ఆ థియేటర్‌లో శక్తులు ఉన్నాయా?

హైదరాబాద్‌: ప్రతినాయకుడిగా కెరీర్‌ను ప్రారంభించి కథానాయకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు జేడీ చక్రవర్తి. ఇటీవల కాలంలో పలు చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా యన్‌.ఎస్‌.సీ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న చిత్రం ‘ఎంఎంఓఎఫ్‌’. దసరా సందర్భంగా ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. ‘నా పేరు దీపక్‌. ఒకప్పుడు మా థియేటర్‌ కూడా కళకళలాడుతూ ఉండేది. మా థియేటర్‌లో ఏవో అనుకోని సంఘటనలు జరుగుతున్నాయి’ అంటూ మొదలైన టీజర్‌ ఆద్యంతం ఉత్కంఠ కలిగించేలా తీర్చిదిద్దారు. అసలు దీపక్‌ థియేటర్‌లో హత్యలు ఎందుకు జరుగుతున్నాయి? ఎవరు చేస్తున్నారు? లేక థియేటర్‌లో ఏవైనా శక్తులు ఉన్నాయా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ప్రొడక్షన్స్‌, జేకే క్రియేషన్స్‌ పతాకంపై రాజా, రాజశేఖర్‌, జేడీ ఖాసింలు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సాయి కార్తీక్‌ సంగీతం అందిస్తున్నారు.


మరిన్ని

సల్మాన్‌తో దిశా మరోసారి.. [00:30]

బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌తో కలిసి ముద్దుగుమ్మ దిశా పటానీ మరోసారి పనిచేయనున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరు కలిసి ‘భారత్‌’ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కత్రినా కైఫ్‌....

అందుకే ఆయన సూపర్‌స్టార్‌.. ఫొటోలు వైరల్‌ [00:31]

వరుస సినిమాలతో బిజీగా ఉన్న రజనీకాంత్‌ షూటింగ్‌లకు కాస్త విరామం ఇచ్చారు. ప్రస్తుతం ఆయన హిమాలయాలకు బయలుదేరి వెళ్లిన సంగతి తెలిసిందే. చెన్నై నుంచి...

సెట్‌కి వెళ్లాక బన్నీ చేసే తొలిపని అదేనట.. [00:30]

చక్కటి నటన, స్టైల్‌తో కోట్లాది అభిమానుల్ని సంపాదించుకున్నారు అల్లు అర్జున్‌. ఆయన ప్రస్తుతం ‘అల వైకుంఠపురములో..’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. కాగా ఈ చిత్రం సెట్‌లో...

‘ప్రతిరోజూ పండగే’.. సర్‌ప్రైజ్‌ చూశారా [00:30]

యువ కథానాయకుడు సాయిధరమ్‌ తేజ్‌ పుట్టినరోజు సందర్భంగా ‘ప్రతిరోజూ పండగే’ చిత్ర బృందం సర్‌ప్రైజ్‌ను విడుదల చేసింది. సినిమాలోని సన్నివేశాలతో కూడిన వీడియోను షేర్‌ చేసింది. ఇందులో తేజ్‌, సత్యరాజ్‌ మధ్య బంధం, కుటుంబ విలువలు....