టాప్‌ 10 న్యూస్‌@ 5 PM

1. గోదావరిలో ఘోర విషాదం: 12 మంది మృతి!

తూర్పుగోదావరి జిల్లా కచులూరు మందం దగ్గర గోదావరిలో జరిగిన పర్యాటక బోటు ప్రమాదం విషాదాంతమైంది. బోటులో పాపికొండల పర్యాటకానికి వెళ్లిన వారిలో ఇప్పటి వరకు 12 మంది మృతిచెందినట్లు తెలుస్తోంది. మరో 24 మంది సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నట్లు సమాచారం. పర్యాటక శాఖ అనుమతిలేని రాయల్‌ వశిష్ఠ ప్రైవేటు బోటు వల్లే ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. యురేనియం తవ్వకాలకు అనుమతులివ్వబోం

యురేనియం తవ్వకాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ అనంతరం ప్రభుత్వం ఎలాంటి అనుమతులివ్వలేదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇచ్చే ఆలోచన కూడా లేదని తేల్చి చెప్పారు. నల్లమల అడవులను నాశనం కానివ్వబోమని అన్నారు. నల్లమలలో యురేనియం నిక్షేపాల అన్వేషణ కోసం ప్రభుత్వం అనుమతులిచ్చిందన్న ఆరోపణలపై ఆదివారం శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టత నిచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. అధికారులతో మాట్లాడిన సీఎం జగన్‌

తూర్పుగోదావరి జిల్లాలోని కచులూరు మందం వద్ద జరిగిన బోటు మునక ఘటనపై సీఎం జగన్‌ ఉన్నతాధికారులతో మాట్లాడారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.  మరోవైపు ఈ ప్రమాదంపై తెదేపా అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటన దురదృష్టకరమని పేర్కొన్నారు. ప్రభుత్వం సహాయకచర్యలను వేగవంతం చేయాలని కోరారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. కొత్త జెర్సీలో టీమిండియా

దక్షిణాఫ్రికాతో తలపడే నేటి మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్లు కొత్త జెర్సీలో దర్శనమివ్వబోతున్నారు. ఇన్నాళ్లు ఒప్పొ స్మార్ట్‌ఫోన్‌ సంస్థ భారత జట్టుకు స్పాన్సర్‌గా వ్యవహరించింది. ఇకపై విద్యకు సంబంధించిన సమాచారం అందించే బైజుస్‌ అనే ఆన్‌లైన్‌ సంస్థ అధికారిక స్పాన్సర్‌గా కొనసాగనుంది. సెప్టెంబర్‌ 5 నుంచి 2022 మార్చి 31 వరకు బైజుస్‌ సంస్థ బీసీసీఐతో ఒప్పందం కుదుర్చుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. సౌదీలో సగానికి పైగా నిలిచిన చమురు ఉత్పత్తి!

సౌదీ అరేబియా ప్రభుత్వ కంపెనీ ఆరాంకోకు చెందిన రెండు ప్రధాన చమురు క్షేత్రాలపై యెమనీ తిరుగుబాటుదారులు డ్రోన్లతో దాడి చేసిన ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని సంస్థ ప్రకటించింది. అన్ని విభాగాలతో పాటు ప్రభుత్వం సకాలంలో స్పందించడంతో పెద్ద ముప్పు తప్పిందని కంపెనీ చీఫ్‌ అమిన్‌ నాసర్‌ తెలిపారు. అయితే దాడి వల్ల భారీగా చమురు శుద్ధి ప్రక్రియ నిలిచిపోయిందన్నారు. దాదాపు సగానికి పైగా అంటే 5.7మిలియన్‌ బ్యారెళ్ల చమురు ఉత్పత్తి ఆగిపోయిందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. బోటు మునకపై పవన్‌ కల్యాణ్‌ స్పందన

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కుచులూరు మందం సమీపంలో పర్యాటక బోటు మునిగిపోవడం పట్ల జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. సహాయక చర్యలు చేపట్టాలని జనసేన శ్రేణులకు సూచించారు. ‘పర్యాటకులతో ఉన్న పడవ మునిగిపోయిందనే సమాచారం నన్ను ఎంతో బాధించింది.  పర్యాటకుల ఆచూకీ, ఇతర సహాయ చర్యల్లో పాల్గొనేందుకు తక్షణం ఘటనా స్థలానికి వెళ్లాలని జనసేన నాయకులకు, శ్రేణులకు విజ్ఞప్తి చేస్తున్నాను’ అని పవన్‌ పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. పాక్‌ 2050 సార్లు మాట తప్పింది

కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని తొలగించి మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని ఐరాస మానవ హక్కుల మండలిలో పాక్‌ చేసిన ఆరోపణలకు భారత్‌ సాక్ష్యాలతో బుద్ధి చెప్పింది. ఈ ఏడాదిలో 2050సార్లు పాక్‌ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆధారాలతో సహా బయటపెట్టింది. ఈ ఘటనల్లో 21 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం ఈరోజు విడుదల చేసిన నివేదికలో ఈ విషయాలను వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. 82 మంది మాజీ ఎంపీలు ఇంకా బంగ్లాల్లోనే!

గత ప్రభుత్వ హయాంలో వసతి సదుపాయం పొందిన మాజీ ఎంపీలు నేటికీ తమ బంగ్లాలు ఖాళీ చేయడం లేదు. కొత్త ఎంపీలకు నివాస సదుపాయాలు కల్పించాల్సిన నేపథ్యంలో ఖాళీ చేయాలని లోక్‌సభ ప్యానెల్‌ సూచించినా వారి ఆదేశాలను బేఖాతరు చేస్తూ.. ఇంకా 82 మంది తమ నివాసాలను ఖాళీ చేయడం లేదని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.  దీంతో వారితో  ఖాళీ చేయించేందుకు తదుపరి చర్యలుంటాయని తెలిపాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ‘అధికారంలోకొస్తే ఆయనపై కేసులు ఎత్తేస్తాం’

ఉత్తర్‌ప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ అధికారంలోకి వస్తే వివాదాస్పద ఎంపీ ఆజంఖాన్‌పై ఉన్న కేసులన్నీ ఎత్తివేస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ అన్నారు. పార్టీ తరఫున ఆజం ఖాన్‌ను పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు. ఖాన్‌ కుటుంబంతో ఎప్పటి నుంచో మంచి సంబంధాలున్నాయని.. తమ బంధం కేవలం రాజకీయాలకే పరిమితం కాదన్నారు. ఖాన్‌ కేసుల విషయంలో గవర్నర్‌ కలవడానికి కూడా సిద్ధంగా ఉన్నామన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఆరని ‘హిందీ’ మంటలు!

హిందీ భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా చేసిన ‘ఒకే దేశం-ఒకే భాష’ వ్యాఖ్యలు ఇంకా ప్రకంపనలు సృష్టిస్తూనే ఉన్నాయి. తాజాగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ స్పందిస్తూ.. బలవంతంగా ఒక భాషను ప్రజలపై రుద్దడం బానిసలుగా చేయడమేనని వ్యాఖ్యానించారు. సినీ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ సైతం అమిత్‌ షా వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

మరిన్ని

బీసీసీఐలోకి ‘బాహుబలి’..వేయికళ్లతో వెయిటింగ్ [00:34]

భారత క్రికెట్‌కు నూతన జవసత్వాలు తీసుకొచ్చిన సౌరవ్‌ గంగూలీ.. మరికొద్ది రోజుల్లో ప్రపంచంలోనే అతి సంపన్న క్రికెట్‌ బోర్డుకు అధ్యక్షుడిగా నియమితులు కానున్నాడు. బీసీసీఐ పీఠంపైకి దాదా రాకకోసం ఆయన అభిమానులు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నారు.

సల్మాన్‌తో దిశా మరోసారి.. [00:30]

బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌తో కలిసి ముద్దుగుమ్మ దిశా పటానీ మరోసారి పనిచేయనున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరు కలిసి ‘భారత్‌’ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కత్రినా కైఫ్‌....

కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో తమిళిసై భేటీ [00:28]

దిల్లీ పర్యటనలో భాగంగా తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో భేటీ అయ్యారు. గవర్నర్‌గా ఆమె పాల్గొన్న సమాజిక కార్యక్రమాలు, బతుకమ్మ సంబరాలపై...

ట్రంప్‌.. మమ్మల్ని నట్టేట్లో ముంచారు.. [00:38]

సిరియాలోని కుర్దులు మళ్లీ మోసపోయారు.2014 నుంచి సిరియా, ఇరాక్‌ దేశాల్లో ఇస్లామిక్‌స్టేట్‌ ఉగ్రవాదులపై వీరి చేయూతతోనే అమెరికా సారథ్యంలోని సంకీర్ణసేనలు విజయం సాధించాయి.

ఎంతో అవమానంగా ఫీలయ్యా: బెంగాల్‌ గవర్నర్‌ [00:38]

పశ్చిమబెంగాల్‌ గవర్నర్‌ జగదీప్‌ ధన్కర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కోల్‌కతాలో జరిగిన దుర్గా పూజ కార్నివాల్‌లో తనకు తీవ్ర అవమానం జరిగిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఇది తనను తీవ్ర ఆవేదనకు, కలతకు గురిచేసిందన్నారు........

బైక్‌పై సీఎం:ఒంటరిగా 122కి.మీ రైడ్‌ [00:38]

అరుణాచల్‌ప్రదేశ్‌లో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించి అభివృద్ధి చేసేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పెమాఖండూ వినూత్నంగా ఆకట్టుకున్నారు. తాజాగా రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే దిశగా స్వయంగా ఆయనే బైక్‌పై ఒంటరిగా 122 కిలోమీటర్లు ప్రయాణం చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు.

విదేశీ ఖైదీల కోసం భారత వ్యాపారి ధాతృత్వం! [00:36]

వారంతా ఉపాధి కోసం దుబాయ్‌కి వెళ్లి చిన్న చిన్న నేరాల్లో చిక్కుకుని జైలు పాలయ్యారు. సంవత్సరాల పాటు శిక్షను అనుభవించి, ప్రస్తుతం విడుదలై వారి సొంత దేశాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. వారిలో పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, ఉగాండా, అఫ్గానిస్థాన్‌, నైజీరియా, చైనా, ఇథియోపియా దేశాలకు చెందిన వారు ఉన్నారు.

‘ఫ్లిప్‌కార్ట్‌ వీడియో..’ కంటెంట్‌ వివరాలివే.. [00:36]

అమెజాన్‌ ప్రైమ్‌, నెట్‌ ఫ్లిక్స్‌కు పోటీగా ఫ్లిప్‌కార్ట్‌ గత ఆగస్టులో ప్రారంభించిన ‘ఫ్లిప్‌కార్ట్‌ వీడియో ఒరిజినల్స్‌’కు సంబంధించిన వివరాలను ఆ సంస్థ మంగళవారం వెల్లడించింది. మధ్య, దిగువ స్థాయి పట్టణాల వినియోగదారులే లక్ష్యంగా తాము

గూగుల్‌ సరికొత్త ఉత్పత్తుల వివరాలివే... [00:36]

అంతర్జాల దిగ్గజం గూగుల్‌ సంస్థ మంగళవారం సరికొత్త ఉత్పత్తులను ఆవిష్కరించింది. పిక్సల్‌ 4, పిక్సల్‌ 4 ఎక్స్‌ఎల్‌, పిక్సల్‌బుక్‌ గో, పిక్సల్‌ బడ్స్‌ వంటి ఉత్పత్తులను విడుదల చేసింది. వీటి ఆవిష్కరణకు సంబంధించిన కార్యక్రమాన్ని ‘‘మేడ్‌ బై గూగుల్‌ '19’’ పేరుతో న్యూయార్క్‌లో నిర్వహించింది. గూగుల్‌ నుంచి రాబోతున్న ఉత్పత్తులపై కొన్ని నెలలుగా ఊహాగానాలు షికారు చేసిన నేపథ్యంలో తాజా

విద్యుత్తు వాహనాల తయారీని నిలిపిన హార్లీ [00:36]

విలాసవంతమైన బైకుల తయారీ సంస్థ హార్లీ డేవిడ్‌సన్‌ విద్యత్తు వాహనాల తయారీని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. ప్రస్తుతం ఆ కంపెనీ ‘లైవ్‌వైర్‌’...