తూ.గో జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

మారేడుమిల్లి: తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మారేడుమిల్లి-చింతూరు మధ్య ఓ  టెంపో వాహనం ప్రమాదానికి గురైంది. భద్రాచలం నుంచి అన్నవరం దైవ దర్శనానికి వెళ్తుండగా ఘాట్‌రోడ్డులోని వాల్మీకి కొండ వద్ద  టెంపో వాహనం అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటనలో ఏడుగురు దుర్మరణం చెందారు. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలంలో ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మరొకరు ప్రాణాలు కోల్పోయారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం రంపచోడవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. టెంపో మారేడుమిల్లి నుంచి బయల్దేరిన కొద్దిసేపటికే ఈ ప్రమాదం చోటుచేసుకుందని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. పర్యాటకులంతా కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గం జిల్లాలోని చెలకెరి గ్రామస్థులుగా పోలీసులు గుర్తించారు. భద్రాచలం దర్శనం అనంతరం అన్నవరం వెళ్తుండగా ఈ ఘోరం చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో టెంపోలో 12 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. 

ఆ రహదారి.. ప్రమాదకరం
మారేడుమిల్లి-చింతూరు రహదారి లోయలు, గుట్టలతో చాలా ప్రమాదకరంగా ఉంటుంది. ఇటీవల భారీ వర్షాలు కురుస్తుండటంతో ఈ మార్గం మరింత ప్రమాదకరంగా మారింది. దట్టమైన అటవీప్రాంతంలో ఉన్న ఈ రహదారిలో చాలా నైపుణ్యం ఉన్న డ్రైవర్లు మాత్రమే ఎక్కువగా వాహనాలు నడుపుతుంటారని.. కొత్తగా వచ్చేవారు ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు.

 

 


మరిన్ని

అమ్మాయి కోసం.. అమ్మనగలు చోరీ [01:00]

అమ్మాయి కోసం అమ్మ నగలు చోరీ చేసిన తనయుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే...బోరబండలోని ఎన్‌ఆర్‌ఆర్‌పురం కాలనీలో నివసించే అరుణ్‌ గత...

గొంతులో మాంసం ముక్క ఇరుక్కొని వ్యక్తి మృతి [06:50]

మాంసం ముక్క గొంతులో ఇరుక్కొని సంగారెడ్డి జిల్లాలో ఒకరు మృతి చెందారు. కల్హేర్‌ మండలం మార్డి తండాకు చెందిన తారావత్‌ బాబునాయక్‌ (39) అల్లిఖాన్‌పల్లి తండాకు చెందిన లక్ష్మణ్‌నాయక్‌తో కలిసి బుధవారం సాయంత్రం పిట్లం వెళ్లారు.

ఆర్టీసీ బస్సు బోల్తా: 25 మందికి గాయాలు [03:34]

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ గ్రామీణ మండల పరిధిలోని అచ్చంపేట కూడలి వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 25 మంది గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  మలికిపురం నుంచి విశాఖ వెళ్తున్న తూర్పుగోదావరి జిల్లా రాజోలు డిపోకు

బస్సు నుంచి దూకేసి.. లారీ కిందపడి.. [01:01]

మనస్తాపంతో వేగంగా వెళ్తున్న బస్సు నుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన విజయనగరం జిల్లా పూసపాటిరేగ సమీపంలో గురువారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికులు, బస్సు

పాఠశాలలో పాము కాటు.. చిన్నారి మృతి [01:01]

ఉత్తర కేరళలోని వయనాడ్‌ జిల్లాలో తరగతి గదిలో పాము కరిచి పదేళ్ల చిన్నారి చనిపోయింది. ప్రభుత్వ పాఠశాల నిర్వహకుల నిర్లక్ష్యంతోనే ఈ దుర్ఘటన జరిగిందని

చెరువులో పడిన కారు: 8 మంది దుర్మరణం [01:00]

ఛత్తీస్‌గడ్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. బెమెత్ర జిల్లా మొహభట్టా వద్ద ప్రయాణిస్తున్న ఓ కారు ప్రమాదవశాత్తూ చెరువులో పడింది. ఆ సమయంలో కారులో ఎనిమిది మంది ప్రయాణిస్తున్నట్టు సమాచారం.