బీసీసీఐలోకి ‘బాహుబలి’..వేయికళ్లతో వెయిటింగ్

 

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత క్రికెట్‌కు నూతన జవసత్వాలు తీసుకొచ్చిన సౌరవ్‌ గంగూలీ.. మరికొద్ది రోజుల్లో ప్రపంచంలోనే అతి సంపన్న క్రికెట్‌ బోర్డుకు అధ్యక్షుడిగా నియమితులు కానున్నాడు. బీసీసీఐ పీఠంపైకి దాదా రాకకోసం ఆయన అభిమానులు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నారు. ఎప్పటికైనా బీసీసీఐ పగ్గాలను గంగూలీ అందుకుంటాడని భావించినా.. ఆ కల ఇంత త్వరగా సాకారమవుతుందని దాదా అభిమానులు ఊహించలేదు. రెండు రోజుల ముందు వరకూ ఆయన కూడా ఎలాంటి ఆశలూ పెట్టుకోలేదు. అధ్యక్షుడిగా బ్రిజేష్‌ పటేల్ ఎన్నిక ఇక లాంఛనమే అనుకున్న సమయంలో ఊహించని రీతిలో గంగూలీకి మద్దతు లభించింది. అప్పటి నుంచి ఆయన అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. గత రెండు రోజులుగా సామాజిక మాధ్యమాల్లో దాదా అభిమానులు ఆయనపై శుభాకాంక్షల వర్షం కురిపిస్తున్నారు. తమ అభిమాన క్రికెటర్‌ను కీర్తిస్తూ పోస్టులు పెడుతున్నారు.  

పోరాట పటిమను నూరిపోశాడు

నిజానికి భారత క్రికెట్ గురించి చెప్పుకోవాలంటే 2000 సంవత్సరం వరకు ఒక లెక్క.. ఆ తర్వాత నుంచి మరో లెక్క. ఇది అతిశయోక్తి కాదు. అందరూ అంగీకరించాల్సిన వాస్తవం. కెప్టెన్‌గా బెంగాల్ టైగర్ గంగూలీ రాకతో దేశంలో క్రికెట్ కీర్తి పతాక స్థాయికి చేరింది. 1983 ప్రపంచకప్ తర్వాత మన జట్టుకి ఆ స్థాయి గుర్తింపు రాలేదనే చెప్పాలి. ఎప్పుడైతే సారథ్య బాధ్యతలు గంగూలీకి అప్పగించారో అప్పటి నుంచి టీమిండియా స్వరూపం మారిపోయింది. దూకుడు పెరిగింది. ఓవైపు విజయాల శాతం పెంచుకుంటూనే జట్టులో పోరాడేతత్వాన్ని దాదా నూరిపోశాడు. ఒక కెప్టెన్‌గా యువతరాన్ని అప్పటివరకు ఆయనలా ప్రోత్సహించిన దాఖలాలు లేవు. జాతీయ జట్టుకు ప్రతిభ కలిగిన దేశవాళీ క్రికెటర్లు ఎంపికయ్యేలా చొరవ చూపేవాడు. యువరాజ్, కైఫ్, రైనా, దినేష్ మోంగియా, హర్భజన్, ఇర్ఫాన్ పఠాన్, జహీర్‌ఖాన్‌, ధోనీ.. ఇలా ఎంతోమంది ఆ విధంగా టీమిండియాలోకి వచ్చినవారే. అలా మెరికల్లాంటి సైన్యాన్ని సిద్ధం చేసుకున్నాడు. మైదానంలో ఉన్నంతసేపూ విజయం కోసం పరితపించేవాడు. ఈ క్రమంలోనే ఎన్నో మంచి విజయాలను భారత్‌ తన ఖాతాలో వేసుకుంది. ముఖ్యంగా 2003 ప్రపంచకప్‌కు జట్టును సన్నద్ధం చేయడంలో కెప్టెన్‌గా గంగూలీ కీలకపాత్ర పోషించాడు. సహచరులు తమ లోటుపాట్లు దిద్దుకునేలా రెండేళ్ల ముందు నుంచే ప్రోత్సాహం అందించేవాడు. ఈ క్రమంలో 1983 తర్వాత తొలిసారిగా టీమిండియాను ప్రపంచకప్‌ ఫైనల్‌ వరకు తీసుకెళ్లగలిగాడు. ఊహించని రీతిలో ప్రధాన ఆటగాళ్లంతా ఆ మ్యాచ్‌లో విఫలం కావడంతో ఓటమి తప్పలేదు. 

ఫీల్డర్లతో సంబంధం లేకుండా..

దాదా బ్యాటింగ్ శైలికి కూడా ఫ్యాన్స్ ఎక్కువే. ఆఫ్ స్టంప్ అవతల బంతి పడితే అది బౌండరీ దాటాల్సిందే. కేవలం గంగూలీ బ్యాటింగ్ ఎండ్‌లోకి వచ్చినప్పుడే ఆఫ్ సైడ్ ఏకంగా 7 నుంచి 8 మంది ఫీల్డర్లను ప్రత్యర్థి జట్టు మొహరించిన సందర్భాలూ అనేకం. ఫీల్డర్లతో సంబంధం లేకుండా థర్డ్ మ్యాన్, బ్యాక్వర్డ్ పాయింట్ మీదుగా అలవోకగా బంతి బౌండరీని దాటేది. గంగూలీ ఫ్రంట్ ఫుట్ వేసి ఆడితే తిరిగి చూడాల్సిన పనిలేదు. అది సిక్సర్‌ రూపంలో నేరుగా గ్యాలరీల్లోకి వెళ్లాల్సిందే. మరీ ముఖ్యంగా స్పిన్నర్లను ఉతికి ఆరేసేవాడు. సిక్సర్ బాదే సమయంలో దాదాలో కనిపించే ఆత్మవిశ్వాసం కట్టిపడేసేది. కెప్టెన్‌గా, బ్యాట్స్‌మన్‌గా జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు. అతడిపై ఒక దశలో పొమ్మనలేక పొగ పెట్టే ప్రయత్నాలు జరిగినా సహనంతో వాటిని అధిగమించాడు. చివరికి ఏరికోరి తెచ్చుకున్నవాడే (చాపెల్) అడ్డంకులు సృష్టించాడు. అప్పటి నుంచి గంగూలీకి గడ్డుకాలం మొదలైంది. ఓవైపు వైఫల్యాలూ వెక్కిరిస్తూ వచ్చాయి. జట్టులో చోటు కోల్పోవాల్సి వచ్చింది. అయినా ఎక్కడా నిరుత్సాహపడలేదు. పడిలేచిన కెరటంలా పునరాగమనం కోసం  దేశవాళీ, కౌంటీల్లో చెమటోడ్చాడు. మంచి ప్రదర్శనలతో ఆకట్టుకున్నాడు. ఎట్టకేలకు 2006లో మళ్లీ జాతీయ జట్టులోకి వచ్చి మెరుగైన ప్రదర్శన ఇచ్చాడు. ఇదే మంచి తరుణం అనుకుని 2008లో క్రికెట్‌కు శాశ్వతంగా వీడ్కోలు పలికాడు. ఆ తర్వాత కొద్దికాలం ఐపీఎల్‌లో ఆడినా దానికీ గుడ్‌బై చెప్పేశాడు.

దారి చూపింది దాదానే!

అయినా ఎక్కడో ఏదో వెలితి. క్రికెట్ కు ఇంకా ఏదో చెయ్యాలనే తపన దాదాలో కనిపించేది. అందుకే అప్పుడప్పుడూ మ్యాచ్‌ సమయాల్లో కామెంటరీ బాక్స్ లో కనిపించేవాడు. బీసీసీఐ నియమించే కమిటీల్లోనూ కీలకపాత్ర పోషించేవాడు. తెర వెనక చక్రం తిప్పుతూ బోర్డు రాజకీయాల్ని ఒంటబట్టించుకున్నాడు. ఈ క్రమంలోనే తన సొంత రాష్ట్రం బెంగాల్ క్రికెట్ అసోసియేషన్‌కి అధ్యక్షుడయ్యాడు. 2000కి ముందు జట్టు పరిస్థితి నామమాత్రంగా ఉన్నప్పుడు కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆయన.. టీమిండియా భవితకు గట్టి పునాది వేశాడు. మిగతా జట్లతో పోలిస్తే ప్రస్తుతం టీమిండియా అనుభవిస్తున్న స్టార్ హోదాకు ఒకవిధంగా దారి చూపించింది గంగూలీనే.  జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు చూసిన టైగర్.. ఇప్పుడు ఏకంగా భారత క్రికెట్ సంఘానికే 'దాదా' కాబోతున్నాడు. బీసీసీఐ అధ్యక్ష పదవికి నామినేషన్ వేసేశాడు. ఎన్నిక కూడా ఇక లాంఛనమే. బాహుబలి కోసం మాహిష్మతి ఎదురు చూసినట్టుగా.. బీసీసీఐలోకి బెంగాల్‌ టైగర్‌ రాక కోసం అభిమానులంతా వేయి కళ్లతో నిరీక్షిస్తున్నారు.

మరిన్ని

విడాకులు తీసుకున్న ప్రముఖ హీరో [00:57]

21 ఏళ్ల వైవాహిక బంధాన్ని విడాకులతో స్వస్తి పలికారు బాలీవుడ్‌ నటుడు అర్జున్‌ రాంపాల్‌. పరస్పర అంగీకారంతో అర్జున్‌ తన మొదటి భార్య జెసియా నుంచి విడాకులు...

అది నిజం కాదు..ఇది అసలైన ఫొటో.. [00:53]

రైళ్లలో పాటలు పాడుకుంటూ యాచన చేసే రాణు మండల్‌ ఓ ప్రయాణికుడు ఆమె పాటను యూట్యూబ్‌లో పెట్టడంతో రాత్రికి రాత్రే సెలబ్రిటీ

వెస్టిండీస్‌తో సిరీస్‌కు భారత్‌ జట్టు ఇదే [01:01]

వెస్టిండీస్‌తో సొంతగడ్డపై జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌కు భారత జట్టు ఎంపిక పూర్తైంది. విరాట్‌ కోహ్లీ సారథ్యంలో టీమిండియా వెస్టిండీస్‌తో మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. ఫాస్ట్‌ బౌలర్లు మహ్మద్‌ షమి, భువనేశ్వర్‌ కుమార్‌, స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ తిరిగి పరిమిత ఓవర్ల సిరీస్‌కు ఎంపికయ్యారు. ఆల్‌రౌండర్‌ కేదార్‌ జాదవ్‌ కూడా వన్డే జట్టులో స్థానం

తెలుగు రాష్ట్రాలు.. ఆసక్తికర చిత్రాలు [06:21]

ఆర్టీసీ బస్సు బోల్తా: 25 మందికి గాయాలు [03:34]

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ గ్రామీణ మండల పరిధిలోని అచ్చంపేట కూడలి వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 25 మంది గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  మలికిపురం నుంచి విశాఖ వెళ్తున్న తూర్పుగోదావరి జిల్లా రాజోలు డిపోకు

కొల్హాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ బోగీలో పొగలు [02:00]

మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం-ఇంటికన్నె రైల్వేస్టేషన్ల మధ్య ఓహెచ్‌ఈ (ఓవర్‌ హెడ్‌ ఎక్విప్‌మెంట్‌)తీగ తెగి పోవడంతో మణుగూరు నుంచి కొల్హాపూర్‌ వెళ్లే కొల్హాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ నిలిచిపోయింది. గురువారం రాత్రి...

సియాచిన్‌పై నోరు పారేసుకున్న పాక్‌.. [01:04]

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధ క్షేత్రం సియాచిన్‌పై పాకిస్థాన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. సియాచిన్‌ అనేది వివాదాస్పద ప్రాంతమని, అందులో భారత్‌ పర్యాటకుల సందర్శనలను చేపట్టవద్దని పాకిస్థాన్ పేర్కొంది.

భారతీయులపై ఉగ్ర ముద్ర వేసేందుకు కుట్ర [01:04]

ఐరాస భద్రతా మండలితో భారతీయులపై ఉగ్రవాదులుగా ముద్ర వేయించేందుకు పాకిస్థాన్‌ కుట్ర పన్నుతోంది. జైష్‌-ఎ-మహ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజర్‌ను ఐరాస భద్రతా మండలి అంతర్జాతీయ

మమత మంత్రులకు గవర్నర్‌ కౌంటర్‌ [01:04]

తాను చేసే వ్యాఖ్యలపై కాకుండా తమ శాఖలపై దృష్టి సారించాలని పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ జగదీప్‌ సింగ్‌ ధన్కర్‌ ఆ రాష్ట్ర మంత్రులకు సూచించారు. కొన్నిరోజులుగా మమత........

పీవోకే వ్యక్తిని వదిలిపెట్టిన భారత సైన్యం [01:04]

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ నుంచి అనుకోకుండా సరిహద్దు దాటి వచ్చిన ఓ వ్యక్తిని భారత సైన్యం గురువారం మానవతా దృక్పథంతో వదిలిపెట్టింది. ఇటీవల అతడిని వదిలేయాలంటూ పీఓకే అధికారులు భారత సైన్యాన్ని సంప్రదించగా వారు అంగీకరించారు.