 

మరిన్ని

విశాఖలో ‘అల..’ విజయోత్సవ సభ [00:36]

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం ‘అల.. వైకుంఠపురములో’. సంక్రాంతి కానుకగా విడుదలై రూ.100కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఈ సందర్భంగా...

భాజపా జాతీయ అధ్యక్షుడి ఎన్నిక నేడు [00:05]

భాజపా జాతీయ అధ్యక్షుడి కోసం సోమవారం ఎన్నిక నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం 10:30 నుంచి నామినేషన్‌ ప్రక్రియ చేపట్టనున్నారు. మధ్యాహ్నం 12.30 వరకు

రాహుల్‌ ఔటయ్యాక.. అదే అనుకున్నాం [00:01]

ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో కేఎల్‌ రాహుల్‌(19) ఔటయ్యాక.. కోహ్లీ, తాను ఇన్నింగ్స్‌ చక్కదిద్దాలని అనుకున్నామని ఓపెనర్‌ రోహిత్‌శర్మ అన్నాడు...

సీఏఏని విభేదించే హక్కు రాష్ట్రాలకుంది: కాంగ్రెస్ [00:00]

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం విషయంలో విభేదించే హక్కు రాష్ట్రాలకు ఉందని కాంగ్రెస్‌ పార్టీ పేర్కొంది. సీఏఏ అంశం కోర్టులో తేలే వరకు రాజ్యాంగ విరుద్ధమైన చట్టాన్ని....