సంక్షోభం నుంచి ధోనీ ఎలా గట్టెక్కించాడంటే..

చెన్నై: కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీ, ఆటగాళ్ల అకుంఠిత దీక్ష, పట్టుదల, వ్యూహం వల్లే పునరాగమనంలో చెన్నై సూపర్‌కింగ్స్‌ విజేతగా అవతరించిందని ఆ ఫ్రాంచైజీ యజమాని, పారిశ్రామిక వేత్త ఎన్‌.శ్రీనివాసన్‌ అన్నారు. ‘సంక్షోభ సమయంలో నాయకత్వం’ అనే అంశంపై ఐఐటీ మద్రాస్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మ్యాచ్‌ ఫిక్సింగ్‌, అవినీతి ఆరోపణలతో చెన్నై సూపర్‌కింగ్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ను 2016లో నిషేధించారు. రెండేళ్ల తర్వాత పునరాగమనం చేసేందుకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే.  

‘రెండేళ్ల నిషేధం రూపంలో చెన్నై సూపర్‌కింగ్స్‌ను ఓ సంక్షోభం చుట్టు ముట్టింది. 2018లో రావడం రావడంతోనే జట్టు విజేతగా అవతరించింది. సంక్షోభం దేన్నైనా చుట్టుకోవచ్చు. కానీ ఎంఎస్‌ ధోనీ, చెన్నై సూపర్‌కింగ్స్‌ దానిని అకుంఠిత దీక్ష, మొక్కవోని పట్టుదల, పక్కా ప్రణాళికతో అధిగమించింది. ఎలాంటి సమయంలోనైనా అసాధారణ పరిస్థితి రావచ్చు. వ్యక్తులు, కార్పొరేట్‌, రాజకీయాలు, పార్టీలు, ఏ రంగంలోనైనా సంక్షోభం తలెత్తొచ్చు. దానిని సవాల్‌గా స్వీకరించి ముందుకు నడవాలి. ఒక్క చెడు నిర్ణయం మన ప్రగతిని 20 ఏళ్ల వెనక్కి నెట్టగలదు. సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ యుగంలో వ్యక్తులు సంక్షోభాలను ముందుగానే పసిగట్టి ముందుకు సాగాలి’ అని శ్రీని వెల్లడించారు. 

మరిన్ని

భాజపా జాతీయ అధ్యక్షుడి ఎన్నిక నేడు [00:05]

భాజపా జాతీయ అధ్యక్షుడి కోసం సోమవారం ఎన్నిక నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం 10:30 నుంచి నామినేషన్‌ ప్రక్రియ చేపట్టనున్నారు. మధ్యాహ్నం 12.30 వరకు

రాహుల్‌ ఔటయ్యాక.. అదే అనుకున్నాం [00:01]

ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో కేఎల్‌ రాహుల్‌(19) ఔటయ్యాక.. కోహ్లీ, తాను ఇన్నింగ్స్‌ చక్కదిద్దాలని అనుకున్నామని ఓపెనర్‌ రోహిత్‌శర్మ అన్నాడు...

సీఏఏని విభేదించే హక్కు రాష్ట్రాలకుంది: కాంగ్రెస్ [00:00]

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం విషయంలో విభేదించే హక్కు రాష్ట్రాలకు ఉందని కాంగ్రెస్‌ పార్టీ పేర్కొంది. సీఏఏ అంశం కోర్టులో తేలే వరకు రాజ్యాంగ విరుద్ధమైన చట్టాన్ని....