రివ్యూ: తిప్పరా మీసం
సినిమా: తిప్పరా మీసం
న‌టీన‌టులు: శ్రీ విష్ణు, నిక్కీ తంబోలీ, రోహిణి, బెన‌ర్జీ, శ్రీకాంత్ అయ్యర్ త‌దిత‌రులు
సంగీతం: సురేష్ బొబ్బిలి
ఛాయాగ్రహ‌ణం: సిధ్
కూర్పు: ధర్మేంద్ర కాకరాల
క‌ళ‌: షర్మిల యెలిశెట్టి
పాట‌లు: పూర్ణాచారి, అల రాజా
నిర్మాత‌: రిజ్వాన్‌
దర్శకుడు: ఎల్‌. కృష్ణ విజయ్
నిర్మాణ సంస్థలు: రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, కృష్ణ విజయ్ ఎల్‌. ప్రొడక్షన్స్, శ్రీ ఓం సినిమా
విడుద‌ల‌ తేదీ: 8-11-2019

క‌థ‌ల ఎంపికలో శ్రీవిష్ణు అభిరుచి ప్రత్యేకం. అందుకే ఆయ‌న సినిమా వ‌స్తుందంటే విభిన్నమైన క‌థ‌ని చూడొచ్చనే అభిప్రాయంతో ఉంటారు ప్రేక్షకులు. మ‌ధ్యలో కొన్ని చిత్రాలు ప‌రాజ‌యాన్ని చ‌విచూసినా ఆయ‌న శైలి మార‌లేదు. ఇటీవ‌లే ‘బ్రోచేవారెవ‌రురా’తో మంచి విజ‌యాన్ని సొంతం చేసుకున్నారు. శ్రీవిష్ణు మార్క్ క‌థతో తెర‌కెక్కిన ఆ చిత్రం ప్రేక్షకుల‌కి మంచి వినోదాన్ని పంచిపెట్టింది. దీంతో ఆ చిత్రం త‌ర్వాత ఆయ‌న చేసిన ‘తిప్పరామీసం’పై మ‌రిన్ని అంచ‌నాలు క‌నిపించాయి. మ‌రి అందుకు త‌గ్గట్టుగా సినిమా ఉందో, లేదో తెలుసుకుందాం.. 
క‌థేంటంటే: మ‌ణి అలియాస్ మ‌ణిశంక‌ర్ (శ్రీవిష్ణు) డీజే. చిన్నప్పుడే మ‌త్తుమందుకి బానిసైన కుర్రాడు. చికిత్స కోసం పునరావాస కేంద్రంలో చేర్పించ‌డంతో ఒంట‌రి అవుతాడు. త‌ల్లి (రోహిణి)పై క‌క్ష పెంచుకుంటాడు. చికిత్స త‌ర్వాత బ‌య‌టికొచ్చి త‌ల్లికి దూరంగా.. డీజేగా ప‌నిచేస్తూ కాలం వెళ్లదీస్తుంటాడు. మ‌త్తుతో పాటు, జూదం కూడా ఆడుతుంటాడు. ఈ క్రమంలోనే క్రికెట్ బుకీకి రూ.30 లక్షలు అప్పుప‌డ‌తాడు. ఆ అప్పుని తీర్చేందుకు త‌ల్లి ద‌గ్గర‌కి వెళ్లి త‌న వాటా ఆస్తి అడుగుతాడు. అంత మొత్తం త‌న ద‌గ్గర లేద‌ని, రూ.5 ల‌క్షలు మాత్రమే ఉన్నాయని చెక్ ఇస్తుంది. దాన్ని ఫోర్జరీ చేసి త‌ల్లిపైనే చెక్ బౌన్స్ కేసు పెడ‌తాడు. మ‌రి ఈ కేసులో ఎవ‌రు గెలిచారు? త‌ల్లిపైనే కేసు వేసిన మ‌ణిశంక‌ర్ త‌న కుటుంబం కోసం ఏమైనా చేశాడా, లేదా? అవ‌స‌ర‌మైన‌ప్పుడు త‌న బాధ్యత‌ల్ని ఎలా నిర్వర్తించాడు? త‌దిత‌ర విష‌యాల్ని తెర‌పై చూడాల్సిందే.

ఎలా ఉందంటే: క‌థ కంటే కూడా క‌థ‌నంతో క‌ట్టిపడేస్తున్న రోజులివి. యువ దర్శకులు ఆ విష‌యంలో మ‌రింత నైపుణ్యాన్ని ప్రద‌ర్శిస్తున్నారు. వాళ్ల ఆలోచ‌న‌లు, ప్రతిభపై న‌మ్మకంతో క‌థానాయ‌కులు రంగంలోకి దిగుతున్నారు. ఈ సినిమాని కూడా శ్రీవిష్ణు త‌న పాత్ర, క‌థ‌నంపై న‌మ్మకంతో చేసిన‌ట్టు అనిపిస్తుంది. అయితే దర్శకుడు మాత్రం అటు బ‌ల‌మైన క‌థ‌ని చెప్పక‌పోగా, ఇటు క‌థ‌నంపై కూడా ప‌ట్టు ప్రద‌ర్శించ‌లేక‌పోయారు. ప‌తాక స‌న్నివేశాల్లోని ఒక మ‌లుపు త‌ప్ప సినిమాలో చెప్పుకోద‌గ్గ విష‌య‌మేమీ లేదు. అది కూడా చాలా మంది ప్రేక్షకులు ఊహించ‌గ‌లిగే మ‌లుపే. ప్రథ‌మార్ధం అంతా కూడా సాగ‌దీత వ్యవ‌హార‌మే. క‌థానాయ‌కుడు మ‌త్తుకి బానిసై చేసే విన్యాసాలు, దుస్తులు విప్పేసి రోడ్ల మీద ప‌రుగెత్తడాలు, అత‌ను ఆడే జూదం.. ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తాయి. ప్రథ‌మార్ధంలో క‌థానాయ‌కుడు డ‌బ్బు కోసం త‌ల్లిని వేధించ‌డం త‌ప్ప క‌థంటూ ఏమీ ఉండ‌దు. త‌ల్లీకొడుకుల మ‌ధ్య బంధాన్ని ఆవిష్కరించే అవ‌కాశం ఇందులో ఉన్నప్పటికీ ఆ దిశ‌గా ఏమాత్రం దృష్టిపెట్టలేదు ద‌ర్శకుడు. దీంతో భావోద్వేగాలు మిస్ అయ్యాయి. ద్వితీయార్ధంలోనైనా ఏమైనా మ‌లుపుల‌తో క‌థ‌, క‌థ‌నాల్ని గాడిలో పెట్టారా అంటే అది కూడా లేదు. క‌థ‌లో కానీ, క‌థానాయ‌కుడి పాత్రలో కానీ.. ‘తిప్పరామీసం’ అనే పేరుకు ఉన్నంత శ‌క్తి అస్సలు క‌నిపించ‌దు. ప‌తాక స‌న్నివేశాల్లో కుటుంబం కోసం క‌థానాయ‌కుడు చేసే ప‌ని ఆస‌క్తిని రేకెత్తిస్తుంది. శ్రీవిష్ణు ఇందుకే ఈ క‌థ‌ని ఒప్పుకొనుంటాడేమో. ద‌ర్శకుడు చెప్పాల‌నుకొన్న క‌థంతా ప‌తాక స‌న్నివేశాల్లోనే క‌నిపిస్తుంది. ఆ అంశంతోనే ఈ సినిమాని మ‌రింత ఆస‌క్తిక‌రంగా తీర్చిదిద్దొచ్చు. కానీ ద‌ర్శకుడు కేవ‌లం క‌థానాయ‌కుడి పాత్రపైనే దృష్టిపెట్టడంతో క‌థ‌, క‌థ‌నాలు నిస్సారంగా మారాయి.

ఎవ‌రెలా చేశారంటే: శ్రీవిష్ణు న‌ట‌న బాగుంది. వ్యతిరేక ఛాయ‌ల‌తో కూడిన పాత్రతో ఆకట్టుకున్నాడు. కానీ ఆ పాత్ర తీర్చిదిద్దిన విధానంలోనే చాలా లోపాలు క‌నిపిస్తాయి. శ్రీవిష్ణు త‌ల్లి పాత్రలో రోహిణి చ‌క్కటి అభిన‌యం ప్రద‌ర్శించారు. క‌థానాయిక నిక్కీ తంబోలీ చిన్న పాత్రలో క‌నిపిస్తుందంతే. బెన‌ర్జీ, శ్రీకాంత్ అయ్యర్ పాత్రల ప‌రిధి మేర‌కు న‌టించారు. సాంకేతికంగా సినిమా ప‌ర్వాలేద‌నిపిస్తుంది. సురేష్ బొబ్బిలి సంగీతం బాగుంది. సిధ్ కెమెరా  రాత్రివేళల్లో సాగే స‌న్నివేశాల్ని చక్కగా తీసింది. సినిమాలో వేగం త‌గ్గింది. ద‌ర్శకుడు కృష్ణ‌ విజ‌య్ ప‌నిత‌నం తేలిపోయింది. ఆయ‌న పాత్రల్ని డిజైన్ చేసుకున్న విధానం కూడా ఏమంత మెప్పించ‌దు.

బలాలు బ‌ల‌హీన‌త‌లు
+ శ్రీవిష్ణు న‌ట‌న - క‌థ, క‌థ‌నం
+ ప‌తాక స‌న్నివేశాలు - భావోద్వేగాలు లేక‌పోవ‌డం
  - సాగ‌తీత‌గా సాగే స‌న్నివేశాలు

చివ‌రిగా.. మీసం తిర‌గ‌లేదు
గమనిక: ఈ సమీక్ష కేవలం సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది మాత్రమే. ఇది కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.


మరిన్ని

విడాకులు తీసుకున్న ప్రముఖ హీరో [00:57]

21 ఏళ్ల వైవాహిక బంధాన్ని విడాకులతో స్వస్తి పలికారు బాలీవుడ్‌ నటుడు అర్జున్‌ రాంపాల్‌. పరస్పర అంగీకారంతో అర్జున్‌ తన మొదటి భార్య జెసియా నుంచి విడాకులు...

అది నిజం కాదు..ఇది అసలైన ఫొటో.. [00:53]

రైళ్లలో పాటలు పాడుకుంటూ యాచన చేసే రాణు మండల్‌ ఓ ప్రయాణికుడు ఆమె పాటను యూట్యూబ్‌లో పెట్టడంతో రాత్రికి రాత్రే సెలబ్రిటీ

వెస్టిండీస్‌తో సిరీస్‌కు భారత్‌ జట్టు ఇదే [01:01]

వెస్టిండీస్‌తో సొంతగడ్డపై జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌కు భారత జట్టు ఎంపిక పూర్తైంది. విరాట్‌ కోహ్లీ సారథ్యంలో టీమిండియా వెస్టిండీస్‌తో మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. ఫాస్ట్‌ బౌలర్లు మహ్మద్‌ షమి, భువనేశ్వర్‌ కుమార్‌, స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ తిరిగి పరిమిత ఓవర్ల సిరీస్‌కు ఎంపికయ్యారు. ఆల్‌రౌండర్‌ కేదార్‌ జాదవ్‌ కూడా వన్డే జట్టులో స్థానం

తెలుగు రాష్ట్రాలు.. ఆసక్తికర చిత్రాలు [06:21]

ఆర్టీసీ బస్సు బోల్తా: 25 మందికి గాయాలు [03:34]

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ గ్రామీణ మండల పరిధిలోని అచ్చంపేట కూడలి వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 25 మంది గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  మలికిపురం నుంచి విశాఖ వెళ్తున్న తూర్పుగోదావరి జిల్లా రాజోలు డిపోకు

కొల్హాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ బోగీలో పొగలు [02:00]

మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం-ఇంటికన్నె రైల్వేస్టేషన్ల మధ్య ఓహెచ్‌ఈ (ఓవర్‌ హెడ్‌ ఎక్విప్‌మెంట్‌)తీగ తెగి పోవడంతో మణుగూరు నుంచి కొల్హాపూర్‌ వెళ్లే కొల్హాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ నిలిచిపోయింది. గురువారం రాత్రి...

సియాచిన్‌పై నోరు పారేసుకున్న పాక్‌.. [01:04]

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధ క్షేత్రం సియాచిన్‌పై పాకిస్థాన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. సియాచిన్‌ అనేది వివాదాస్పద ప్రాంతమని, అందులో భారత్‌ పర్యాటకుల సందర్శనలను చేపట్టవద్దని పాకిస్థాన్ పేర్కొంది.

భారతీయులపై ఉగ్ర ముద్ర వేసేందుకు కుట్ర [01:04]

ఐరాస భద్రతా మండలితో భారతీయులపై ఉగ్రవాదులుగా ముద్ర వేయించేందుకు పాకిస్థాన్‌ కుట్ర పన్నుతోంది. జైష్‌-ఎ-మహ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజర్‌ను ఐరాస భద్రతా మండలి అంతర్జాతీయ

మమత మంత్రులకు గవర్నర్‌ కౌంటర్‌ [01:04]

తాను చేసే వ్యాఖ్యలపై కాకుండా తమ శాఖలపై దృష్టి సారించాలని పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ జగదీప్‌ సింగ్‌ ధన్కర్‌ ఆ రాష్ట్ర మంత్రులకు సూచించారు. కొన్నిరోజులుగా మమత........

పీవోకే వ్యక్తిని వదిలిపెట్టిన భారత సైన్యం [01:04]

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ నుంచి అనుకోకుండా సరిహద్దు దాటి వచ్చిన ఓ వ్యక్తిని భారత సైన్యం గురువారం మానవతా దృక్పథంతో వదిలిపెట్టింది. ఇటీవల అతడిని వదిలేయాలంటూ పీఓకే అధికారులు భారత సైన్యాన్ని సంప్రదించగా వారు అంగీకరించారు.