నూర్‌వలీ ఉగ్రవాదే.. అమెరికా

ఉత్తర్వు విడుదల చేసిన అమెరికా

న్యూయార్క్‌: ఉగ్రవాదులకు పాకిస్థాన్‌ అడ్డా అనే విషయాన్ని మరింత బలపర్చేలా అమెరికా తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. తెహ్రెక్‌-ఏ తాలిబన్‌ పాకిస్థాన్‌ (టీటీపీ) ఉగ్ర సంస్థ చీఫ్‌ నూర్‌ వలీ సహా మరికొంత మందిని అగ్రరాజ్యం ఉగ్రవాదులుగా ప్రకటించింది. ఈ మేరకు ట్రంప్‌ సంతకంతో కూడిన కార్యనిర్వాహక ఉత్తర్వు విడుదలైంది. 2001 సెప్టెంబరులో అమెరికాపై జరిగిన ఉగ్రదాడులకు గుర్తుగా మంగళవారం ఈ ఉత్తర్వును విడుదల చేశారు. టీటీపీ సహా మరో 11 ఉగ్ర సంస్థలు, అందులోని ఉగ్రవాదులను ఈ జాబితాలో చేర్చారు. ఇలా చేయడం ద్వారా ఉగ్ర సంస్థల నాయకులపై నిఘాతోపాటు ఎవరెవరు ఉగ్ర శిక్షణ శిబిరాల్లో పాల్గొంటున్నారో తెలుసుకోవడం అమెరికా ప్రభుత్వానికి సులువవుతుందని ట్రెజరీ విభాగం కార్యదర్శి స్టీవెన్‌ మ్నుచిన్‌ అన్నారు. గతంలో కన్నా మరింత మెరుగ్గా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటున్నామని, వారికి ఆర్థిక వనరులను నిలువరించడం లక్ష్యంగా పని చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యనిర్వాహక ఉత్తర్వును అత్యంత ముఖ్యమైనదిగా అమెరికా ఉపాధ్యక్షుడు మైక్‌ పాంపియో అభివర్ణించారు.  అమెరికా అధికార పరిధికి లోబడి ఉత్తర్వులో పేర్కొన్న వారి ఆస్తులన్నీ స్తంభింప చేసే వీలుంటుందని, అమెరికా పౌరులు వీరితో ఎలాంటి లావాదేవీలూ జరపకుండా నిషేధించవచ్చని పాంపియో వెల్లడించారు.
టీటీపీ మాజీ చీఫ్‌ ముల్లాహ్‌ ఫజుల్లాహ్‌ 2018లో మృతి చెందిన నాటి నుంచి ఆ సంస్థకు నూర్‌ వలీ నాయకత్వం వహిస్తున్నాడు. ఈయన నాయకత్వంలోనే పాకిస్థాన్‌లో చాలా చోట్ల దాడులు జరిగాయి. వీటికి తామే బాధ్యులమని టీటీపీ సంస్థ ప్రకటించుకుంది.

మరిన్ని

సీఏఏని విభేదించే హక్కు రాష్ట్రాలకుంది: కాంగ్రెస్ [00:50]

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం విషయంలో విభేదించే హక్కు రాష్ట్రాలకు ఉందని కాంగ్రెస్‌ పార్టీ పేర్కొంది. సీఏఏ అంశం కోర్టులో తేలే వరకు రాజ్యాంగ విరుద్ధమైన చట్టాన్ని....

కశ్మీర్‌లో ఇంటర్నెట్ అవి చూసేందుకే కదా! [00:49]

జమ్ముకశ్మీర్లో ఆర్టికల్‌ 370ని కేంద్రప్రభుత్వం రద్దు చేసిన తర్వాత అక్కడ ఇంటర్నెట్‌ సేవలు నిలిపివేయడాన్ని నీతిఆయోగ్‌ సభ్యుడు, జేఎన్‌యూ ఛాన్సలర్‌ వీకే సరస్వత్‌ సమర్థించుకున్నారు. ఆ ప్రాంతంలో అంతర్జాలాన్ని నిలిపివేయడం వల్ల పెద్దగా నష్టమేమీలేదని ఆయన అన్నారు.  ‘‘ కశ్మీర్లో  ఇంటర్నెట్‌ అందుబాటులో ఉన్నప్పుడు, లేనప్పుడు ఏం తేడా కనిపించింది.  అక్కడ ఇంటర్నెట్లో ఏం చూస్తారు...

భారత్‌లో ద్రవ్యలోటు లేదు: గడ్కరీ [00:49]

భారత్‌లో ద్రవ్యలోటు లేదని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ వెల్లడించారు. ఈ ఏడాది మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.5 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. నాగపూర్‌లోని విశ్వేశ్వరాయ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ...

లూనార్‌ న్యూఇయర్‌కు ముస్తాబైన చైనా [00:49]

లూనార్‌ నూతన సంవత్సర వేడుకలకు చైనా ముస్తాబవుతుంది. లూనార్‌ సంవత్సరం ఏటా జనవరి 25న ప్రారంభం కానుండగా..