కాదనుకున్నవాడికే పదవి దక్కింది!

వెస్టిండీస్‌ నూతన కోచ్‌గా సిమన్స్‌ 

ఆంటిగ్వా: వెస్టిండీస్‌కు చెందిన ఫిల్‌ సిమన్స్‌ తిరిగి తన దేశానికే ప్రధాన కోచ్‌గా ఎంపికయ్యాడు. వచ్చే నాలుగేళ్ల వరకు అతడే కోచ్‌గా బాధ్యతలు నిర్వహిస్తాడని వెస్టిండీస్‌ క్రికెట్‌ బోర్డు తెలిపింది. ఇటీవల జరిగిన ప్రపంచకప్‌లో విండీస్‌ పేలవ ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత భారత్‌తో తలపడిన అన్ని పార్మాట్లలోనూ విండీస్‌ ఘోరపరాజయం చవిచూసింది. దీంతో వచ్చే ఏడాది జరగనున్న పొట్టి ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని సొంత దేశస్థుడైన సిమన్స్‌ను తిరిగి కోచ్‌గా విండీస్‌ క్రికెట్‌ బోర్డు ఎంపికచేసింది. 2016 టీ20 ప్రపంచకప్‌ విజేతగా వెస్టిండీస్‌ను నిలపడంలో అతడు కీలకపాత్ర పోషించాడు. కానీ, ఆ తర్వాత అతడిని విండీస్‌ బోర్డు అనూహ్యంగా కోచ్‌పదవి నుంచి తప్పించింది.

‘సిమన్స్‌ను తిరిగి కోచ్‌గా ఎంపిక చేయడం తప్పును సరిదిద్దుకోవడం కాదు. అతడిపై నమ్మకం ఉంచి మరో అవకాశం ఇచ్చాం. ఈ సమయంలో జట్టకు అతడే సరైనవాడని అభిప్రాయపడుతున్నాం’ అని వెస్టిండీస్‌ క్రికెట్‌ బోర్డు అధ్యక్షుడు రికీ తెలపారు. 56 ఏళ్ల సిమన్స్‌ టీమ్‌ఇండియా ప్రధానకోచ్‌గా కూడా దరఖాస్తు చేశాడు. కపిల్‌దేవ్‌ కమిటీ ఇంటర్వ్యూకు ఎంపిక చేసిన ఆరుగురు అభ్యర్థుల్లో సిమన్స్‌ కూడా ఉన్నాడు. పొట్టిఫార్మాట్‌లో అద్భుతాలు సృష్టించే అతను సుదీర్ఘ పార్మాట్‌లో జట్టును ముందుకు నడిపించలేకపోతున్నాడు. అతడు కోచ్‌గా ఉన్నప్పుడు 14 టెస్టులు ఆడిన విండీస్‌ కేవలం ఒక్క మ్యాచే మాత్రమే గెలిచింది. 

మరిన్ని

వెస్టిండీస్‌తో సిరీస్‌కు భారత్‌ జట్టు ఇదే [01:01]

వెస్టిండీస్‌తో సొంతగడ్డపై జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌కు భారత జట్టు ఎంపిక పూర్తైంది. విరాట్‌ కోహ్లీ సారథ్యంలో టీమిండియా వెస్టిండీస్‌తో మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. ఫాస్ట్‌ బౌలర్లు మహ్మద్‌ షమి, భువనేశ్వర్‌ కుమార్‌, స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ తిరిగి పరిమిత ఓవర్ల సిరీస్‌కు ఎంపికయ్యారు. ఆల్‌రౌండర్‌ కేదార్‌ జాదవ్‌ కూడా వన్డే జట్టులో స్థానం

ఆ రోజున టీ20 వద్దంటున్న పోలీసులు [01:02]

భారత్‌, వెస్టిండీస్‌ తొలి టీ20పై నీలిమబ్బులు కమ్ముకున్నాయి. మ్యాచ్‌ వేదికను ముంబయి నుంచి మరో చోటుకు తరలించాలని ఎంసీఏను స్థానిక పోలీసులు కోరుతున్నారట. మ్యాచ్‌కు నిర్వహణకు సరిపడా భ్రదతా సిబ్బందిని..........

కృత్రిమ వెలుగులో పేసర్లను వాడుకోవాలి [01:02]

డే/నైట్‌ టెస్టులో పేసర్లను ఉపయోగించుకొనేటప్పుడు రెండు జట్ల సారథులు వినూత్నంగా ఆలోచించాలని టీమిండియా మాజీ సారథి గౌతమ్ గంభీర్‌ అన్నాడు. ఫ్లడ్‌లైట్ల వెలుతురులో పరిస్థితులకు అనుగుణంగా బౌలింగ్‌ చేయిస్తే వారు మరింత......

పింక్‌టెస్టుపై బంగ్లా సారథి అనూహ్య స్పందన [01:01]

టీమిండియాతో చారిత్రక గులాబి టెస్టుకు సన్నద్ధం అయ్యేందుకు సన్నాహక మ్యాచ్‌ ఆడే అవకాశం దొరకలేదని బంగ్లాదేశ్ సారథి మొమినల్ హఖ్‌ అంటున్నాడు. పర్యటనకు బయల్దేరే రెండు రోజుల ముందే తమకీ విషయం తెలిసిందన్నాడు.....