దిల్లీ: ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు భాజపా అగ్రనేత ఎల్.కె.అడ్వాణీని కలిశారు. అడ్వాణీ జన్మదినం సందర్భంగా దిల్లీలోని ఆయన నివాసానికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. అడ్వాణీ కుటుంబసభ్యులతో వెంకయ్య కాసేపు గడిపారు. అదే సమయంలో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షా, భాజపా జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా అక్కడికి వచ్చి అడ్వాణీకి శుభాకాంక్షలు తెలిపారు.