ఓ సెకను కెమెరా ఆపుతారా..: జాన్వి

పాపకు సాయం.. ప్రైవసీ కోరిన నటి

ముంబయి: బాలీవుడ్‌ ముద్దుగుమ్మ జాన్వి కపూర్‌ తన మంచి మనసుతో మరోసారి నెటిజన్లను కట్టిపడేశారు. ఇప్పటికే అనేక సందర్భాల్లో ఆమె దాతృత్వం చాటుకున్నారు. ముంబయి వీధుల్లో కారు దిగి, ఎక్కే సమయంలో అక్కడి పేద చిన్నారులతో మాట్లాడుతూ, వారికి సాయం చేస్తూ మీడియా కంటపడ్డారు. జాన్వి తాజాగా ఓ బాలిక ఆకలి తీర్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో జాన్వి బాలికను తనతోపాటు నడుచుకుంటూ రమ్మని అడిగారు. పాప కూడా ఆమెతోపాటు కారు వరకు వచ్చింది. జాన్వి కారులో ఉన్న బిస్కెట్‌ ప్యాకెట్‌ను పాప చేతిలో పెట్టి బై బై చెప్పారు. ఈ వీడియో చూసిన నెటిజన్ల ఆమె వ్యక్తిత్వానికి మరోసారి ఫిదా అయ్యారు.

అయితే పాపకు సాయం చేస్తుండగా మీడియా ఫొటోలు, వీడియోలు తీయడం పట్ల జాన్వి అసహనం వ్యక్తం చేశారు. ప్రైవసీ కావాలంటూ.. ‘ఓ సెకను మీ కెమెరాలను ఆపండి. ప్రతిసారి ఇలా ఫొటోలు, వీడియోలు తీస్తుంటే ఇబ్బందిగా ఉంది’ అని జాన్వి మీడియాతో చెప్పారు. ఆమె ప్రస్తుతం పంకజ్‌ త్రిపాఠి తెరకెక్కిస్తున్న ‘గుంజాన్‌ సక్సేనా’ సినిమాతో బిజీగా ఉన్నారు. మరోపక్క జాన్వి, కార్తిక్‌ ఆర్యన్‌ జంటగా ‘దోస్తానా 2’ సినిమా రూపుదిద్దుకుంటోంది.


మరిన్ని

విడాకులు తీసుకున్న ప్రముఖ హీరో [00:57]

21 ఏళ్ల వైవాహిక బంధాన్ని విడాకులతో స్వస్తి పలికారు బాలీవుడ్‌ నటుడు అర్జున్‌ రాంపాల్‌. పరస్పర అంగీకారంతో అర్జున్‌ తన మొదటి భార్య జెసియా నుంచి విడాకులు...

నా ‘జబర్దస్త్‌’ ప్రయాణం ముగిసింది : నాగబాబు [00:58]

బుల్లితెర తెలుగు ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్న కామెడీ షోలు ‘జబర్దస్త్‌’, ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్‌’. గురు, శుక్రవారాలు వచ్చాయంటే తెలుగు వాళ్లందరూ టీవీల ముందు వాలిపోతారు. ఇక బస్సుల్లో, రైళ్లలో...

మరో బాలీవుడ్‌ చిత్రంలో రకుల్‌ [00:58]

ఇటు దక్షిణాది చిత్రాలతోపాటు అటు బాలీవుడ్‌ చిత్రాల్లో నటిస్తూ బిజీ, బిజీగా లైఫ్‌ను గడుపుతున్నారు నటి రకుల్‌ప్రీత్‌ సింగ్‌. తాజాగా జాన్‌ అబ్రహాం చిత్రంలో రకుల్‌ సందడి చేయనున్నారు.

విజయ్‌ ఆంటోని ‘జ్వాల’ [00:57]

‘బిచ్చగాడు’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు నటుడు విజయ్‌ ఆంటోని. ఈ సినిమాతో ఆయన అటు కోలీవుడ్‌తోపాటు ఇటు టాలీవుడ్‌లో కూడా మంచి గుర్తుంపు తెచ్చుకున్నారు.