పీవీ అమ్మకాల్లో పడిన మారుతీ వాటా

పెరిగిన హ్యుందయ్‌, మహీంద్రా షేర్‌

న్యూదిల్లీ: వాహనాల అమ్మకాల్లో మందగమనం నేపథ్యంలో దేశీయంగా ప్రయాణికుల వాహనాలను (పీవీ) తయారు చేసే మారుతీ సుజుకీ, టాటామోటార్స్‌ మార్కెట్‌ వాటాలు పడిపోయాయి. ఏప్రిల్‌-ఆగస్టు అమ్మకాల్లో ఆ కంపెనీలు క్షీణత చూశాయి. అదే సమయంలో హ్యుందాయ్‌, మహీంద్రా విక్రయాలు తగ్గినప్పటికీ మార్కెట్‌ వాటాను మాత్రం పెంచుకోగలిగాయని సియామ్‌ లెక్కలు చెబుతున్నాయి.

దేశంలో అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ అయిన మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ) ఏప్రిల్‌-ఆగస్టు మధ్య కాలంలో రెండు శాతం మేర తన మార్కెట్‌ వాటాను కోల్పోయింది. దీంతో ఆ కంపెనీ మార్కెట్‌ వాటా 50 శాతం దిగువకు చేరింది. మొత్తంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ కాలంలో 5,55,064 వాహనాలను విక్రయించింది. గతేడాది ఇదే సమయంలో 7,57,289 వాహనాలను విక్రయించింది. దీంతో గతేడాది 52.16 శాతంగా ఉన్న మార్కెట్‌ వాటా 49.83కు పడిపోయింది. ఇక మొత్తంగా ఈ కాలంలో ప్రయాణికుల వాహనాలు 11,09,930 యూనిట్లు అమ్ముడయ్యాయి. గతేడాది ఇదే సమయంలో వీటి విక్రయాలు 14,51,647గా నమోదవ్వడం గమనార్హం. మరో అతిపెద్ద వాహన తయారీ దారు టాటామోటార్స్‌ సైతం ఇదే కాలంలో 60,093 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. గతేడాది ఇదే సమయంలో 98,702 యూనిట్ల మేర ప్రయాణికుల వాహనాలను విక్రయించింది. దీంతో ఆ కంపెనీ మార్కెట్‌ వాటా 6.79శాతం నుంచి 1.39 శాతం మేర పడిపోయి 5.41 శాతంగా నమోదు చేసింది.

మరోవైపు హ్యుందాయ్‌ మోటార్‌ తన మార్కెట్‌ వాటాను పెంచుకోగలిగింది. ఏప్రిల్‌-ఆగస్టు మధ్య కాలంలో ఆ కంపెనీ 2,03,729 యూనిట్లను విక్రయించింది. గతేడాది ఇదే సమయంలో 2,26,396 యూనిట్లు విక్రయించింది. అమ్మకాల సంఖ్య తగ్గినప్పటికీ ఆ కంపెనీ తన మార్కెట్‌ వాటాను 15.59శాతం నుంచి 18.36 శాతానికి పెంచుకోవడం గమనార్హం. మహీంద్రా అండ్‌ మహీంద్రా సైతం ఇదే కాలంలో 89,733 యూనిట్లను విక్రయించగా.. గతేడాది ఇదే కాలంలో 1,00,015 వాహనాలను విక్రయించింది. కానీ అదే సమయంలో తన మార్కెట్‌ వాటాను 6.89 శాతం నుంచి 1.19 శాతం మేర పెంచుకుని 8.08 శాతం వాటాను సొంతం చేసుకుంది.

ఇక మిగిలిన కార్ల కంపెనీలైన టయోటా కిలోస్కర్‌ మోటార్‌ తన మార్కెట్‌ వాటాను 4.62 శాతం నుంచి 4.86 శాతానికి పెంచుకుంది. రెనో ఇండియా, స్కోడా ఆటో, ఫోక్స్‌ వ్యాగన్‌ కంపెనీలు సైతం తమ మార్కెట్‌ వాటాలను స్వల్పంగా ఈ కాలంలో పెంచుకోగలిగాయి. మరోవైపు హోండా కార్స్‌ మార్కెట్‌ షేర్‌ 5.48 నుంచి 4.64కి తగ్గగా.. ఫోర్డ్‌ ఇండియా మార్కెట్‌ షేర్‌ 2.81 నుంచి 2.7కి, నిస్సాన్‌ మోటార్‌ ఇండియా మార్కెట్‌ వాటా 1.14 నుంచి 0.73 శాతానికి తగ్గాయి.

మరిన్ని

పెళ్లి బహుమతిగా ఉల్లి.. [12:50]

ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటుతున్న నేపథ్యంలో  ధరల పెరుగుదలపై ప్రజలు పలురూపాల్లో ....

తిరుపతిలో బాలికపై అత్యాచారం:ఇద్దరి అరెస్ట్‌ [13:36]

దేశంలో మహిళలపై అఘాయిత్యాల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇటీవల జరిగిన దిశ ఘటనను మరవక ముందే తిరుపతిలో మరో అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది.

గచ్చిబౌలి స్టేడియంలో ‘వెంకీమామ’ సందడి [21:16]

అగ్ర కథానాయకుడు వెంకటేష్‌ ఆదివారం రాత్రి గచ్చిబౌలి స్టేడియంలో సందడి చేశారు. ఇండియన్‌ సూపర్‌లీగ్‌లో భాగంగా హైదరాబాద్‌ ఎఫ్‌సీ×ఎఫ్‌సీ...

శివమెత్తిన శివమ్‌ [21:02]

శివమ్‌ దూబే (54, 30 బంతుల్లో 3×4, 4×6) రాణించడంతో వెస్టిండీస్‌కు భారత్‌ 171 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమ్‌ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది. భారత్‌కు

టాప్‌ 10 న్యూస్ @ 9 PM [21:00]

మహిళలపై జరుగుతున్న దురాగతాలను అరికట్టడానికి కొత్త చట్టాలను తీసుకురావడమొక్కటే పరిష్కారం కాదని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. అందుకు రాజకీయ సంకల్పం, పాలనా నైపుణ్యాలు అవసరమని అభిప్రాయపడ్డారు. అప్పుడే ఇలాంటి...

‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’ [20:42]

నా చుట్టూ మంటలు అలముకున్నాయి. మహా అయితే రెండు మూడు నిమిషాలు బతుకుతా. నేను చెప్పదలచుకున్నది ఒకటే.. నా కుటుంబాన్ని చక్కగా చూసుకో’’ అంటూ దిల్లీ అగ్నిప్రమాద....

మహేశ్‌-విజయశాంతి ఇది గమనించారా? [20:27]

మహేష్‌బాబు కథానాయకుడిగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక కథనాయిక.

రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు [20:14]

ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. రేపు ఉదయం  ప్రశ్నోత్తరాల తర్వాత జరిగే...

మద్యాన్ని ఆదాయవనరుగా భావించం:ఏపీమంత్రి [20:06]

సమాజంలో ఎన్నో అనర్థాలకు మద్యమే కారణమని.. మూడేళ్లలో రాష్ట్రం నుంచి మద్యాన్ని వెలివేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో

బాలయ్య సరసన రష్మి [19:54]

మాస్‌లో నందమూరి బాలకృష్ణకు ఇమేజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లిన చిత్రాలు ‘సింహా’, ‘లెజెండ్‌’. బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాలు నటుడిగా ...