విమానాశ్రయానికి వనిత రక్షణ

ఒకప్పుడు ఆమె సాధారణ ఉద్యోగిని. ఇప్పుడు ఎయిర్‌పోర్ట్స్‌ ఆథారిటీ ఆఫ్‌ ఇండియాకు ఎంపికైన అగ్నిమాపకదళ అధికారిణి. ఆసక్తితో ఈ రంగాన్ని ఎంచుకున్న ఆమె... ప్రస్తుతం చెన్నై విమానాశ్రయంలో విధుల్లో చేరింది. ఆమే ఇరవైఎనిమిదేళ్ల రెమ్యా శ్రీకాంతన్‌.

రెమ్యాది కేరళ. అక్కడే స్ట్రక్చరల్‌ ఇంజినీరింగ్‌లో డిగ్రీ పూర్తి చేసింది.  ఆ తరువాత ‘ఎల్బీఎస్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ ఫర్‌ విమెన్‌’లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పని చేసింది. ఉద్యోగం చేస్తున్నప్పుడే అగ్నిమాపకదళ రంగంలో అవకాశాలు ఉన్నాయని తెలిసి దరఖాస్తు చేసుకుంది. పరీక్ష, ఇంటర్వ్యూలో ఉత్తీర్ణత సాధించి... దిల్లీలో నాలుగు నెలలు కఠోర శిక్షణ తీసుకుంది. అలా ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాకు అగ్నిమాపకదళ అధికారిణిగా ఎంపికైంది. ప్రస్తుతం చెన్నై విమానాశ్రయంలో పనిచేస్తోంది. దక్షిణభారతదేశంలో  తొలి మహిళా అధికారిగా, దేశంలో మూడో మహిళగా నిలిచింది.

‘ఈ బాధ్యతను సవాలుగా తీసుకుంటున్నా. ఈ మధ్యే ఉద్యోగంలో చేరా. ఏదైనా అనుకోని సంఘటన, ప్రమాదం చోటు చేసుకున్నప్పుడు క్షణాల్లో స్పందించి నిర్ణయాలు తీసుకోవాలి. ప్రజారక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి. శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలి. ఇందులో విజయం సాధిస్తాననే నమ్మకం, ఆత్మవిశ్వాసం నాకు ఉన్నాయి. ఈ రంగంలో మహిళల సంఖ్య ఇంకా పెరగాలి...’ అని చెబుతుందామె.

మరిన్ని

చూసి కాదు... ధరించాకే కొనండి! [01:35]

ఆన్‌లైన్‌లో ఏదైనా వస్తువు కొనేటప్పుడు బాగానే కనిపిస్తుంది. దగ్గరొచ్చాకే మనం అనుకున్నట్ల్లుగా ఉండకపోవచ్చు. ఇలాంటి సమస్యల్ని గమనించిన అమృతవల్లి... ఓ సంస్థను ప్రారంభించింది.

ఎన్నో సమస్యలకు... ఒక్క లేజర్‌ చాలు [01:35]

చర్మ సంరక్షణలో ఇప్పుడు లేజర్‌ చికిత్స ఓ భాగమైపోయింది. అసలు దీని ప్రత్యేకత ఏంటీ... ఏ సమస్యలకు లేజర్‌ని ఎంచుకోవచ్చు... ఇందులో ఉన్న రకాలేంటో తెలుసుకుందామా.

వయసు పెరగాలి... మెదడు ఎదగాలి! [01:34]

ఏదైనా తెలుసుకోవాలనే జిజ్ఞాస పిల్లలో పెరగాలంటే... మీ వంతుగా ఏం చేయాలో చూడండి.

భలే భలే బొప్పాయి [01:34]

అందరికీ అందుబాటులో ఉండే పండ్లలో బొప్పాయి ఒకటి. రోజూ ఓ చిన్న కప్పు బొప్పాయి ముక్కల్ని తింటే.. ఎన్నో పోషకాలు శరీరానికి అందుతాయి.