జియో: ఇతర నెట్‌వర్క్‌కి కాల్‌ చేస్తే ఛార్జి

ముంబయి: ప్రముఖ టెలికాం కంపెనీ జియో కీలక ప్రకటన చేసింది. ఇకపై జియో నెట్‌వర్క్‌ నుంచి ఇతర నెట్‌వర్క్‌లకు చేసే కాల్స్‌కు నిమిషానికి 6 పైసలు చొప్పున వసూలు చేయనున్నట్లు ప్రకటించింది. అయితే, వినియోగదారులు చెల్లించిన మొత్తానికి బదులుగా డేటాను తిరిగి అందివ్వనున్నామని ప్రకటించింది. ఐయూసీ ఛార్జీల విషయంలో ట్రాయ్‌ ఇచ్చిన నిబంధనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ కంపెనీ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే, జియో సొంత నెట్‌వర్క్‌ కాల్స్‌కు ఎలాంటి ఛార్జీలూ వసూలు చేయబోమని ప్రకటించింది. అలాగే, ఇన్‌కమింగ్‌ కాల్స్‌కు, ల్యాండ్‌ లైన్స్‌ విషయంలో ఎలాంటి రుసుమూ వసూలు చేయబోమని తెలిపింది. అక్టోబర్‌ 10 తర్వాత రీఛార్జి చేసే వారికి ఈ ఛార్జీలు వర్తిస్తాయని పేర్కొంది.

ఇప్పటి వరకు జియో యూజర్లు కాల్స్‌కు ఎలాంటి ఛార్జీలూ చెల్లించడం లేదు. కేవలం డేటాకు మాత్రమే చెల్లించేవారు. ఈ నేపథ్యంలో ట్రాయ్‌ నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు ఐయూసీ ఛార్జీలను వినియోగదారుల నుంచి వసూలు చేయాలని నిర్ణయించినట్లు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే, ఐయూసీ ఛార్జీలు పూర్తిగా ఆపేసిన రోజున ఈ ఛార్జీలను వసూలు చేయబోమని ప్రకటించింది. అదే సమయంలో కాల్స్‌కు వసూలు చేసిన మొత్తాన్ని డేటా రూపంలో తిరిగి వినియోగదారులకు అందివ్వనున్నట్లు పేర్కొంది. ఇందుకోసం కొన్ని టాపప్‌ వోచర్లను ప్రకటించింది. దీనివల్ల వినియోగదారులపై అదనపు భారం పడదని జియో పేర్కొంది. 

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ (ట్రాయ్‌) 2017లో ఇంటర్‌ కనెక్ట్‌ యూసేజ్‌ ఛార్జీలను (ఐయూసీ) నిమిషానికి 14 పైసల నుంచి 6 పైసలకు తగ్గించింది. 2020 జనవరి 1 నుంచి పూర్తిగా రద్దు చేయాలనుకుంటోంది. అదే జరిగితే ఈ ఆరు పైసలు ఛార్జి డిసెంబరు 31 వరకే ఉంటుంది. గత మూడేళ్లలో జియో ఐయూసీ ఛార్జీల కింద ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌-ఐడియా వంటి కంపెనీలకు రూ.13,500 కోట్లు చెల్లించినట్లు పేర్కొంది. ఇప్పటి వరకు తమ సొంత నిధుల నుంచే చెల్లించామని తెలిపింది.

జియో తీసుకొచ్చిన వోచర్లివే..


మరిన్ని

బీసీసీఐలోకి ‘బాహుబలి’..వేయికళ్లతో వెయిటింగ్ [00:34]

భారత క్రికెట్‌కు నూతన జవసత్వాలు తీసుకొచ్చిన సౌరవ్‌ గంగూలీ.. మరికొద్ది రోజుల్లో ప్రపంచంలోనే అతి సంపన్న క్రికెట్‌ బోర్డుకు అధ్యక్షుడిగా నియమితులు కానున్నాడు. బీసీసీఐ పీఠంపైకి దాదా రాకకోసం ఆయన అభిమానులు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నారు.

సల్మాన్‌తో దిశా మరోసారి.. [00:30]

బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌తో కలిసి ముద్దుగుమ్మ దిశా పటానీ మరోసారి పనిచేయనున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరు కలిసి ‘భారత్‌’ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కత్రినా కైఫ్‌....

కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో తమిళిసై భేటీ [00:28]

దిల్లీ పర్యటనలో భాగంగా తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో భేటీ అయ్యారు. గవర్నర్‌గా ఆమె పాల్గొన్న సమాజిక కార్యక్రమాలు, బతుకమ్మ సంబరాలపై...

ట్రంప్‌.. మమ్మల్ని నట్టేట్లో ముంచారు.. [00:38]

సిరియాలోని కుర్దులు మళ్లీ మోసపోయారు.2014 నుంచి సిరియా, ఇరాక్‌ దేశాల్లో ఇస్లామిక్‌స్టేట్‌ ఉగ్రవాదులపై వీరి చేయూతతోనే అమెరికా సారథ్యంలోని సంకీర్ణసేనలు విజయం సాధించాయి.

ఎంతో అవమానంగా ఫీలయ్యా: బెంగాల్‌ గవర్నర్‌ [00:38]

పశ్చిమబెంగాల్‌ గవర్నర్‌ జగదీప్‌ ధన్కర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కోల్‌కతాలో జరిగిన దుర్గా పూజ కార్నివాల్‌లో తనకు తీవ్ర అవమానం జరిగిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఇది తనను తీవ్ర ఆవేదనకు, కలతకు గురిచేసిందన్నారు........

బైక్‌పై సీఎం:ఒంటరిగా 122కి.మీ రైడ్‌ [00:38]

అరుణాచల్‌ప్రదేశ్‌లో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించి అభివృద్ధి చేసేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పెమాఖండూ వినూత్నంగా ఆకట్టుకున్నారు. తాజాగా రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే దిశగా స్వయంగా ఆయనే బైక్‌పై ఒంటరిగా 122 కిలోమీటర్లు ప్రయాణం చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు.

విదేశీ ఖైదీల కోసం భారత వ్యాపారి ధాతృత్వం! [00:36]

వారంతా ఉపాధి కోసం దుబాయ్‌కి వెళ్లి చిన్న చిన్న నేరాల్లో చిక్కుకుని జైలు పాలయ్యారు. సంవత్సరాల పాటు శిక్షను అనుభవించి, ప్రస్తుతం విడుదలై వారి సొంత దేశాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. వారిలో పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, ఉగాండా, అఫ్గానిస్థాన్‌, నైజీరియా, చైనా, ఇథియోపియా దేశాలకు చెందిన వారు ఉన్నారు.

‘ఫ్లిప్‌కార్ట్‌ వీడియో..’ కంటెంట్‌ వివరాలివే.. [00:36]

అమెజాన్‌ ప్రైమ్‌, నెట్‌ ఫ్లిక్స్‌కు పోటీగా ఫ్లిప్‌కార్ట్‌ గత ఆగస్టులో ప్రారంభించిన ‘ఫ్లిప్‌కార్ట్‌ వీడియో ఒరిజినల్స్‌’కు సంబంధించిన వివరాలను ఆ సంస్థ మంగళవారం వెల్లడించింది. మధ్య, దిగువ స్థాయి పట్టణాల వినియోగదారులే లక్ష్యంగా తాము

గూగుల్‌ సరికొత్త ఉత్పత్తుల వివరాలివే... [00:36]

అంతర్జాల దిగ్గజం గూగుల్‌ సంస్థ మంగళవారం సరికొత్త ఉత్పత్తులను ఆవిష్కరించింది. పిక్సల్‌ 4, పిక్సల్‌ 4 ఎక్స్‌ఎల్‌, పిక్సల్‌బుక్‌ గో, పిక్సల్‌ బడ్స్‌ వంటి ఉత్పత్తులను విడుదల చేసింది. వీటి ఆవిష్కరణకు సంబంధించిన కార్యక్రమాన్ని ‘‘మేడ్‌ బై గూగుల్‌ '19’’ పేరుతో న్యూయార్క్‌లో నిర్వహించింది. గూగుల్‌ నుంచి రాబోతున్న ఉత్పత్తులపై కొన్ని నెలలుగా ఊహాగానాలు షికారు చేసిన నేపథ్యంలో తాజా

విద్యుత్తు వాహనాల తయారీని నిలిపిన హార్లీ [00:36]

విలాసవంతమైన బైకుల తయారీ సంస్థ హార్లీ డేవిడ్‌సన్‌ విద్యత్తు వాహనాల తయారీని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. ప్రస్తుతం ఆ కంపెనీ ‘లైవ్‌వైర్‌’...