ప్రయాణికుడి వేషం...ఘరానా మోసం!

 ఆటోలో వెళ్తూ బంగారం చోరీ

 వలపన్ని పట్టుకున్న పోలీసులు

మాట్లాడుతున్న రాజాం ఎస్సై కె.రాము

న్యూస్‌టుడే- రాజాం: చీపురుపల్లి రైల్వేస్టేషన్‌లో కొంత మంది ప్రయాణికులు ఆటో ఎక్కారు. అది రాజాం వైపు వస్తోంది. కొంత దూరంలో మరో ప్రయాణికుడు ఎక్కాడు. ఆటోలోనివారు మాటల్లో నిమగ్నమయ్యారు. ఒక్కొక్కరు గమ్యస్థానాల్లో దిగుతున్నారు. ఇంతలో ఆ ఇంటి ఇల్లాలు తను దాచిన బంగారం నగలు కోసం బ్యాగు తెరిచింది. ఒక్కసారిగా షాక్‌..అందులో సొత్తు కనిపించలేదు. బంగారం నగలు చోరీకి గురయ్యాయని తెలిసి లబోదిబోమన్నారు. పోలీసులను ఆశ్రయించారు. ఆ తరువాత ఏమైందో..కేసును ఎలా ఛేదించారో రాజాం ఎస్సై కె.రాము స్థానిక పోలీసుస్టేషనులో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.

విజయనగరం జిల్లా వెలగవలస గ్రామానికి చెందిన డబ్బాడ గోపి హైదరాబాద్‌లో హోంగార్డుగా పని చేస్తున్నాడు. అక్టోబరు 30వ తేదీన రాజాం మండలం గురవాంలోని అత్తవారింటికి వచ్చాడు. ఆరోజు విశాఖ ఎక్స్‌ప్రెస్‌ నుంచి చీపురుపల్లిలో దిగి గురవాం వచ్చేందుకు ఆటో ఎక్కారు. ఆటో కొంత దూరం ప్రయాణించాక ఉత్తరప్రదేశ్‌కు చెందిన మహమ్మద్‌ షకీల్‌ ఆటో ఎక్కి వెనుక కూర్చున్నాడు. అక్కడ లగేజీ బ్యాగులున్నాయి. అతనిని అంతా ప్రయాణికుడే అనుకున్నారు. మాటల్లో నిమగ్నమయ్యారు. ఇదే అదునుగా చూసుకొని నిందితుడు చాకచక్యంగా బ్యాగు జిప్‌ తెరిచాడు. లోపల అరను చాకుతో కోసేసి అందులోని బంగారు సొత్తును దొంగిలించాడు. వెంటనే బాధితులు బ్యాగు తెరిచినా బయటపడకుండా ఉండేందుకు జిప్‌పై ఫెవిక్విక్‌ వేశాడు. కొంత దూరం వెళ్లాక ఆటో దిగిపోయాడు. ఇవేమీ ప్రయాణికులు గుర్తించలేదు. ఇంటికి వెళ్లాక సొత్తుపోయిన విషయాన్ని గుర్తించి రాజాం పోలీసులకు బాధితుడు గోపి ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేశారు. సీసీ కెమెరాల్లోనూ ఎక్కడా ఆధారాలు లభ్యం కాలేదు. ఈ క్రమంలో బాధితుడు గోపి మరోసారి ఈ నెల 7వ తేదీన చీపురుపల్లి రైల్వేస్టేషనుకు వెళ్తుండగా మరో ఆటోలో నిందితుడు రాజాం వైపు వెళ్తున్నట్లు గుర్తించాడు. వెంటనే రాజాం పోలీసులను అప్రమత్తం చేశాడు. సీఐ గుండమోను సోమశేఖర్‌ ఆధ్వర్యంలో పోలీసులు బొద్దాం సమీపంలో కాపు కాశారు. ఆటోను తనిఖీ చేసి నిందితుణ్ని పట్టుకున్నారు. విచారిస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడి వద్ద నుంచి మూడున్నర తులాల బంగారు సొత్తును స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చినట్లు ఎస్‌ఐ వెల్లడించారు. సమావేశంలో హెచ్‌సీ వెంకటరమణ, ఎస్‌.కృష్ణ, పి.శంకరరావు, రమణమూర్తి, సుగుణాకరరావు, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని

విడాకులు తీసుకున్న ప్రముఖ హీరో [00:57]

21 ఏళ్ల వైవాహిక బంధాన్ని విడాకులతో స్వస్తి పలికారు బాలీవుడ్‌ నటుడు అర్జున్‌ రాంపాల్‌. పరస్పర అంగీకారంతో అర్జున్‌ తన మొదటి భార్య జెసియా నుంచి విడాకులు...

అది నిజం కాదు..ఇది అసలైన ఫొటో.. [00:53]

రైళ్లలో పాటలు పాడుకుంటూ యాచన చేసే రాణు మండల్‌ ఓ ప్రయాణికుడు ఆమె పాటను యూట్యూబ్‌లో పెట్టడంతో రాత్రికి రాత్రే సెలబ్రిటీ

వెస్టిండీస్‌తో సిరీస్‌కు భారత్‌ జట్టు ఇదే [01:01]

వెస్టిండీస్‌తో సొంతగడ్డపై జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌కు భారత జట్టు ఎంపిక పూర్తైంది. విరాట్‌ కోహ్లీ సారథ్యంలో టీమిండియా వెస్టిండీస్‌తో మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. ఫాస్ట్‌ బౌలర్లు మహ్మద్‌ షమి, భువనేశ్వర్‌ కుమార్‌, స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ తిరిగి పరిమిత ఓవర్ల సిరీస్‌కు ఎంపికయ్యారు. ఆల్‌రౌండర్‌ కేదార్‌ జాదవ్‌ కూడా వన్డే జట్టులో స్థానం

తెలుగు రాష్ట్రాలు.. ఆసక్తికర చిత్రాలు [06:21]

ఆర్టీసీ బస్సు బోల్తా: 25 మందికి గాయాలు [03:34]

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ గ్రామీణ మండల పరిధిలోని అచ్చంపేట కూడలి వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 25 మంది గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  మలికిపురం నుంచి విశాఖ వెళ్తున్న తూర్పుగోదావరి జిల్లా రాజోలు డిపోకు

కొల్హాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ బోగీలో పొగలు [02:00]

మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం-ఇంటికన్నె రైల్వేస్టేషన్ల మధ్య ఓహెచ్‌ఈ (ఓవర్‌ హెడ్‌ ఎక్విప్‌మెంట్‌)తీగ తెగి పోవడంతో మణుగూరు నుంచి కొల్హాపూర్‌ వెళ్లే కొల్హాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ నిలిచిపోయింది. గురువారం రాత్రి...

సియాచిన్‌పై నోరు పారేసుకున్న పాక్‌.. [01:04]

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధ క్షేత్రం సియాచిన్‌పై పాకిస్థాన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. సియాచిన్‌ అనేది వివాదాస్పద ప్రాంతమని, అందులో భారత్‌ పర్యాటకుల సందర్శనలను చేపట్టవద్దని పాకిస్థాన్ పేర్కొంది.

భారతీయులపై ఉగ్ర ముద్ర వేసేందుకు కుట్ర [01:04]

ఐరాస భద్రతా మండలితో భారతీయులపై ఉగ్రవాదులుగా ముద్ర వేయించేందుకు పాకిస్థాన్‌ కుట్ర పన్నుతోంది. జైష్‌-ఎ-మహ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజర్‌ను ఐరాస భద్రతా మండలి అంతర్జాతీయ

మమత మంత్రులకు గవర్నర్‌ కౌంటర్‌ [01:04]

తాను చేసే వ్యాఖ్యలపై కాకుండా తమ శాఖలపై దృష్టి సారించాలని పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ జగదీప్‌ సింగ్‌ ధన్కర్‌ ఆ రాష్ట్ర మంత్రులకు సూచించారు. కొన్నిరోజులుగా మమత........

పీవోకే వ్యక్తిని వదిలిపెట్టిన భారత సైన్యం [01:04]

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ నుంచి అనుకోకుండా సరిహద్దు దాటి వచ్చిన ఓ వ్యక్తిని భారత సైన్యం గురువారం మానవతా దృక్పథంతో వదిలిపెట్టింది. ఇటీవల అతడిని వదిలేయాలంటూ పీఓకే అధికారులు భారత సైన్యాన్ని సంప్రదించగా వారు అంగీకరించారు.