అన్నీ ఎత్తు చెప్పులే... అన్నింట్లోనూ మొక్కలే!

బయటకు వెళ్లినప్పుడల్లా కంటికి కనిపించేవన్నీ కొనేయడం చాలామందికి అలవాటు. చెప్పుల విషయంలోనూ అదే జరుగుతుంది.  పాత, కొత్త చెప్పులతో స్టాండంతా నిండిపోతుంది. వాటిని బయట పడేయలేం.. వాడనూలేం. మీ పరిస్థితీ అదే అయితే... అలాంటి వాటిని పూలకుండీలుగా మార్చేయండి. ప్రతి చెప్పులో మట్టి నింపి, వాటిలో ఇండోర్‌, కాక్టస్‌ మొక్కలు నాటితే చాలు... వీటిని వరండాలోనే కాదు, డాబామీద అందంగా అమరిస్తే ఇంటికే కళ వస్తుంది. ప్రయత్నించండి.

 

మరిన్ని

వెతుక్కోవాల్సిన పనిలేదిక! [00:49]

వంటగదిలో పైన ఉండే అల్మారాలు సాధారణంగా చీకటిగా ఉంటాయి. తలుపు తీయగానే లోపల ఏం ఉన్నాయో అర్థంకాదు. మనకు కావాల్సిన వస్తువు అక్కడ ఉందో లేదో కూడా తెలియదు. అలాంటి ఇబ్బంది కలగకుండా చేసేదే ఈ ‘కిచెన్‌ క్యాబినెట్‌ సెన్సర్‌ లైట్‌’. దీన్ని సులువుగా అల్మారా లోపల అమర్చుకోవచ్చు.

చీకటితో తలపడి వెలుగై నిలబడి [00:48]

మనకున్న లోపాలను మరిచిపోవాలంటే... మనం ఏదో ఒక పనిలో మునిగిపోవాలి. అలా జూడోలో మునిగిపోయి, అందులో ఆరితేరి... ఇప్పుడు పారా ఒలింపిక్స్‌కు ఎంపికైంది రమ. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం పెద్దకొంగరాం గ్రామానికి చెందిన రమకు పుట్టుకతోనే అంధత్వం శాపంగా మారింది. దాన్ని అధిగమించడానికి ఆమె బాల్యం నుంచే పోరాటం మొదలెట్టింది. అమ్మానాన్నలు రమకు మిగతా పిల్లల్లాగే సమాన అవకాశాలు అందించారు. తెల్లవారుజామున 4గంటలకు లేపి చదివించేవారు. 5 గంటల నుంచి వ్యాయామ శిక్షణ ఇప్పించేవారు. వేసవి సెలవుల్లో పల్లెకు దూరంగా ఉన్న పశువుల కొట్టానికి సైకిల్‌పై తీసుకెళ్లి వెయిట్‌లిఫ్టింగ్‌లో సాధన చేయించేవారు. ఇలా అథ్లెటిక్స్‌, పవర్‌లిఫ్టింగ్‌, జూడోలో ప్రతిభ చూపారు. జాతీయ స్థాయి జూడో పోటీల్లో కాంస్య పతకం సాధించారు. పారా ఒలింపిక్స్‌ పోటీలకు ఎంపికయ్యారు. 

నల్లని జుట్టుకోసం... [00:48]

నల్లని ఒత్తయిన కురులు ఎవరికిష్టం ఉండదు చెప్పండి. అయితే కొందరిలో జుట్టు చిన్న వయసులోనే నెరుస్తుంది. మరి నెరిసిన కురులను నల్లగా మెరిపించాలంటే కొన్ని చిట్కాలను పాటిస్తే సరి. వంటింట్లో ఉండే పదార్థాలతో ఇలా ప్రయత్నించండి..

పాతబస్సులు ఆత్మగౌరవమయ్యాయి! [00:48]

నిత్యం ఏదో ఒక పనిమీద బయటకు వెళ్లే మహిళలకు ప్రత్యేక శౌచాలయాలు ఎక్కడా ఉండవు. దీన్ని గమనించారు పుణెకు చెందిన ఉల్కా సదాల్కర్‌. అప్పటికే పబ్లిక్‌ ఈవెంట్లకు మొబైల్‌ టాయిలెట్లు ఏర్పాటు చేయించే వ్యాపారంలో ఉన్న ఆమె, పాత బస్సులను మోడ్రన్‌ టాయిలెట్లుగా మార్చి మహిళల అవసరాలను తీరుస్తున్నారు.