ఛారిటీ కోసం ఫుట్‌బాల్‌ ఆడిన ధోని

అర్జున్ కపూర్‌, లియాండర్‌ పేస్‌తో కలిసి..

ముంబయి: టీమిండియా వికెట్‌కీపర్‌ మహేంద్రసింగ్‌ ధోనీ సోమవారం బాలీవుడ్‌ నటుడు అర్జున్‌కపూర్‌, టెన్నిస్‌ దిగ్గజం లియాండర్‌ పేస్‌తో కలిసి ఓ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ ఆడాడు. రితి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఛారిటి మ్యాచ్‌ కోసం పలువురు క్రికెటర్లతో పాటు మరో బాలివుడ్‌ నటుడు సమిర్‌ కొచ్చార్‌, కొరియోగ్రాఫర్‌ కేసర్‌ గొన్‌సాల్వ్స్‌ పాల్గొన్నారు. రితి స్పోర్డ్స్‌ సంస్థ తమ ఫేస్‌బుక్‌లో ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఆటగాళ్లతో ధోనీ కలిసి ఉన్న ఫొటోలను అభిమానులతో పంచుకుంది.

అంతకుముందు ధోనీ ఆదివారం అర్జున్‌కపూర్‌తో కలిసి సరదాగా ఓ ప్రాక్టీస్‌ మ్యాచ్‌ ఆడాడు. అలాగే గతేడాది అక్టోబర్‌లో సైతం ముంబయిలో నిర్వహించిన ఓ ఛారిటీ సంస్థ కోసం ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ ఆడాడు. అప్పుడు ప్రియాంక చోప్రా భర్త నిక్‌ జోనాస్‌, బాలీవుడ్‌ నటుడు ఇషాన్‌ ఖట్టర్‌ ధోనీతో కలిసి ఆడారు. కాగా టీమిండియా క్రికెటర్‌కి ఫుట్‌బాల్‌ గేమ్‌ అంటే చాలా ఇష్టమనే విషయం తెలిసిందే. ఫుట్‌బాల్‌ ప్రీమియర్‌ లీగ్‌కు ధోనీ బ్రాండ్‌ అంబాసిడర్‌గా కొనసాగుతున్నాడు. మరోవైపు వన్డే ప్రపంచకప్‌ తర్వాత టీమిండియాకు దూరమైన ధోనీ ఆర్మీలో కొద్ది రోజులు సేవలు అందించాడు. ఈ నేపథ్యంలో ధోనీ దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు వస్తాడని ఆశించినా అతడు మరిన్ని రోజులు క్రికెట్‌కు దూరంగా ఉండాలని భావిస్తున్నాడు. దీంతో రాబోయే బంగ్లాదేశ్‌ సిరీస్‌కు సైతం ఆడకపోవచ్చని సమాచారం.

 


మరిన్ని

బీసీసీఐలోకి ‘బాహుబలి’..వేయికళ్లతో వెయిటింగ్ [00:34]

భారత క్రికెట్‌కు నూతన జవసత్వాలు తీసుకొచ్చిన సౌరవ్‌ గంగూలీ.. మరికొద్ది రోజుల్లో ప్రపంచంలోనే అతి సంపన్న క్రికెట్‌ బోర్డుకు అధ్యక్షుడిగా నియమితులు కానున్నాడు. బీసీసీఐ పీఠంపైకి దాదా రాకకోసం ఆయన అభిమానులు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నారు.

స్మిత్‌ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాలి: పాంటింగ్‌ [00:35]

ఆస్ట్రేలియా కెప్టెన్‌గా స్టీవ్‌స్మిత్‌ మళ్లీ బాధ్యతలు చేపడితే చూడాలని ఉందని ఆ జట్టు మాజీ సారథి రిక్కీపాంటింగ్‌ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుత సారథి టిమ్‌పైన్‌ బ్యాటింగ్‌లో...

కాదనుకున్నవాడికే పదవి దక్కింది! [00:35]

వెస్టిండీస్‌కు చెందిన ఫిల్‌ సిమన్స్‌ తిరిగి తన దేశానికే ప్రధాన కోచ్‌గా ఎంపికయ్యాడు. వచ్చే నాలుగేళ్ల వరకు అతడే కోచ్‌గా బాధ్యతలు నిర్వహిస్తాడని

మరిన్ని సవాళ్లు తప్పవు:కుల్‌దీప్‌ [00:34]

ప్రస్తుతం తాను ఎదుర్కొంటున్న సవాళ్లు భవిష్యత్తులో కూడా ఎదురవుతాయని భారత స్పిన్నర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ అన్నాడు. ఇటీవల వెస్టిండీస్‌, దక్షిణాఫ్రికా