ఈ ఏడాది గూగుల్‌ మూసేసిన ప్రోడక్ట్‌లివే

కొత్త యాప్‌ / కొత్త సర్వీసును తీసుకురావడం అంటే మాటలా..? దాని గురించి ఎన్ని చర్చలు, ఎన్ని తర్జన భర్జనలు, ఎంత ఖర్చు.. అబ్బో చాలానే ఉంటాయి. అయితే గూగుల్‌ మాత్రం కొత్త సర్వీసులను ఎంత త్వరగా తీసుకొస్తుంటుందో.. అంతే త్వరగా అవసరం లేవనుకున్నవాటిని ముగించేస్తుంది. అలా ఈ ఏడాది ఇప్పటివరకు నిలిపేసిన పది యాప్స్‌/ సర్వీసుల గురించి చూద్దాం!

ఇన్‌బాక్స్‌

‘జీ-మెయిల్‌ వినియోగదారులకు కొత్త అనుభూతినిస్తాం’ అంటూ నాలుగేళ్ల క్రితం వచ్చింది ఇన్‌బాక్స్‌. గూగుల్‌ ఈ ఏడాది దాన్ని మూసేసి ఆ ఫీచర్లను జీ-మెయిల్‌లో కలిపేసింది.
గూగుల్‌ ప్లస్‌

భూత.. వర్తమాన.. భవిష్యత్‌ అనే స్లోగన్‌తో వచ్చిన గూగుల్‌ప్లస్‌కు భవిష్యత్‌ లేకుండా చేసింది కూడా ఈ ఏడాదే. సోషల్‌ వెబ్‌సైట్‌లో గూగుల్‌ ప్లస్‌ ఎనిమిదేళ్ల క్రితం మొదలైంది. 
గూగుల్‌ ఆలో

వాట్సాప్‌కు పోటీ అని గూగుల్‌ చెప్పకపోయినా.. ఆ స్టైల్‌ ఫీచర్లతో ‘ఆలో’ను తీసుకొచ్చింది గూగుల్‌. అయితే దాన్ని రెండేళ్ల కంటే ఎక్కువ రోజులు నడపలేకపోయింది. ఇటీవల సర్వీసును నిలిపేసింది. ప్లేస్టోర్‌ నుంచి తొలగించింది.
క్రోమ్‌ కాస్ట్‌ ఆడియో

ఏ డివైజ్‌ నుంచైనా స్పీకర్‌కు మ్యూజిక్‌ను స్ట్రీమ్‌ చేయగలిగేలా మూడేళ్ల క్రితం ‘క్రోమ్‌ కాస్ట్‌ ఆడియో’ను గూగుల్‌ తీసుకొచ్చింది. అయితే అనివార్య కారణాల వల్ల ఈ ఏడాది దానిని మూసేసింది. 
యూఆర్‌ఎల్‌ షార్టనర్‌

గూగుల్‌ తీసుకొచ్చిన అత్యంత పాత సర్వీసుల్లో యూఆర్‌ఎల్‌ షార్టనర్‌ ఒకటి. పొడవాటి యూఆర్‌ఎల్‌ను షార్ట్‌ చేసి అందించే సర్వీసు అది. తొమ్మిదేళ్ల నాటి ఈ సర్వీసును గూగుల్‌ ఈ ఏడాది మూసేసింది. 
ఏరియో

రెస్టరెంట్ల నుంచి ఫుడ్‌ ఆర్డర్‌ చేసుకునే సర్వీసులు అంటే స్విగ్గీ, జొమాటో గుర్తొస్తాయి. కానీ గూగుల్‌ ‘ఏరియో’ పేరుతో ఓ యాప్‌ తీసుకొచ్చింది. కానీ, ఈ ఏడాది దానినీ మూసేసింది. అయితే ఈ యాప్‌ చాలా తక్కువ ప్రాంతాల్లోనే సర్వీసు అందించింది.
యూట్యూబ్‌ గేమింగ్‌

గేమ్స్‌ అంటే బాగా ఇష్టపడేవారి కోసం నాలుగేళ్ల క్రితం ‘యూట్యూబ్‌ గేమింగ్‌’ పేరుతో గూగుల్‌ ఓ సర్వీసును తీసుకొచ్చింది. ఇందులో గేమింగ్‌ వీడియోలు, లైవ్‌ స్ట్రీమింగ్‌ ఎక్కువగా ఉంటాయి. ఈ ఏడాది దీనినీ మూసేశారు. 
యూట్యూబ్‌ మెసేజెస్‌

యూట్యూబ్‌లో ఏదైనా వీడియో నచ్చితే దానిని ఇతరులకు వాట్సాప్‌ చేస్తుంటారు. కానీ, ఒకప్పుడు యూట్యూబ్‌లోనే పంపే ఆప్షన్‌ ఉండేది. రెండేళ్ల క్రితం యూట్యూబ్‌లో మెసేజెస్‌ ఆప్షన్‌ ఉన్నప్పుడు ఇది కుదిరేది. ఇప్పుడు ఆ సర్వీసును యూట్యూబ్‌ నిలిపేసింది. 
గూగుల్‌ ట్రిప్స్‌

విహార యాత్రలకు వెళ్లేవారికి ఉపయుక్తంగా ఉండేలా గూగుల్‌ మూడేళ్ల క్రితం ‘ట్రిప్స్‌’ అనే యాప్‌ తీసుకొచ్చింది. మీరు పర్యటనకు వెళ్తున్న ప్రాంతం పేరుతో సెర్చ్‌ చేస్తే అక్కడి ప్రముఖ ప్రదేశాలు, రెస్టరెంట్ల విశేషాలన్నీ అందులో దొరికేవి. కానీ ఈ యాప్‌ సేవలను గూగుల్‌ ఈ ఏడాది నిలిపేసింది. 
క్రోమ్‌ డేటా సేవర్‌

గూగుల్‌ క్రోమ్‌ బ్రౌజర్‌ వినియోగించేటప్పుడు తక్కువ డేటా ఖర్చయ్యేలా ఓ ఎక్స్‌టెన్షన్‌ ఉండేది.  ఈ సర్వీసు ద్వారా ఎంత మొబైల్‌ డేటా /వైఫైని సేవ్‌ చేశారనేది కనిపించేది. నాలుగేళ్ల క్రితం వచ్చిన ఈ ఎక్స్‌టెన్షన్‌ను ఈ ఏడాది గూగుల్‌ నిలిపేసింది. 

- ఇంటర్నెట్‌ డెస్క్‌

మరిన్ని

బీసీసీఐలోకి ‘బాహుబలి’..వేయికళ్లతో వెయిటింగ్ [00:34]

భారత క్రికెట్‌కు నూతన జవసత్వాలు తీసుకొచ్చిన సౌరవ్‌ గంగూలీ.. మరికొద్ది రోజుల్లో ప్రపంచంలోనే అతి సంపన్న క్రికెట్‌ బోర్డుకు అధ్యక్షుడిగా నియమితులు కానున్నాడు. బీసీసీఐ పీఠంపైకి దాదా రాకకోసం ఆయన అభిమానులు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నారు.

సల్మాన్‌తో దిశా మరోసారి.. [00:30]

బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌తో కలిసి ముద్దుగుమ్మ దిశా పటానీ మరోసారి పనిచేయనున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరు కలిసి ‘భారత్‌’ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కత్రినా కైఫ్‌....

కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో తమిళిసై భేటీ [00:28]

దిల్లీ పర్యటనలో భాగంగా తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో భేటీ అయ్యారు. గవర్నర్‌గా ఆమె పాల్గొన్న సమాజిక కార్యక్రమాలు, బతుకమ్మ సంబరాలపై...

ట్రంప్‌.. మమ్మల్ని నట్టేట్లో ముంచారు.. [00:38]

సిరియాలోని కుర్దులు మళ్లీ మోసపోయారు.2014 నుంచి సిరియా, ఇరాక్‌ దేశాల్లో ఇస్లామిక్‌స్టేట్‌ ఉగ్రవాదులపై వీరి చేయూతతోనే అమెరికా సారథ్యంలోని సంకీర్ణసేనలు విజయం సాధించాయి.

ఎంతో అవమానంగా ఫీలయ్యా: బెంగాల్‌ గవర్నర్‌ [00:38]

పశ్చిమబెంగాల్‌ గవర్నర్‌ జగదీప్‌ ధన్కర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కోల్‌కతాలో జరిగిన దుర్గా పూజ కార్నివాల్‌లో తనకు తీవ్ర అవమానం జరిగిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఇది తనను తీవ్ర ఆవేదనకు, కలతకు గురిచేసిందన్నారు........

బైక్‌పై సీఎం:ఒంటరిగా 122కి.మీ రైడ్‌ [00:38]

అరుణాచల్‌ప్రదేశ్‌లో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించి అభివృద్ధి చేసేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పెమాఖండూ వినూత్నంగా ఆకట్టుకున్నారు. తాజాగా రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే దిశగా స్వయంగా ఆయనే బైక్‌పై ఒంటరిగా 122 కిలోమీటర్లు ప్రయాణం చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు.

విదేశీ ఖైదీల కోసం భారత వ్యాపారి ధాతృత్వం! [00:36]

వారంతా ఉపాధి కోసం దుబాయ్‌కి వెళ్లి చిన్న చిన్న నేరాల్లో చిక్కుకుని జైలు పాలయ్యారు. సంవత్సరాల పాటు శిక్షను అనుభవించి, ప్రస్తుతం విడుదలై వారి సొంత దేశాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. వారిలో పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, ఉగాండా, అఫ్గానిస్థాన్‌, నైజీరియా, చైనా, ఇథియోపియా దేశాలకు చెందిన వారు ఉన్నారు.

‘ఫ్లిప్‌కార్ట్‌ వీడియో..’ కంటెంట్‌ వివరాలివే.. [00:36]

అమెజాన్‌ ప్రైమ్‌, నెట్‌ ఫ్లిక్స్‌కు పోటీగా ఫ్లిప్‌కార్ట్‌ గత ఆగస్టులో ప్రారంభించిన ‘ఫ్లిప్‌కార్ట్‌ వీడియో ఒరిజినల్స్‌’కు సంబంధించిన వివరాలను ఆ సంస్థ మంగళవారం వెల్లడించింది. మధ్య, దిగువ స్థాయి పట్టణాల వినియోగదారులే లక్ష్యంగా తాము

గూగుల్‌ సరికొత్త ఉత్పత్తుల వివరాలివే... [00:36]

అంతర్జాల దిగ్గజం గూగుల్‌ సంస్థ మంగళవారం సరికొత్త ఉత్పత్తులను ఆవిష్కరించింది. పిక్సల్‌ 4, పిక్సల్‌ 4 ఎక్స్‌ఎల్‌, పిక్సల్‌బుక్‌ గో, పిక్సల్‌ బడ్స్‌ వంటి ఉత్పత్తులను విడుదల చేసింది. వీటి ఆవిష్కరణకు సంబంధించిన కార్యక్రమాన్ని ‘‘మేడ్‌ బై గూగుల్‌ '19’’ పేరుతో న్యూయార్క్‌లో నిర్వహించింది. గూగుల్‌ నుంచి రాబోతున్న ఉత్పత్తులపై కొన్ని నెలలుగా ఊహాగానాలు షికారు చేసిన నేపథ్యంలో తాజా

విద్యుత్తు వాహనాల తయారీని నిలిపిన హార్లీ [00:36]

విలాసవంతమైన బైకుల తయారీ సంస్థ హార్లీ డేవిడ్‌సన్‌ విద్యత్తు వాహనాల తయారీని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. ప్రస్తుతం ఆ కంపెనీ ‘లైవ్‌వైర్‌’...