మరిన్ని సవాళ్లు తప్పవు:కుల్‌దీప్‌

ముంబయి: ప్రస్తుతం తాను ఎదుర్కొంటున్న సవాళ్లు భవిష్యత్తులో కూడా ఎదురవుతాయని భారత స్పిన్నర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ అన్నాడు. ఇటీవల వెస్టిండీస్‌, దక్షిణాఫ్రికా టీ20 సిరీస్‌ల్లో చైనామన్ బౌలర్‌కు చోటు దక్కని విషయం తెలిసిందే. పొట్టిఫార్మాట్‌తో పాటు సుదీర్ఘ ఫార్మాట్‌లోనూ జట్టులో చోటు కోసం కుల్‌దీప్‌ ఎదురుచూస్తున్నాడు. ‘క్రికెట్‌ ఆడటం ప్రారభించిన సమయంలో అసలు టీమ్‌ఇండియాకు ప్రాతినిథ్యం వహిస్తానని అనుకోలేదు. భారత్‌ తరఫున అరంగ్రేటం చేసి దాదాపుగా మూడేళ్లు అవుతోంది. ఇప్పుడు నేను ఎదుర్కొంటున్న సవాళ్లు భవిష్యత్తులో కూడా ఎదురవుతాయి. క్రమశిక్షణ, శ్రమ లేకపొతే ఏది సాధ్యపడదు. ఈ బాటలో నేను పయనిస్తున్నాను’ అని అన్నాడు. కుల్‌దీప్‌తో పాటు టీమ్‌ఇండియా స్పిన్నర్‌ చాహల్ కూడా భారత జట్టులో చోటు కోసం గత కొన్ని రోజులుగా ఎదురుచూస్తున్నాడు. కుల్‌దీప్‌ ఇప్పటివరకు భారత్‌ తరఫున ఆరు టెస్టులు, 53 వన్డేలు, 18 టెస్టులు ఆడాడు. టెస్టుల్లో 21, వన్డేల్లో 96, టీ20ల్లో 35 వికెట్లు పడగొట్టాడు.

మరిన్ని

వెస్టిండీస్‌తో సిరీస్‌కు భారత్‌ జట్టు ఇదే [01:01]

వెస్టిండీస్‌తో సొంతగడ్డపై జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌కు భారత జట్టు ఎంపిక పూర్తైంది. విరాట్‌ కోహ్లీ సారథ్యంలో టీమిండియా వెస్టిండీస్‌తో మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. ఫాస్ట్‌ బౌలర్లు మహ్మద్‌ షమి, భువనేశ్వర్‌ కుమార్‌, స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ తిరిగి పరిమిత ఓవర్ల సిరీస్‌కు ఎంపికయ్యారు. ఆల్‌రౌండర్‌ కేదార్‌ జాదవ్‌ కూడా వన్డే జట్టులో స్థానం

ఆ రోజున టీ20 వద్దంటున్న పోలీసులు [01:02]

భారత్‌, వెస్టిండీస్‌ తొలి టీ20పై నీలిమబ్బులు కమ్ముకున్నాయి. మ్యాచ్‌ వేదికను ముంబయి నుంచి మరో చోటుకు తరలించాలని ఎంసీఏను స్థానిక పోలీసులు కోరుతున్నారట. మ్యాచ్‌కు నిర్వహణకు సరిపడా భ్రదతా సిబ్బందిని..........

కృత్రిమ వెలుగులో పేసర్లను వాడుకోవాలి [01:02]

డే/నైట్‌ టెస్టులో పేసర్లను ఉపయోగించుకొనేటప్పుడు రెండు జట్ల సారథులు వినూత్నంగా ఆలోచించాలని టీమిండియా మాజీ సారథి గౌతమ్ గంభీర్‌ అన్నాడు. ఫ్లడ్‌లైట్ల వెలుతురులో పరిస్థితులకు అనుగుణంగా బౌలింగ్‌ చేయిస్తే వారు మరింత......

పింక్‌టెస్టుపై బంగ్లా సారథి అనూహ్య స్పందన [01:01]

టీమిండియాతో చారిత్రక గులాబి టెస్టుకు సన్నద్ధం అయ్యేందుకు సన్నాహక మ్యాచ్‌ ఆడే అవకాశం దొరకలేదని బంగ్లాదేశ్ సారథి మొమినల్ హఖ్‌ అంటున్నాడు. పర్యటనకు బయల్దేరే రెండు రోజుల ముందే తమకీ విషయం తెలిసిందన్నాడు.....