రూ.100 కోసం..30 సార్లు పొడిచి  హత్య

ముంబయి: వంద రూపాయలు తిరిగి ఇచ్చేందుకు నిరాకరించడంతో ఓ మహిళను దారుణంగా హత్య చేసిన సంఘటన ముంబయిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ముంబయిలోని కామాఠిపుర ప్రాంతానికి చెందిన ఓ సెక్స్‌వర్కర్‌తో ఓ వ్యక్తి రూ.500లకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అయితే సదరు వ్యక్తి ఆమెను  రూ.100 తిరిగి ఇవ్వమన్నాడు. దానికి ఆ మహిళ నిరాకరించడంతో కాసేపు ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆ వ్యక్తి తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెను 30 సార్లు పొడిచి చంపాడు. మహిళ కేకలు విన్న ఓ వ్యక్తి ఆమెను రక్షించడానికి రావడంతో నిందితుడు అతడిని కూడా పొడిచాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆ వ్యక్తిని స్థానికులు ఆసుపత్రిలో చేర్చారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు నిందితుడిని క్యాటరింగ్‌ చేసే వ్యక్తిగా గుర్తించి అరెస్ట్‌ చేశారు.

మరిన్ని

అమ్మాయి కోసం.. అమ్మనగలు చోరీ [01:00]

అమ్మాయి కోసం అమ్మ నగలు చోరీ చేసిన తనయుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే...బోరబండలోని ఎన్‌ఆర్‌ఆర్‌పురం కాలనీలో నివసించే అరుణ్‌ గత...

ఆర్టీసీ బస్సు బోల్తా: 25 మందికి గాయాలు [03:34]

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ గ్రామీణ మండల పరిధిలోని అచ్చంపేట కూడలి వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 25 మంది గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  మలికిపురం నుంచి విశాఖ వెళ్తున్న తూర్పుగోదావరి జిల్లా రాజోలు డిపోకు

బస్సు నుంచి దూకేసి.. లారీ కిందపడి.. [01:01]

మనస్తాపంతో వేగంగా వెళ్తున్న బస్సు నుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన విజయనగరం జిల్లా పూసపాటిరేగ సమీపంలో గురువారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికులు, బస్సు

పాఠశాలలో పాము కాటు.. చిన్నారి మృతి [01:01]

ఉత్తర కేరళలోని వయనాడ్‌ జిల్లాలో తరగతి గదిలో పాము కరిచి పదేళ్ల చిన్నారి చనిపోయింది. ప్రభుత్వ పాఠశాల నిర్వహకుల నిర్లక్ష్యంతోనే ఈ దుర్ఘటన జరిగిందని

చెరువులో పడిన కారు: 8 మంది దుర్మరణం [01:00]

ఛత్తీస్‌గడ్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. బెమెత్ర జిల్లా మొహభట్టా వద్ద ప్రయాణిస్తున్న ఓ కారు ప్రమాదవశాత్తూ చెరువులో పడింది. ఆ సమయంలో కారులో ఎనిమిది మంది ప్రయాణిస్తున్నట్టు సమాచారం.