ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: దేశీయ మార్కెట్లు బుధవారం ఫ్లాట్‌గా ట్రేడింగ్‌ని ప్రారంభించాయి. ఉదయం 9.50గంటల సమయంలో బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్‌ 22 పాయింట్ల స్వల్ప లాభంతో 37,554 వద్ద కొనసాగుతోంది. అదే సమయంలో జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ ఆరు పాయింట్లు ఎగబాకి 11,132 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ 70.77వద్ద నమోదైంది. ఈ వారం జులై-సెప్టెంబర్‌ త్రైమాసిక ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉండడంతో మదుపర్లు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు నిపుణులు  అభిప్రాయపడ్డారు.  

ఐసీఐసీఐ బ్యాంక్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, లార్సెన్‌, బ్రిటానియా షేర్లు లాభాల్లో పయనిస్తుండగా.. యస్‌ బ్యాంక్‌, టైటాన్‌ కంపెనీ, హెచ్‌సీఎల్‌, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఓఎన్‌జీసీ కంపెనీ షేర్లు నష్టాల్లో నమోదవుతున్నాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లో నమోదవుతుండడం గమనార్హం.

మరిన్ని

మార్కెట్లోకి డీజిల్‌ ఎర్టిగా టూర్‌..! [00:35]

దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీసుజుకీ డ్రైవర్ల కోసం ఎర్టిగా సరికొత్త మోడల్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఎర్టిగా టూర్‌ ఎం పేరుతో వచ్చి ఈ కారులో 1.5లీటర్‌ డీజిల్‌ ఇంజిన్‌ను ఇచ్చారు. ఈ కారు దిల్లీ ఎక్స్‌షోరూమ్‌...

‘ఫ్లిప్‌కార్ట్‌ వీడియో..’ కంటెంట్‌ వివరాలివే.. [00:36]

అమెజాన్‌ ప్రైమ్‌, నెట్‌ ఫ్లిక్స్‌కు పోటీగా ఫ్లిప్‌కార్ట్‌ గత ఆగస్టులో ప్రారంభించిన ‘ఫ్లిప్‌కార్ట్‌ వీడియో ఒరిజినల్స్‌’కు సంబంధించిన వివరాలను ఆ సంస్థ మంగళవారం వెల్లడించింది. మధ్య, దిగువ స్థాయి పట్టణాల వినియోగదారులే లక్ష్యంగా తాము

గూగుల్‌ సరికొత్త ఉత్పత్తుల వివరాలివే... [00:36]

అంతర్జాల దిగ్గజం గూగుల్‌ సంస్థ మంగళవారం సరికొత్త ఉత్పత్తులను ఆవిష్కరించింది. పిక్సల్‌ 4, పిక్సల్‌ 4 ఎక్స్‌ఎల్‌, పిక్సల్‌బుక్‌ గో, పిక్సల్‌ బడ్స్‌ వంటి ఉత్పత్తులను విడుదల చేసింది. వీటి ఆవిష్కరణకు సంబంధించిన కార్యక్రమాన్ని ‘‘మేడ్‌ బై గూగుల్‌ '19’’ పేరుతో న్యూయార్క్‌లో నిర్వహించింది. గూగుల్‌ నుంచి రాబోతున్న ఉత్పత్తులపై కొన్ని నెలలుగా ఊహాగానాలు షికారు చేసిన నేపథ్యంలో తాజా

విద్యుత్తు వాహనాల తయారీని నిలిపిన హార్లీ [00:36]

విలాసవంతమైన బైకుల తయారీ సంస్థ హార్లీ డేవిడ్‌సన్‌ విద్యత్తు వాహనాల తయారీని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. ప్రస్తుతం ఆ కంపెనీ ‘లైవ్‌వైర్‌’...