‘సరిలేరు నీకెవ్వరు’ గ్రూప్‌ ఫొటో

కేరళలో సందడి

హైదరాబాద్‌: అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్ర బృందం కేరళలో సందడి చేసింది. ఈ సినిమా షూటింగ్‌ అక్కడి అందమైన ప్రదేశాల్లో జరిగింది. శుక్రవారంతో కేరళ షెడ్యూల్‌ పూర్తయింది. ఈ సందర్భంగా అక్కడి రైల్వేస్టేషన్‌లో చిత్ర బృందం కలిసి తీసుకున్న గ్రూప్‌ ఫొటోను నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. ఈ ఫొటోలో కథానాయిక రష్మిక, నటీనటులు ప్రకాశ్‌రాజ్‌, విజయశాంతి, రాజేంద్ర ప్రసాద్‌, సంగీత తదితరులు కనిపించారు. మహేశ్‌ ఆర్మీ దుస్తుల్లో దర్శనమిచ్చారు.

‘మహర్షి’ హిట్‌ తర్వాత మహేశ్‌ నటిస్తున్న సినిమా ఇది. ఇందులో ఆయన మేజర్‌ అజయ్‌ కృష్ణగా కనిపించనున్నారు. సుదీర్ఘ విరామం తర్వాత విజయశాంతి ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వబోతుండటం విశేషం. ఈ చిత్రానికి అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ బాణీలు అందిస్తున్నారు. జనవరి 12న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

మరిన్ని

విడాకులు తీసుకున్న ప్రముఖ హీరో [00:57]

21 ఏళ్ల వైవాహిక బంధాన్ని విడాకులతో స్వస్తి పలికారు బాలీవుడ్‌ నటుడు అర్జున్‌ రాంపాల్‌. పరస్పర అంగీకారంతో అర్జున్‌ తన మొదటి భార్య జెసియా నుంచి విడాకులు...

నా ‘జబర్దస్త్‌’ ప్రయాణం ముగిసింది : నాగబాబు [00:58]

బుల్లితెర తెలుగు ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్న కామెడీ షోలు ‘జబర్దస్త్‌’, ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్‌’. గురు, శుక్రవారాలు వచ్చాయంటే తెలుగు వాళ్లందరూ టీవీల ముందు వాలిపోతారు. ఇక బస్సుల్లో, రైళ్లలో...

మరో బాలీవుడ్‌ చిత్రంలో రకుల్‌ [00:58]

ఇటు దక్షిణాది చిత్రాలతోపాటు అటు బాలీవుడ్‌ చిత్రాల్లో నటిస్తూ బిజీ, బిజీగా లైఫ్‌ను గడుపుతున్నారు నటి రకుల్‌ప్రీత్‌ సింగ్‌. తాజాగా జాన్‌ అబ్రహాం చిత్రంలో రకుల్‌ సందడి చేయనున్నారు.

విజయ్‌ ఆంటోని ‘జ్వాల’ [00:57]

‘బిచ్చగాడు’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు నటుడు విజయ్‌ ఆంటోని. ఈ సినిమాతో ఆయన అటు కోలీవుడ్‌తోపాటు ఇటు టాలీవుడ్‌లో కూడా మంచి గుర్తుంపు తెచ్చుకున్నారు.