ఐరాసలో పారని పాక్‌ పాచిక..

ఇంటర్నెట్‌డెస్క్‌: జమ్మూకశ్మీర్‌ అంశంలో ఐక్యరాజ్యసమితిలో పాకిస్థాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఐరాస మధ్యవర్తిత్వం వహిస్తుందని ఆశించిన ఆ దేశానికి యూఎన్‌ ప్రతినిధి స్టీఫెన్‌ డుజరిక్‌ చేసిన వ్యాఖ్యలతో దిమ్మ తిరిగినట్లైంది. కశ్మీర్‌ అంశంపై మాట్లాడిన ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌  ‘ఈ విషయంలో మేము జోక్యం చేసుకోలేము. ఇది భారత్‌, పాక్‌లే ద్వైపాక్షికంగా చర్చించుకుని పరిష్కరించుకోవాలి’ అని అన్నారని డుజరిక్‌ మీడియాతో వెల్లడించారు. 

అదేవిధంగా డుజరిక్‌ మాట్లాడుతూ.. ‘గతనెలలో ఫ్రాన్స్‌ బియారిట్జ్‌లో నిర్వహించిన జీ7 సదస్సులో భాగంగా గుటెరస్‌ కశ్మీర్‌ అంశంపై భారత ప్రధాని నరేంద్రమోదీతోనూ, పాక్‌ విదేశాంగ మంత్రి షామహ్మద్‌ ఖురేషీతోనూ మాట్లాడారు. అంతేకాకుండా యూఎన్‌లో పాకిస్థాన్‌ ప్రతినిధి మలీహ లోధి వినతి మేరకు కశ్మీర్‌ అంశంపై గుటెరస్‌ ఆమెతో కూడా సమావేశమయ్యారు. అయినప్పటికీ ఈ అంశంపై ఎట్టి పరిస్థితిలోనూ తాము జోక్యం చేసుకోమని గుటెరస్‌ వెల్లడించారు. రెండు దేశాల నుంచి మధ్యవర్తిత్వం కోరితే మేము అందించడానికి సిద్ధమే అన్నారు. కానీ భారత్‌ ఇప్పటికే కశ్మీర్‌ తమ అంతర్గత విషయమని అంతర్జాతీయ సమాజం ముందు తేల్చి చెప్పిందని అన్నారని’ డుజరిక్‌ వెల్లడించారు. 

జమ్మూకశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370ని భారత ప్రభుత్వం ఆగస్టు 5న రద్దు చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి పాక్‌ భారత్‌పై తన అక్కసు వెల్లగక్కుతోంది. మధ్యవర్తిత్వం వహించాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరుతోంది. ఈ క్రమంలో యూఎన్‌ ఈ విషయంపై స్పందిస్తూ అది రెండు దేశాల ద్వైపాక్షిక విషయమే అనడం గమనార్హం. 

మరిన్ని

బెంగళూరు పోలీసులకు పుట్టిన రోజు సెలవు [07:40]

విధి నిర్వహణలో క్షణం తీరికలేకుండా గడిపే పోలీసులు తమ పుట్టిన రోజున సెలవు తీసుకుని కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపేందుకు వీలు కల్పిస్తూ బెంగళూరు...

ఆధార్‌ కోసం.. 80 కి.మీ. ప్రయాణం [09:39]

ఆధార్‌ కార్డు నమోదుకు ఓ మహిళ తన చంటిబిడ్డతో సుమారు 80 కి.మీ. దూరంలోని జిల్లా కేంద్రానికి వెళ్లిన ఘటన ఒడిశా రాష్ట్రం మల్కాన్‌గిరి జిల్లాలో శనివారం చోటుచేసుకుంది....

82 మంది మాజీ ఎంపీలు ఇంకా బంగ్లాల్లోనే! [16:07]

గత ప్రభుత్వ హయాంలో వసతి సదుపాయం పొందిన మాజీ ఎంపీలు నేటికీ తమ బంగ్లాలు ఖాళీ చేయడం లేదు. కొత్త ఎంపీలకు నివాస సదుపాయాలు కల్పించాల్సిన నేపథ్యంలో....

పాక్‌ 2050 సార్లు మాట తప్పింది [15:08]

కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని తొలగించి మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని ఐరాస మానవ హక్కుల మండలిలో పాక్‌ చేసిన ఆరోపణలకు భారత్‌ సాక్ష్యాలతో బుద్ధి చెప్పింది...

ఆరని ‘హిందీ’ మంటలు! [14:20]

హిందీ భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా చేసిన ‘ఒకే దేశం-ఒకే భాష’ వ్యాఖ్యలు ఇంకా ప్రకంపనలు సృష్టిస్తూనే ఉన్నాయి. తాజాగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ స్పందిస్తూ....................

గడ్చిరోలిలో కాల్పులు.. ఇద్దరు నక్సల్స్‌ హతం [12:39]

మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా గ్యారపట్టి గ్రామంలో భద్రతాదళాలు, నక్సలైట్లకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఆదివారం జరిగిన ఈ ఘటనలో ఇద్దరు నక్సల్స్‌ మృతి చెందారు...............

భారత్‌తో మేం గెలవకపోవచ్చు: ఇమ్రాన్‌ [10:20]

భారత్‌ ముందు తమ సామర్థ్యం ఏమాత్రం నిలవదని పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ పరోక్షంగా అంగీకరించారు. ఇరు దేశాల మధ్య సాంప్రదాయ యుద్ధమే గనక వస్తే పాకిస్థాన్‌ ఓడిపోయే అవకాశాలు...................

ట్రక్కు యజమానికి రూ.6.50లక్షల జరిమానా [00:30]

ట్రాఫిక్‌ జరిమానాల పుణ్యమా అని ప్రజల సంపాదన గురించి పక్కన పెడితే వారి జేబులకు మాత్రం చిల్లులు పడుతున్నాయి. ట్రాఫిక్‌ నియమాలు ఉల్లంఘించారంటూ దిలీప్‌ కర్తా అనే డ్రైవర్‌కు ఏకంగా రూ.6.53లక్షల జరిమానా విధించారు......

మధ్యప్రదేశ్ వృద్ధుడి తలపై కొమ్ము మొలిచింది [00:30]

మధ్యప్రదేశ్ వృద్దుడి తల నుండిఒక కొమ్ములాంటి విచిత్ర మైన ఆకృతి కొన్ని సంవత్సరాల క్రితం పెరగడం ప్రారంభించింది. 

దరఖాస్తుదారుల అందరి వివరాలతో ఎన్నార్సీ జాబితా! [00:30]

అసోంలో ఎన్నార్సీకి దరఖాస్తు చేసుకున్న అందరి వివరాలతో కూడిన పూర్తి స్థాయి జాబితాను కేంద్ర ప్రభుత్వం శనివారం విడుదల చేసింది. మొత్తం 3.30కోట్ల మంది దరఖాస్తుదారుల వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరిచారు......................