పెట్టుబడి పెట్టే సంస్థలు ఉన్నాయా?

నేను ఫ్యాషన్‌ కోర్సు పూర్తి చేశా. పెళ్లయ్యాక రెండేళ్లు ఇంటికే పరిమితమయ్యా.  ఇప్పుడు సొంతంగా ఓ బొతిక్‌ ఏర్పాటు చేయాలనుకుంటున్నా. నాకు ఏమైనా ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయా? పూచీకత్తుకి ఏం అవసరమవుతాయి? నాకు ఎంత మొత్తంలో సాయం అందొచ్చు. రాయితీ ఎలా ఉంటుంది? 

- ఓ సోదరి

 

మీలాంటి వాళ్లకోసం ప్రభుత్వాలు, బ్యాంకులు వివిధ రకాల రాయితీలతో ఆర్థిక భరోసా, నైపుణ్యాల శిక్షణ అందిస్తున్నాయి. మీకు ఈ స్కీములు ఉపయోగపడొచ్చు.

ముద్ర యోజన స్కీం ఫర్‌ ఉమెన్‌: వ్యక్తిగతంగా తమ కాళ్లపై తాము నిలబడాలనుకునే మహిళలకు సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. బ్యూటీపార్లర్లు, టైలరింగ్‌ యూనిట్‌లు, ట్యూషన్‌ సెంటర్లు... వంటి కుటీర పరిశ్రమలకు ఈ పథకం కింద సాయం అందుతుంది. దీనికి కొలేటరల్‌ సెక్యూరిటీ అవసరం లేదు. ఇందులోనే... మూడు రకాలున్నాయి.

శిశు: వ్యాపారం ప్రారంభించాలనుకునేవారికి ప్రాథమిక స్థాయిలో అవసరమయ్యే యాభైవేల రూపాయలను దీనికింద అందిస్తారు.

కిశోర్‌: ఈ పథకం కింద యాభైవేల నుంచి 5 లక్షల రూపాయల్లోపు మొత్తం కొంత కుదురుకున్న వ్యాపారాలకు లభిస్తుంది.

తరుణ్‌: వ్యాపారం విస్తరించాలనుకునేవారికి ఈ పథకం ద్వారా పది లక్షల రూపాయల వరకూ రుణం అందుతుంది.
రుణం అనుమతి పొందాక ఒక ముద్ర కార్డుని అందిస్తారు. క్రెడిట్‌ కార్డు  తరహాలో దాన్ని ఉపయోగించుకోవచ్చు. ఇందులో రుణం మొత్తంలో పదిశాతం ఉంటుంది.  దీనికి వ్యాపార ప్రణాళిక, పాన్‌, ఆధార్‌, వంటి మరికొన్ని పత్రాలు అవసరం అవుతాయి.

స్త్రీశక్తి ప్యాకేజ్‌ ఫర్‌ విమెన్‌ ఎంటర్‌ప్రెన్యూర్స్‌: దీన్ని ఎస్‌బీఐ అందిస్తోంది. ఏదైనా వ్యాపారంలో యాభైశాతం వాటా ఉన్నప్పుడు ఈ పథకం ద్వారా రెండు లక్షల రూపాయలకు పైగా రుణం తీసుకున్నప్పుడు.... 0.50 శాతం చొప్పున అందిస్తారు.

భారతీయ మహిళా బ్యాంకు బిజినెస్‌ లోన్‌: ఇప్పుడిప్పుడే వ్యాపారంలో అడుగులు వేస్తోన్న మహిళలకు, రీటైల్‌ వ్యాపారం విస్తరించాలనుకునేవారికి సూక్ష్మ, ఎంఎస్‌ఎమ్‌ఈ రుణాలను అందిస్తోంది. దీనిలో 10.15శాతం అంతకంటే ఎక్కువ వడ్డీతో ఇస్తోంది.

సెంట్‌ కల్యాణీ స్కీమ్‌: ఈ పథకాన్నిసెంట్రల్‌ బ్యాంకు అందిస్తోంది.  కొత్త వ్యాపారం మొదలుపెట్టడానికి, అభివృద్ధి పరచుకోవడానికి దీన్ని అందిస్తున్నారు. సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల్లో రాణిస్తోన్న మహిళలు, వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు, రీటైల్‌, ట్రేడ్‌, ప్రభుత్వ స్పాన్సర్డ్‌ కార్యక్రమాలను నిర్వహిస్తోన్న మహిళలకు లభిస్తుంది. దీనికి కొలేటరల్‌ సెక్యూరిటీ అవసరం లేదు. ప్రాసెసింగ్‌ ఫీజు ఉండదు. కోటి రూపాయలవరకూ ఈ పథకం కింద అందిస్తారు.

మహిళా ఉద్యమ్‌ నిధి స్కీమ్‌: చిన్న తరహా పరిశ్రమలకు చెందిన మహిళలకు పదేళ్ల కాలానికి పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు అందిస్తుంది. దీనిలో భాగంగా బ్యూటీపార్లర్లు, డే కేర్‌ సెంటర్లు, ఆటో రిక్షాలు, ద్విచక్ర వాహనాల కొనుగోలుకు మార్కెట్‌ రేటుకి అనుగుణంగా పదిలక్షల వరకూ లోన్లు అందిస్తారు.

ఇంటి దగ్గరే ఉండి ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేయాలనుకున్న మహిళలకు ఇది చక్కని అవకాశం. వ్యాపారం చేయాలనుకున్నా, మార్కెటింగ్‌లో మెలకువలు తెలుసుకోవాలనుకున్నా, కొత్త అంశాల్లో శిక్షణ తీసుకోవాలనుకున్నా... మీకున్న సందేహాలను మాకు పంపించండి. వాటికి సమాధానాలు అందించే ప్రయత్నం మేం చేస్తాం! మా చిరునామా... email: vasundhara@eenadu.net

మరిన్ని

గుండె ఆరోగ్యానికి... [01:19]

చిన్నప్పటినుంచీ తాడాట ఆడటం మనలో చాలామంది చేసిందే. ఈసారి తాడు సాయం లేకుండా గెంతేందుకు ప్రయత్నించండి. దీనివల్ల కలిగే లాభాలేంటో చూద్దామా...

చర్మం పొడిబారకుండా... [01:19]

చర్మం పొడిబారే సమస్య చాలామందిని ఇబ్బంది పెడుతుంది. అలాంటివారి కోసమే హ్యుమిడిఫయర్‌ అనే పరికరం అందుబాటులోకి వచ్చింది. ఇది గాలిలో తేమ శాతాన్ని పెంచి చర్మం పొడిబారకుండా, పగలకుండా చేస్తుంది. జలుబుకు కారణమయ్యే క్రిముల

కొత్తిమీరతో కాంతి! [01:18]

గుప్పెడు తాజా కొత్తిమీర తరుగులో రెండు చెంచాల కలబంద రసం కలిపి మెత్తగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఇరవై నిమిషాల తరువాత చల్లటి నీటితో కడిగేయాలి. కలబంద ముడతలు, గీతలను తగ్గిస్తుంది.

ఆ ఊరు వారికోసమే! [01:17]

సిరియా పేరు చెబితే చాలు... అంతర్గత యుద్ధాలే గుర్తొస్తాయి. వాటిల్లో నేలకొరిగిన సైనికులెందరో. ఆ అమరుల భార్యలకోసం ఏర్పాటైందే జిన్‌వార్‌ అనే గ్రామం. దీన్ని అక్కడి మహిళాసంఘాల ప్రోత్సాహంతో ఏర్పాటు చేశారు. స్కూలు, ఆరోగ్యకేంద్రం... వంటివీ ఉంటాయక్కడ.

బొద్దుగా ఉన్నా... అలా కనిపించకూడదంటే? [01:17]

నేను ఎంబీఏ చదువుతున్నా. లావుగా ఉంటా. సన్నగా ఉండేవారికోసం చాలా రకాల డిజైన్లలో దుస్తులు దొరుకుతాయి. నేను ఏం ఎంచుకున్నా నప్పడంలేదనిపిస్తోంది. నాకెలాంటి రంగులు, దుస్తులు బాగుంటాయి

పిల్లల కోసం పనిచేస్తున్నా! [01:17]

కాలేజీ చదువు ఇంకా పూర్తికాలేదు కానీ... ఆమె మాత్రం బాలికలకోసం ఓ ఎన్జీవోనే ప్రారంభించింది. అమ్మాయిలకు స్వీయ రక్షణతో పాటు సామాజిక అంశాలపైనా అవగాహన కల్పిస్తోంది. కరమ్‌వీర్‌చక్ర అవార్డుకు ఎంపికైన ఆమే షెర్లీ దేవరపల్లి.