తండ్రిని కడతేర్చిన కసాయి తనయుడు

● ఆస్తికోసం దారుణంగా హత్య
● బంధువుల ఫిర్యాదుతో ఎనిమిది నెలల
తర్వాత వెలుగులోకి వచ్చిన దారుణం

వెంకటాచలపతి కుటుంబ సభ్యులను విచారిస్తున్న తహసీల్దార్‌ రంగస్వామి

ఏర్పేడు, న్యూస్‌టుడే: పున్నామ నరకం నుంచి విముక్తి కలిగించాల్సిన పుత్రడు ఆస్తికోసం తండ్రిని దారుణంగా హత్యచేసిన విషాద ఘటన మండలంలోని చిందేపల్లెలో చోటు చేసుకుంది. రేణిగుంట డీఎస్పీ చంద్రశేఖర్‌ కథనం మేరకు.. చిందేపల్లెకి చెందిన వెంకటాచలపతి(63)పేరుతో తిరుమల ఎస్వీ దుకాణ సముదాయంలో, ఎస్‌ఎన్‌సీలో రెండు దుకాణాలు ఉన్నాయి. గ్రామంలో అయిదు ఎకరాలు వ్యవసాయ భూమి ఉంది. అందులో మూడు ఎకరాల భూమిని అదే గ్రామానికి చెందిన నరసింహులు అలియాస్‌ చిన్నా(32)కు మూడు సంవత్సరాలకు రూ.2.5లక్షలకు కౌలుకు ఇచ్చాడు. మిగిలిన రెండు ఎకరాల భూమిని సమీప బంధువైన శిద్ధారామయ్య సాగు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తిరుమలలో ఎస్వీ దుకాణ సముదాయంలోని దుకాణం నుంచి ఏడాదికి రూ.15లక్షలు వరకు ఆదాయం వస్తుండటంతో తండ్రితో గొడవపడి ఆదుకాణాన్ని సురేష్‌బాబు(40) తీసుకుని తానే నడుపుకుంటున్నాడు. అయితే మరో దుకాణంతో పాటు గ్రామంలో శిద్ధారామయ్య సాగు చేసుకుంటున్న రెండు ఎకరాల భూమిని తన పేరిట మార్చాలని సురేష్‌ బాబు తరచూ తండ్రితో వివాదానికి దిగేవాడు. చివరకు రూ.3లక్షలు నగదు ఇవ్వాలని కోరాడు. దీనికి వెంకటాచలపతి నిరాకరించడంతో హత్య చేసేందుకు సురేష్‌బాబు ప్రణాళిక సిద్ధం చేశాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 16న భూవివాదం గురించి మాట్లాడాలని నమ్మించి కారులో తీసుకొచ్చాడు. శీతల పానీయంలో పది నిద్ర మాత్రలను కలిపి తాగించాడు. వెంట తెచ్చుకున్న తాడుతో మెడబిగించి హత్య చేశాడు. బయటకు రాకుండా ఉండేందుకు చిన్నా సాయంతో కొత్తకండ్రిగ సమీపంలోని సోమశిల-స్వర్ణముఖి గట్టుపై మృత దేహాన్ని పూడ్చిపెట్టిన్నట్లు తెలిపారు. కొద్దిరోజులగా వెంకటాచలపతి కనిపించక పోవడంతో వరసకు అన్నఅయిన గురునాథం పోలీస్‌లకు ఫిర్యాదు చేశారు. దీనిపై బంధువులను విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చిందని పేర్కొన్నారు. సురేష్‌బాబు, నరసింహులు అలియాస్‌ చిన్నాలను అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. కేసును చేధించిన ఏర్పేడు సీఐ శివకుమార్‌రెడ్డి, సిబ్బందిని అభినందించారు.

మృతదేహం వెలికితీత

సురేష్‌, చిన్నా ఇచ్చిన సమాచారంతో పోలీస్‌లు, వైద్య బృందం సోమశిల-స్వర్ణముఖి కాలువ వద్దకు చేరుకున్నారు. తహసీల్దార్‌ రంగస్వామి ఆధ్వర్యంలో జేసీబీతో తవ్వి మృత దేహాన్ని బయటకు తీశారు. హత్యజరిగి ఎనిమిది నెలలు గడవటంతో అక్కడ లభించిన ఎముకలు, మట్టిని సేకరించి వైద్య పరీక్షలకు పంపారు. అనంతరం వెంకటాచలపతి భార్య నాగభూషణమ్మ, రెండో కుమారుడు భానుప్రకాష్‌లను విచారించారు. కార్యక్రమంలో సీఐ శివకుమార్‌రెడ్డి, తహసీల్దార్‌ రంగస్వామి, ఎస్సై రామచంద్రనాయక్‌, ఏఎస్సై కులశేఖర్‌, ఎస్‌డీపీవో శేఖర్‌, వరమునిరెడ్డి, మహేంద్ర పాల్గొన్నారు.

● వెంకటాచలపతి మృతదేహాన్ని పాతిపెట్టిన ప్రాంతాన్ని చూపుతున్న సురేష్‌బాబు,

● చిన్న, అస్థిపంజరంలోని భాగాలను సేకరిస్తున్న వైద్యబృందం, పోలీసులు, ●

మరిన్ని

విడాకులు తీసుకున్న ప్రముఖ హీరో [00:57]

21 ఏళ్ల వైవాహిక బంధాన్ని విడాకులతో స్వస్తి పలికారు బాలీవుడ్‌ నటుడు అర్జున్‌ రాంపాల్‌. పరస్పర అంగీకారంతో అర్జున్‌ తన మొదటి భార్య జెసియా నుంచి విడాకులు...

అది నిజం కాదు..ఇది అసలైన ఫొటో.. [00:53]

రైళ్లలో పాటలు పాడుకుంటూ యాచన చేసే రాణు మండల్‌ ఓ ప్రయాణికుడు ఆమె పాటను యూట్యూబ్‌లో పెట్టడంతో రాత్రికి రాత్రే సెలబ్రిటీ

వెస్టిండీస్‌తో సిరీస్‌కు భారత్‌ జట్టు ఇదే [01:01]

వెస్టిండీస్‌తో సొంతగడ్డపై జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌కు భారత జట్టు ఎంపిక పూర్తైంది. విరాట్‌ కోహ్లీ సారథ్యంలో టీమిండియా వెస్టిండీస్‌తో మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. ఫాస్ట్‌ బౌలర్లు మహ్మద్‌ షమి, భువనేశ్వర్‌ కుమార్‌, స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ తిరిగి పరిమిత ఓవర్ల సిరీస్‌కు ఎంపికయ్యారు. ఆల్‌రౌండర్‌ కేదార్‌ జాదవ్‌ కూడా వన్డే జట్టులో స్థానం

తెలుగు రాష్ట్రాలు.. ఆసక్తికర చిత్రాలు [06:21]

ఆర్టీసీ బస్సు బోల్తా: 25 మందికి గాయాలు [03:34]

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ గ్రామీణ మండల పరిధిలోని అచ్చంపేట కూడలి వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 25 మంది గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  మలికిపురం నుంచి విశాఖ వెళ్తున్న తూర్పుగోదావరి జిల్లా రాజోలు డిపోకు

కొల్హాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ బోగీలో పొగలు [02:00]

మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం-ఇంటికన్నె రైల్వేస్టేషన్ల మధ్య ఓహెచ్‌ఈ (ఓవర్‌ హెడ్‌ ఎక్విప్‌మెంట్‌)తీగ తెగి పోవడంతో మణుగూరు నుంచి కొల్హాపూర్‌ వెళ్లే కొల్హాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ నిలిచిపోయింది. గురువారం రాత్రి...

సియాచిన్‌పై నోరు పారేసుకున్న పాక్‌.. [01:04]

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధ క్షేత్రం సియాచిన్‌పై పాకిస్థాన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. సియాచిన్‌ అనేది వివాదాస్పద ప్రాంతమని, అందులో భారత్‌ పర్యాటకుల సందర్శనలను చేపట్టవద్దని పాకిస్థాన్ పేర్కొంది.

భారతీయులపై ఉగ్ర ముద్ర వేసేందుకు కుట్ర [01:04]

ఐరాస భద్రతా మండలితో భారతీయులపై ఉగ్రవాదులుగా ముద్ర వేయించేందుకు పాకిస్థాన్‌ కుట్ర పన్నుతోంది. జైష్‌-ఎ-మహ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజర్‌ను ఐరాస భద్రతా మండలి అంతర్జాతీయ

మమత మంత్రులకు గవర్నర్‌ కౌంటర్‌ [01:04]

తాను చేసే వ్యాఖ్యలపై కాకుండా తమ శాఖలపై దృష్టి సారించాలని పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ జగదీప్‌ సింగ్‌ ధన్కర్‌ ఆ రాష్ట్ర మంత్రులకు సూచించారు. కొన్నిరోజులుగా మమత........

పీవోకే వ్యక్తిని వదిలిపెట్టిన భారత సైన్యం [01:04]

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ నుంచి అనుకోకుండా సరిహద్దు దాటి వచ్చిన ఓ వ్యక్తిని భారత సైన్యం గురువారం మానవతా దృక్పథంతో వదిలిపెట్టింది. ఇటీవల అతడిని వదిలేయాలంటూ పీఓకే అధికారులు భారత సైన్యాన్ని సంప్రదించగా వారు అంగీకరించారు.