మారిన ‘మూడ్‌’.. 12వేల దిగువకు నిఫ్టీ

ముంబయి: వరుస లాభాలతో దూసుకెళ్తున్న మార్కెట్ల జోరుకు అడ్డుకట్ట పడింది. స్థిరాస్తి రంగానికి ఊతం, అంతర్జాతీయ సానుకూల పరిణామాలతో జీవితకాల గరిష్ఠాలు నమోదు చేసిన మార్కెట్లు రేటింగ్‌ సంస్థ మూడీస్‌ ఇచ్చిన షాక్‌తో నేల చూపులు చూడాల్సి వచ్చింది. మందగించిన వృద్ధిరేటు కారణంగా రేటింగ్‌ను తగ్గించడం మదుపరుల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. అయితే, బ్యాంకింగ్‌ షేర్ల అండనివ్వడం మార్కెట్లు భారీ నష్టాల నుంచి గట్టెక్కాయి. దీంతో సెన్సెక్స్‌ 330 పాయింట్లు కోల్పోయి 40,323 వద్ద స్థిరపడింది. నిఫ్టీ  పాయింట్లు కోల్పోయి 12వేల దిగువకు చేరి 11,908 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 71.26గా ఉంది. నిఫ్టీలో యస్‌బ్యాంక్‌, ఇండస్‌ ఇండ్‌, ఐసీఐసీఐ, ఐషర్‌ మోటార్స్‌, కోటక్‌ మహీంద్రా షేర్లు లాభపడగా.. భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, సన్‌ఫార్మా, గెయిల్‌, యూపీఎల్‌, వేదంతా షేర్లు నష్టాలు చవిచూశాయి.

మరిన్ని

వాటిపై ప్రేమ..రతన్‌టాటాకు అసిస్టెంట్‌ని చేసింది [01:02]

టాటా సంస్థల అధిపతి రతన్‌ టాటాకు శునకాలపై ఉన్న ప్రేమ ఓ యువకుడికి బంపర్‌ ఆఫర్‌ తెచ్చిపెట్టింది. ముంబయికి చెందిన 27 ఏళ్ల శంతను నాయుడు రతన్‌ టాటాకు

షావోమి నుంచి మరో ఫిట్‌నెస్‌ బ్యాండ్‌ [01:03]

చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల సంస్థ షావోమి మరో ఫిట్‌నెస్‌ బ్యాండ్‌ను భారత్‌కు తీసుకొచ్చింది. ఎంఐ బ్యాండ్‌ 3ఐ పేరిట దీన్ని మార్కెట్‌లోకి విడుదల

రుణ ఎగవేతదారుల జాబితా ఇదిగో.. ఆర్‌బీఐ వెల్లడి [01:03]

ఉద్దేశపూర్వకంగా బ్యాంకులకు రుణాలను ఎగ్గొట్టిన వారి జాబితాను ఆర్‌బీఐ ఎట్టకేలకు విడుదల చేసింది. ఆంగ్ల వార్తాసంస్థ ‘ది వైర్‌’ ఈ ఏడాది మేలో ఆర్‌టీఐ...

నెట్‌వర్క్‌18లో వాటాలపై సోనీ ఆసక్తి..? [01:03]

రిలయన్స్‌కు చెందిన నెట్‌వర్క్‌18లో వాటాలను కొనుగోలు చేసే అంశంపై సోనీ చర్చలు జరుపుతోంది. దీనిపై ప్రాథమిక స్థాయిలో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. పలు రకాల డీల్స్‌పై...