నిశిలో ఘాతుకం.. అశ్రువర్షితం

మృతదేహం ఎదుట విలపిస్తున్న తల్లి ఉషారాణి

● హత్యకేసుగా నమోదు, నిందితుడి కోసం గాలింపు

● కురబలకోట మండలం చేనేతనగర్‌లో దారుణం

తారలాంటి చిన్నారి తేజం.. నిశిరాత్రిలో వికృత ఘాతుకానికి బలై నింగినంటింది. అల్లరి చేసే అమాయకత్వం.. మాయకుడి వలకు చిక్కి మరణశయ్యపై ఒరిగిపోయింది. శుభకార్యంలో సందడి చేస్తుండగా.. గుంటనక్కలాంటి ఓ మృగం ఎత్తుకెళ్లి నిండుప్రాణాన్ని చిదిమేసింది. ‘పాప’మని కించిత్‌ ఎగ్గూసిగ్గూ లేని కర్కోటకుడు పాషాణ హృదయంతో బాలికను బలిగొన్నాడు. మృగాకృత్యానికి చిరుప్రాణం ఎంత విలవిల్లాడిందో.. చివరి ఊపిరి పోతుంటే ఎంత చిత్రవధ అనుభవించిందో.. అమ్మ అంటూ కడసారి ఎంత ఏడ్చిందో.. కరుణలేని ధూర్తుడి ఘాతుకానికి తాళలేక నిస్సహాయంగా అసువులు బాసింది. అశ్రువులు నింపింది. పెళ్లి వేడుకకు హాజరైన చిన్నారి వర్షిత రాత్రి వేళ కన్పించకుండా పోయి వేకువజామున శవమై కన్పించిన ఘటన కురబలకోట మండలం చేనేతనగర్‌ సమీపంలో శుక్రవారం చోటుచేసుకుంది.

మదనపల్లె గ్రామీణ, మదనపల్లె పట్టణం, న్యూస్‌టుడే: కురబలకోట మండలంలో శుక్రవారం దారుణం చోటుచేసుకుంది. వేడుకలో చిన్నారిని ఓ గుర్తుతెలియని దుండగుడు మభ్యపెట్టి తీసుకెళ్లి హత్యచేయడంస్థానికంగా కలకలం రేపింది. బంధువులు, పోలీసుల కథనం ప్రకారం.. బి.కొత్తకోట మండలం గుట్టపాళెంకు చెందిన ఉషారాణి, సిద్ధారెడ్డి దంపతులు కురబలకోట మండలం చేనేతనగర్‌ కల్యాణ మండపంలో జరిగిన వివాహానికి గురువారం రాత్రి కుటుంబసమేతంగా వచ్చారు. వారి వెంట కుమార్తెలు వైష్ణవి, వర్షిణి, వర్షితలు కూడా వచ్చారు. రాత్రి కల్యాణ మండపంలో బంధువులతో సంతోషంగా గడిపారు. ఈ సమయంలో పెళ్లికి వచ్చిన ఇతర పిల్లలతో వర్షిత ఆడుకుంది. రాత్రి 9.30గంటల తర్వాత వర్షిత కనిపించకుండా పోయింది. తల్లిదండ్రులు తమ కుమార్తె కల్యాణమండపంలోనే స్నేహితులతో ఎక్కడో ఆడుకుంటూ ఉంటుందని భావించారు. చాలా సేపటి వరకు వర్షిత జాడ కనిపించకపోవడంతో తల్లిదండ్రులు, బంధువులు వెతికారు. ఎక్కడా బాలిక ఆచూకీ లేకపోవడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. రాత్రి కల్యాణ మండపంలోకి గుర్తుతెలియని వ్యక్తి వచ్చి వర్షితని తన వెంట తీసుకెళ్లడానికి ప్రయత్నాలు చేసినట్లు సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. వర్షితను నిందితుడు తన చరవాణిలో ఫొటోలు తీసి చూపిస్తూ మభ్యపెట్టాడు. అలా దగ్గరైన అతను పాపవెంటే తిరిగాడు. చివరికి కల్యాణ మండపం వెనుక మరుగుదొడ్డి వైపు వెళ్లారు. తరువాత 15 నిమిషాల తరువాత నిందితుడు ఒక్కడే తిరిగి కల్యాణ మండపంలోనికి వచ్చి ఐస్‌క్రీమ్‌ల డబ్బాను తీసుకుంటుండగా వేడుకల్లో ఉన్నవారు అతన్ని అడ్డుకున్నారు. దీంతో అక్కడి నుంచి నిష్క్రమించినట్లు సీసీ కెమెరాల్లో తెలుస్తోంది. రాత్రి పాపకోసం తల్లిదండ్రులతోపాటు, బంధుమిత్రులు చుట్టుపక్కల గాలించారు. జాడ కనిపించలేదు. ఎట్టకేలకు వేకువజామున 6.30గంటల సమీపంలో కల్యాణమండపానికి వెనుకవైపు ప్రహరీకింద వంకలో వర్షిత విగతజీవిగా పడి ఉండటాన్ని గుర్తించారు. మృతదేహాన్ని చూసి తల్లి ఉషారాణి సంఘటనా స్థలంలోనే కుప్పకూలింది. రాత్రి కళ్లెదుట తిరిగిన కుమార్తె తెల్లవారేసరికి చనిపోయిందంటూ విలపించింది. శుక్రవారం ఉదయం సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వర్షిత మృతదేహంపై ఉన్న గాయాలను గుర్తించారు. ఆధారాల కోసం గాలించారు. డీఎస్పీ రవిమనోహరాచారి ఆధ్వర్యంలో సీఐ అశోక్‌కుమార్‌ హత్యకేసును నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి విచారణ ప్రారంభించినట్లు తెలిపారు.

రంగంలోకి దిగిన డాగ్‌స్క్వాడ్‌.. క్లూస్‌టీం

వర్షిత హత్యకు గురికావడంతో డీఎస్పీ రవిమనోహరాచారి సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. చిత్తూరు జిల్లా కేంద్రం నుంచి డాగ్‌ స్క్వాడ్‌తోపాటు, క్లూస్‌టీంను సంఘటనా స్థలానికి రప్పించారు. డాగ్‌ స్క్వాడ్‌ సిబ్బంది కుక్కను సంఘటనా స్థలంలో వదిలి నిందితుని కోసం గాలింపు చేపట్టారు. కుక్క కల్యాణ మండపం వెనుకభాగం వైపునకు వెళ్లి తిరిగి ప్రధాన రహదారిపైకి వచ్చింది. దీన్ని బట్టి నిందితుడు కల్యాణ మండపం నుంచి బయటకు వచ్చి తర్వాత వెనుకవైపునకు వచ్చినట్లు తెలుస్తోంది. పోలీసులు ఈ కేసును ఛేదించడానికి అందుబాటులో ఉన్న అవకాశాలను వినియోగించుకుంటున్నారు. ప్రధానంగా కల్యాణ మండపంలోని సీసీ కెమెరాల్లోని పుటేజిలను పరిశీలిస్తున్నారు. కాగా సీసీ కెమెరాల్లో నిందితుని ముఖం ఒక్కచోటకూడా స్పష్టంగా కనిపించకపోవడం సమస్యగా మారింది. ద్విచక్రవాహనంలో వచ్చి కల్యాణ మండపంలోకి వెళ్లినట్లు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. మదనపల్లె డీఎస్పీ, సీఐతో సహా ఎస్సైలు సుకుమార్‌, సహదేవమ్మ, దిలీప్‌లు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతి చెందిన బాలిక బంధువులను, తల్లిదండ్రులను విచారించారు.

రెండు నిమిషాలుంటే ఇంటికి వెళ్లేవాళ్లం

మా ఊరి నుంచి పెళ్లికి అంగళ్లుకు వచ్చాం పెళ్లి చూసుకుని అప్పుడే ఇంటికి వెళ్లిపోవాలననుకున్నాం. రెండునిమిషాలు ఉంటే కూతుళ్లతోపాటు ఇంటికి క్షేమంగా వెళ్లేవాళ్లం. ఇంతలోనే కన్పించకుండా పోయి తెల్లారేసరికి విగతజీవిగా మారిందంటూ తండ్రి సిద్ధారెడ్డి వాపోయాడు. గ్రామంలో, ఇతర ప్రాంతాల్లో మాకు ఎవరితోనూ విరోధం లేదని చెబుతున్నారు. తన కూతురిని చంపినవాణ్ని కఠినంగా శిక్షించాలని తల్లి ఉషారాణి ఆక్రోశం వ్యక్తం చేసింది.

అయ్యో...చిట్టీ ఏమైపోయావమ్మా

శోకసంద్రంలో గుట్టపాళెం

బి.కొత్తకోట, న్యూస్‌టుడే:‘అయ్యో చిట్టీ ఏమైపోయావమ్మా.. దేవుడా నా బిడ్డను ఎందుకిలా చేశావు..మేం ఏ పాపం చేశాం స్వామి’ అంటూ తల్లి ఉషారాణి గుండెలవిసేలా రోదించడం అందరిని కంటతడి పెట్టించింది. వర్షిత స్వగ్రామమైన బి.కొత్తకోట మండలంలోని గుట్టపాళానికి మృతదేహాన్ని తీసుకుని రాగానే బంధుమిత్రులతో పాటు గ్రామస్థులు కన్నీటి పర్యంతమయ్యారు. అశ్రునయనాలతో చిన్నారి మృతదేహానికి శుక్రవారం రాత్రి అంత్యక్రియలను నిర్వహించారు. గుట్టపాళెం విషాదంలో మునిగిపోయింది. వర్షిత మృతదేహం వద్ద తల్లి పడి రోదిస్తుండగా ఆమెను ఓదార్చడం ఎవరితరం కాలేదు. అలాగే చిన్నారి అవ్వ లక్ష్మీదేవితో పాటు కుటుంబసభ్యులు మృతదేహాన్ని చూసి గుండెలు బాదుకుంటూ రోదించారు.

చిన్నారి మృతదేహాన్ని గుట్టపాళెంకు తీసుకొస్తున్న బంధువులు

 

మరిన్ని

విడాకులు తీసుకున్న ప్రముఖ హీరో [00:57]

21 ఏళ్ల వైవాహిక బంధాన్ని విడాకులతో స్వస్తి పలికారు బాలీవుడ్‌ నటుడు అర్జున్‌ రాంపాల్‌. పరస్పర అంగీకారంతో అర్జున్‌ తన మొదటి భార్య జెసియా నుంచి విడాకులు...

అది నిజం కాదు..ఇది అసలైన ఫొటో.. [00:53]

రైళ్లలో పాటలు పాడుకుంటూ యాచన చేసే రాణు మండల్‌ ఓ ప్రయాణికుడు ఆమె పాటను యూట్యూబ్‌లో పెట్టడంతో రాత్రికి రాత్రే సెలబ్రిటీ

వెస్టిండీస్‌తో సిరీస్‌కు భారత్‌ జట్టు ఇదే [01:01]

వెస్టిండీస్‌తో సొంతగడ్డపై జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌కు భారత జట్టు ఎంపిక పూర్తైంది. విరాట్‌ కోహ్లీ సారథ్యంలో టీమిండియా వెస్టిండీస్‌తో మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. ఫాస్ట్‌ బౌలర్లు మహ్మద్‌ షమి, భువనేశ్వర్‌ కుమార్‌, స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ తిరిగి పరిమిత ఓవర్ల సిరీస్‌కు ఎంపికయ్యారు. ఆల్‌రౌండర్‌ కేదార్‌ జాదవ్‌ కూడా వన్డే జట్టులో స్థానం

తెలుగు రాష్ట్రాలు.. ఆసక్తికర చిత్రాలు [06:21]

ఆర్టీసీ బస్సు బోల్తా: 25 మందికి గాయాలు [03:34]

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ గ్రామీణ మండల పరిధిలోని అచ్చంపేట కూడలి వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 25 మంది గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  మలికిపురం నుంచి విశాఖ వెళ్తున్న తూర్పుగోదావరి జిల్లా రాజోలు డిపోకు

కొల్హాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ బోగీలో పొగలు [02:00]

మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం-ఇంటికన్నె రైల్వేస్టేషన్ల మధ్య ఓహెచ్‌ఈ (ఓవర్‌ హెడ్‌ ఎక్విప్‌మెంట్‌)తీగ తెగి పోవడంతో మణుగూరు నుంచి కొల్హాపూర్‌ వెళ్లే కొల్హాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ నిలిచిపోయింది. గురువారం రాత్రి...

సియాచిన్‌పై నోరు పారేసుకున్న పాక్‌.. [01:04]

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధ క్షేత్రం సియాచిన్‌పై పాకిస్థాన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. సియాచిన్‌ అనేది వివాదాస్పద ప్రాంతమని, అందులో భారత్‌ పర్యాటకుల సందర్శనలను చేపట్టవద్దని పాకిస్థాన్ పేర్కొంది.

భారతీయులపై ఉగ్ర ముద్ర వేసేందుకు కుట్ర [01:04]

ఐరాస భద్రతా మండలితో భారతీయులపై ఉగ్రవాదులుగా ముద్ర వేయించేందుకు పాకిస్థాన్‌ కుట్ర పన్నుతోంది. జైష్‌-ఎ-మహ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజర్‌ను ఐరాస భద్రతా మండలి అంతర్జాతీయ

మమత మంత్రులకు గవర్నర్‌ కౌంటర్‌ [01:04]

తాను చేసే వ్యాఖ్యలపై కాకుండా తమ శాఖలపై దృష్టి సారించాలని పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ జగదీప్‌ సింగ్‌ ధన్కర్‌ ఆ రాష్ట్ర మంత్రులకు సూచించారు. కొన్నిరోజులుగా మమత........

పీవోకే వ్యక్తిని వదిలిపెట్టిన భారత సైన్యం [01:04]

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ నుంచి అనుకోకుండా సరిహద్దు దాటి వచ్చిన ఓ వ్యక్తిని భారత సైన్యం గురువారం మానవతా దృక్పథంతో వదిలిపెట్టింది. ఇటీవల అతడిని వదిలేయాలంటూ పీఓకే అధికారులు భారత సైన్యాన్ని సంప్రదించగా వారు అంగీకరించారు.