గుడ్‌న్యూస్‌: ఇకపై నెఫ్ట్‌ ఛార్జీలుండవ్‌

ముంబయి: నేషనల్‌ ఎలక్ట్రానిక్‌ ఫండ్స్‌ ట్రాన్స్‌ఫర్‌ (నెఫ్ట్‌) ద్వారా జరిపే లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు ఇకపై ఉండబోవు. ఈ మేరకు ఆర్‌బీఐ బ్యాంకులను ఆదేశించింది. 2020 జనవరి నుంచి ఎలాంటి ఛార్జీలు వసూలు చేయకూడదని సూచించింది. డిజిటల్‌ పేమెంట్స్‌ను ప్రోత్సహించడంలో భాగంగా ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. 

2018 అక్టోబర్‌ నుంచి 2019 సెప్టెంబర్‌ మధ్య కాలంలో డిజిటల్‌ లావాదేవీలు 96 శాతం మేర పెరిగాయి. ఇదే కాలంలో నెఫ్ట్‌ లావాదేవీలు 20 శాతం పెరగ్గా.. యూపీఐ పేమెంట్స్‌లో ఏకంగా 263 శాతం పెరుగుదల కనిపించింది. డిజిటల్‌ పేమెంట్స్‌ను మరింత ప్రోత్సహించడంలో భాగంగా నెఫ్ట్‌ లావాదేవీలపై ఛార్జీలను పొదుపు ఖాతాదారుల నుంచి వసూలు చేయరాదని బ్యాంకులకు ఆర్‌బీఐ సూచించింది. దీంతో పాటు పార్కింగ్‌ ఫీజు, పెట్రోల్‌ పంపుల వద్ద చెల్లింపుల కోసం ఫాస్టాగ్స్‌ను అనుమతించాలని ప్రతిపాదించింది.పెద్ద నోట్ల రద్దు చేపట్టి మూడేళ్లు పూర్తైన రోజే ఈ నిర్ణయం వెలువడడం గమనార్హం.

మరిన్ని

వాటిపై ప్రేమ..రతన్‌టాటాకు అసిస్టెంట్‌ని చేసింది [01:02]

టాటా సంస్థల అధిపతి రతన్‌ టాటాకు శునకాలపై ఉన్న ప్రేమ ఓ యువకుడికి బంపర్‌ ఆఫర్‌ తెచ్చిపెట్టింది. ముంబయికి చెందిన 27 ఏళ్ల శంతను నాయుడు రతన్‌ టాటాకు

షావోమి నుంచి మరో ఫిట్‌నెస్‌ బ్యాండ్‌ [01:03]

చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల సంస్థ షావోమి మరో ఫిట్‌నెస్‌ బ్యాండ్‌ను భారత్‌కు తీసుకొచ్చింది. ఎంఐ బ్యాండ్‌ 3ఐ పేరిట దీన్ని మార్కెట్‌లోకి విడుదల

రుణ ఎగవేతదారుల జాబితా ఇదిగో.. ఆర్‌బీఐ వెల్లడి [01:03]

ఉద్దేశపూర్వకంగా బ్యాంకులకు రుణాలను ఎగ్గొట్టిన వారి జాబితాను ఆర్‌బీఐ ఎట్టకేలకు విడుదల చేసింది. ఆంగ్ల వార్తాసంస్థ ‘ది వైర్‌’ ఈ ఏడాది మేలో ఆర్‌టీఐ...

నెట్‌వర్క్‌18లో వాటాలపై సోనీ ఆసక్తి..? [01:03]

రిలయన్స్‌కు చెందిన నెట్‌వర్క్‌18లో వాటాలను కొనుగోలు చేసే అంశంపై సోనీ చర్చలు జరుపుతోంది. దీనిపై ప్రాథమిక స్థాయిలో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. పలు రకాల డీల్స్‌పై...