ఒకే ఇన్నింగ్స్‌తో రోహిత్‌ పలు రికార్డులు

రాజ్‌కోట్‌: టీమిండియా తాత్కాలిక కెప్టెన్‌ రోహిత్‌శర్మ(85) గురువారం బంగ్లాపై చెలరేగిన సంగతి తెలిసిందే. రెండో టీ20లో అద్భుతంగా బ్యాటింగ్‌ చేసిన రోహిత్‌ తృటిలో ఐదో శతకాన్ని చేజార్చుకున్నాడు. ఈ క్రమంలో బంగ్లా నిర్దేశించిన 154 పరుగుల లక్ష్యాన్ని రోహిత్‌సేన రెండు వికెట్లు కోల్పోయి 15.4 ఓవర్లలో ఛేదించింది. హిట్‌మ్యాన్‌ సిక్సులతో చెలరేగిన వేళ పలు రికార్డులు బద్దలయ్యాయి. 

* టీ20ల్లో అత్యధిక సిక్సులు బాదిన భారత కెప్టెన్‌గా రోహిత్‌(17 ఇన్నింగ్స్‌ల్లో 37 సిక్సులు) అగ్రస్థానంలో నిలిచాడు. అతడికన్నా ముందు ధోనీ (62 ఇన్నింగ్స్‌ల్లో 34 సిక్సులు) అగ్రస్థానంలో ఉండేవాడు. విరాట్‌కోహ్లీ (26 ఇన్నింగ్స్‌ల్లో 26 సిక్సులతో) మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. 

* అలాగే అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ ఏడాది అత్యధిక సిక్సులు(66) బాదిన క్రికెటర్‌గా నిలిచాడు రోహిత్‌. 2017లో 65 సిక్సులు కొట్టిన హిట్‌మ్యాన్‌ 2018లో 74 బాదడం విశేషం.

* పొట్టి ఫార్మాట్‌లో ఐదో శతకం చేజార్చుకున్న టీమిండియా ఓపెనర్‌.. కోహ్లీతో సమానంగా 22 ఇన్నింగ్స్‌ల్లో 50కి పైగా పరుగులు చేశాడు.

* పొట్టి ఫార్మాట్‌లో టీమిండియా కెప్టెన్‌గా రోహిత్‌ ఆరోసారి అర్ధశతకం సాధించాడు. కోహ్లీ కూడా కెప్టెన్‌గా ఆరు అర్ధ శతకాలు కొట్టడం గమనార్హం.

* శిఖర్‌ ధావన్‌తో కలిసి టీ20ల్లో అత్యధికసార్లు వంద పరుగుల భాగస్వామ్యాన్ని నిర్మించాడు. ఇదివరకు కోహ్లీ-రోహిత్‌ జంట మూడుసార్లు ఈ ఘనత సాధించగా.. రోహిత్‌-ధావన్‌ జంట నాలుగుసార్లు సాధించింది. ఆసీస్‌ ఓపెనర్లు వాట్సన్‌-వార్నర్‌.. కివీస్‌ ఆటగాళ్లు గప్తిల్‌-విలియమ్సన్‌, గప్తిల్‌-మన్రో మూడేసి సార్లు శతక భాగస్వామ్యాలు నెలకొల్పారు.

మరిన్ని

వెస్టిండీస్‌తో సిరీస్‌కు భారత్‌ జట్టు ఇదే [01:01]

వెస్టిండీస్‌తో సొంతగడ్డపై జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌కు భారత జట్టు ఎంపిక పూర్తైంది. విరాట్‌ కోహ్లీ సారథ్యంలో టీమిండియా వెస్టిండీస్‌తో మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. ఫాస్ట్‌ బౌలర్లు మహ్మద్‌ షమి, భువనేశ్వర్‌ కుమార్‌, స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ తిరిగి పరిమిత ఓవర్ల సిరీస్‌కు ఎంపికయ్యారు. ఆల్‌రౌండర్‌ కేదార్‌ జాదవ్‌ కూడా వన్డే జట్టులో స్థానం

ఆ రోజున టీ20 వద్దంటున్న పోలీసులు [01:02]

భారత్‌, వెస్టిండీస్‌ తొలి టీ20పై నీలిమబ్బులు కమ్ముకున్నాయి. మ్యాచ్‌ వేదికను ముంబయి నుంచి మరో చోటుకు తరలించాలని ఎంసీఏను స్థానిక పోలీసులు కోరుతున్నారట. మ్యాచ్‌కు నిర్వహణకు సరిపడా భ్రదతా సిబ్బందిని..........

కృత్రిమ వెలుగులో పేసర్లను వాడుకోవాలి [01:02]

డే/నైట్‌ టెస్టులో పేసర్లను ఉపయోగించుకొనేటప్పుడు రెండు జట్ల సారథులు వినూత్నంగా ఆలోచించాలని టీమిండియా మాజీ సారథి గౌతమ్ గంభీర్‌ అన్నాడు. ఫ్లడ్‌లైట్ల వెలుతురులో పరిస్థితులకు అనుగుణంగా బౌలింగ్‌ చేయిస్తే వారు మరింత......

పింక్‌టెస్టుపై బంగ్లా సారథి అనూహ్య స్పందన [01:01]

టీమిండియాతో చారిత్రక గులాబి టెస్టుకు సన్నద్ధం అయ్యేందుకు సన్నాహక మ్యాచ్‌ ఆడే అవకాశం దొరకలేదని బంగ్లాదేశ్ సారథి మొమినల్ హఖ్‌ అంటున్నాడు. పర్యటనకు బయల్దేరే రెండు రోజుల ముందే తమకీ విషయం తెలిసిందన్నాడు.....