దిల్లీకి అశ్విన్‌: కెప్టెన్సీ రేసులో కేఎల్‌ రాహుల్‌

సీనియర్‌ ఆటగాడి బదిలీ ప్రక్రియ సంపూర్ణం

దిల్లీ: టీమిండియా సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ఐపీఎల్‌లో దిల్లీ క్యాపిటల్స్‌లో చేరాడు. కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ నుంచి అతడి బదిలీ ప్రక్రియ పూర్తైంది. ఇందులో భాగంగా ఎడమచేతి వాటం ఆటగాడు సుచిత్‌, అదనంగా రూ.1.5 కోట్లను పంజాబ్‌కు దిల్లీ ఇచ్చింది. 2018 వేలంలో యాష్‌ను రూ.7.6 కోట్లకు పంజాబ్‌ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. రెండేళ్లు సారథ్యం వహించినప్పటికీ ఆ జట్టుకు ట్రోఫీ అందించడంలో ఈ సీనియర్‌ స్పిన్నర్‌ విఫలమయ్యాడు.

‘అశ్విన్‌ అత్యంత సీనియర్‌ స్పిన్నర్‌, విలువైన ఆటగాడు. భారత్‌ తరఫున, ఐపీఎల్‌లో అతడికి తిరుగులేని రికార్డులు ఉన్నాయి. ఐపీఎల్‌ టైటిల్‌పై కన్నేసిన మాకు అశ్విన్‌ చేరిక అమిత  ప్రయోజనం చేకూరుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు’ అని దిల్లీ క్యాపిటల్స్‌ సహ యజమాని పార్థ్‌ జిందాల్‌ అన్నారు. ‘తాను భాగమైన ప్రతి జట్టుకూ అశ్విన్‌ విలువ చేకూరుస్తాడు. దిల్లీ క్యాపిటల్స్‌లో చేరిన అతడికి ఎలాంటి మార్పు ఉండదు. మా సొంత మైదానం మందకొడిగా ఉంటుంది. స్పిన్నర్లకు సహకరిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ పిచ్‌పై తన తెలివైన బౌలింగ్‌తో అశ్విన్‌ పెను ప్రభావం చూపగలడు’ అని దిల్లీ ప్రధాన కోచ్‌ రికీ పాంటింగ్‌ అన్నాడు.

యాష్ ఇప్పటి వరకు 68 టెస్టుల్లో 357 వికెట్లు, 111 వన్డేల్లో 150 వికెట్లు తీశాడు. ఐపీఎల్‌లో అతడికి మంచి రికార్డు ఉంది. 139 మ్యాచుల్లో 6.79 ఎకానమీతో 125 వికెట్లు తీశాడు. చెన్నై విజేతగా అవతరించిన 2010, 2011లో అశ్విన్‌ కీలక పాత్ర పోషించాడు. కింగ్స్‌ పంజాబ్‌ కెప్టెన్‌గా రెండేళ్లు పనిచేసినా ప్లేఆఫ్‌కు చేర్చడంలో విఫలమయ్యాడు. అతడు దిల్లీకి బదిలీ అవ్వడంతో కేఎల్‌ రాహుల్‌ కెప్టెన్సీ రేసులో ముందంజలో ఉన్నాడు. ఐపీఎల్‌ బదిలీ గవాక్షం నవంబర్‌ 14తో ముగుస్తుంది.

మరిన్ని

విడాకులు తీసుకున్న ప్రముఖ హీరో [00:57]

21 ఏళ్ల వైవాహిక బంధాన్ని విడాకులతో స్వస్తి పలికారు బాలీవుడ్‌ నటుడు అర్జున్‌ రాంపాల్‌. పరస్పర అంగీకారంతో అర్జున్‌ తన మొదటి భార్య జెసియా నుంచి విడాకులు...

అది నిజం కాదు..ఇది అసలైన ఫొటో.. [00:53]

రైళ్లలో పాటలు పాడుకుంటూ యాచన చేసే రాణు మండల్‌ ఓ ప్రయాణికుడు ఆమె పాటను యూట్యూబ్‌లో పెట్టడంతో రాత్రికి రాత్రే సెలబ్రిటీ

వెస్టిండీస్‌తో సిరీస్‌కు భారత్‌ జట్టు ఇదే [01:01]

వెస్టిండీస్‌తో సొంతగడ్డపై జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌కు భారత జట్టు ఎంపిక పూర్తైంది. విరాట్‌ కోహ్లీ సారథ్యంలో టీమిండియా వెస్టిండీస్‌తో మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. ఫాస్ట్‌ బౌలర్లు మహ్మద్‌ షమి, భువనేశ్వర్‌ కుమార్‌, స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ తిరిగి పరిమిత ఓవర్ల సిరీస్‌కు ఎంపికయ్యారు. ఆల్‌రౌండర్‌ కేదార్‌ జాదవ్‌ కూడా వన్డే జట్టులో స్థానం

తెలుగు రాష్ట్రాలు.. ఆసక్తికర చిత్రాలు [06:21]

ఆర్టీసీ బస్సు బోల్తా: 25 మందికి గాయాలు [03:34]

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ గ్రామీణ మండల పరిధిలోని అచ్చంపేట కూడలి వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 25 మంది గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  మలికిపురం నుంచి విశాఖ వెళ్తున్న తూర్పుగోదావరి జిల్లా రాజోలు డిపోకు

కొల్హాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ బోగీలో పొగలు [02:00]

మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం-ఇంటికన్నె రైల్వేస్టేషన్ల మధ్య ఓహెచ్‌ఈ (ఓవర్‌ హెడ్‌ ఎక్విప్‌మెంట్‌)తీగ తెగి పోవడంతో మణుగూరు నుంచి కొల్హాపూర్‌ వెళ్లే కొల్హాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ నిలిచిపోయింది. గురువారం రాత్రి...

సియాచిన్‌పై నోరు పారేసుకున్న పాక్‌.. [01:04]

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధ క్షేత్రం సియాచిన్‌పై పాకిస్థాన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. సియాచిన్‌ అనేది వివాదాస్పద ప్రాంతమని, అందులో భారత్‌ పర్యాటకుల సందర్శనలను చేపట్టవద్దని పాకిస్థాన్ పేర్కొంది.

భారతీయులపై ఉగ్ర ముద్ర వేసేందుకు కుట్ర [01:04]

ఐరాస భద్రతా మండలితో భారతీయులపై ఉగ్రవాదులుగా ముద్ర వేయించేందుకు పాకిస్థాన్‌ కుట్ర పన్నుతోంది. జైష్‌-ఎ-మహ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజర్‌ను ఐరాస భద్రతా మండలి అంతర్జాతీయ

మమత మంత్రులకు గవర్నర్‌ కౌంటర్‌ [01:04]

తాను చేసే వ్యాఖ్యలపై కాకుండా తమ శాఖలపై దృష్టి సారించాలని పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ జగదీప్‌ సింగ్‌ ధన్కర్‌ ఆ రాష్ట్ర మంత్రులకు సూచించారు. కొన్నిరోజులుగా మమత........

పీవోకే వ్యక్తిని వదిలిపెట్టిన భారత సైన్యం [01:04]

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ నుంచి అనుకోకుండా సరిహద్దు దాటి వచ్చిన ఓ వ్యక్తిని భారత సైన్యం గురువారం మానవతా దృక్పథంతో వదిలిపెట్టింది. ఇటీవల అతడిని వదిలేయాలంటూ పీఓకే అధికారులు భారత సైన్యాన్ని సంప్రదించగా వారు అంగీకరించారు.