కేరళ ఆత్మకు అతడు ప్రతిబింబం: సచిన్‌

ముంబయి: టీమిండియా క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందుల్కర్‌ తన అభిమానులకు ఓనం పండుగ శుభాకాంక్షలు తెలియజేశాడు. ఈ మధ్యే కేరళలో ఓ అభిమానిని కలుసుకొన్న సంఘటనను గుర్తు చేసుకున్నారు. కాలి వేళ్లతో చిత్రాలు గీసే చిత్రాకారుడు అతడు. ‘అందరికీ ఓనం శుభాకాంక్షలు. ఈ వేడుక మీ అందరికీ ఆనందం, సౌభాగ్యం అందించాలని కోరుకుంటున్నాను. కాలి వేళ్లతో చిత్రాలు గీసే ప్రణవ్‌ను ఈ మధ్యే కలుసుకున్నాను. అతడి ప్రేరణ, స్ఫూర్తికి పరవశించాను. నా వరకు అసలైన కేరళ స్ఫూర్తికి ఇది ప్రతిబింబం’ అని సచిన్‌ ట్వీట్‌ చేశాడు. ఆయనతో పాటు టీమిండియా క్రికెటర్లు అజింక్య రహానె, సురేశ్‌ రైనా సైతం అభిమానులకు ఓనం శుభాకాంక్షలు తెలియజేశారు.

సచిన్‌ ఈ మధ్యే బాలీవుడ్‌ కథానాయకులు వరుణ్‌ ధావన్‌, అభిషేక్‌ బచ్చన్‌తో కలిసి గల్లీ క్రికెట్‌ ఆడి అలరించాడు. ఇక వెస్టిండీస్‌ సిరీస్‌లో అజింక్య రహానె అద్భుతంగా ఆడాడు. రెండేళ్ల తర్వాత శతకం సాధించాడు. సిరీస్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు. హనుమ విహారి తర్వాత అత్యధిక పరుగులు సాధించింది అతడే.

మరిన్ని

2-1తేడాతో లెక్క సరిచేశారు [00:51]

ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో భారత్‌ కైవసం చేసుకుంది...

హార్దిక్‌ కోసం టీమిండియా ఎంపిక ఆలస్యం! [00:52]

మరికొన్ని రోజుల్లో కోహ్లీసేన న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుంది. జనవరి 24 నుంచి అయిదు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. ఈ సిరీస్‌లకు భారత జట్టును ఆదివారం సెలక్టర్లు ఎంపిక చేయాల్సి ఉంది. అయితే కివీస్‌ పర్యటనకు భారత

అండర్‌ 19లో యువ భారత్‌ విజయం [00:50]

అండర్‌ 19 ప్రపంచకప్‌లో భారత్‌ శుభారంభం చేసింది. శ్రీలంక జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా 90 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది...

రాహుల్‌ ఔటయ్యాక.. అదే అనుకున్నాం [00:50]

ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో కేఎల్‌ రాహుల్‌(19) ఔటయ్యాక.. కోహ్లీ, తాను ఇన్నింగ్స్‌ చక్కదిద్దాలని అనుకున్నామని ఓపెనర్‌ రోహిత్‌శర్మ అన్నాడు...