అడ్వాణీ ఇంటికి ఉపరాష్ట్రపతి

దిల్లీ: ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు భాజపా అగ్రనేత ఎల్‌.కె.అడ్వాణీని కలిశారు. అడ్వాణీ జన్మదినం సందర్భంగా దిల్లీలోని ఆయన నివాసానికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. అడ్వాణీ కుటుంబసభ్యులతో వెంకయ్య కాసేపు గడిపారు. అదే సమయంలో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, భాజపా జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా అక్కడికి వచ్చి అడ్వాణీకి శుభాకాంక్షలు తెలిపారు.

మరిన్ని

పీవోకే వ్యక్తిని వదిలిపెట్టిన భారత సైన్యం [01:04]

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ నుంచి అనుకోకుండా సరిహద్దు దాటి వచ్చిన ఓ వ్యక్తిని భారత సైన్యం గురువారం మానవతా దృక్పథంతో వదిలిపెట్టింది. ఇటీవల అతడిని వదిలేయాలంటూ పీఓకే అధికారులు భారత సైన్యాన్ని సంప్రదించగా వారు అంగీకరించారు.

సియాచిన్‌పై నోరు పారేసుకున్న పాక్‌.. [01:04]

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధ క్షేత్రం సియాచిన్‌పై పాకిస్థాన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. సియాచిన్‌ అనేది వివాదాస్పద ప్రాంతమని, అందులో భారత్‌ పర్యాటకుల సందర్శనలను చేపట్టవద్దని పాకిస్థాన్ పేర్కొంది.

భారతీయులపై ఉగ్ర ముద్ర వేసేందుకు కుట్ర [01:04]

ఐరాస భద్రతా మండలితో భారతీయులపై ఉగ్రవాదులుగా ముద్ర వేయించేందుకు పాకిస్థాన్‌ కుట్ర పన్నుతోంది. జైష్‌-ఎ-మహ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజర్‌ను ఐరాస భద్రతా మండలి అంతర్జాతీయ

మమత మంత్రులకు గవర్నర్‌ కౌంటర్‌ [01:04]

తాను చేసే వ్యాఖ్యలపై కాకుండా తమ శాఖలపై దృష్టి సారించాలని పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ జగదీప్‌ సింగ్‌ ధన్కర్‌ ఆ రాష్ట్ర మంత్రులకు సూచించారు. కొన్నిరోజులుగా మమత........