ఆ మాట చెప్పగానే రజనీపై కోపం వచ్చింది

 రజనీతో బంధంపై కమల్‌ వ్యాఖ్య

 ఘనంగా బాలచందర్‌ విగ్రహావిష్కరణ

కేబీ చిత్రపటం వద్ద రజనీకాంత్‌, కమల్‌హాసన్‌

కోడంబాక్కం, న్యూస్‌టుడే: తనను, రజనీకాంత్‌ను ఎవరూ విడదీయలేరని నటుడు కమల్‌హాసన్‌ పేర్కొన్నారు. కమల్‌కు చెందిన రాజ్‌కమల్‌ కార్యాలయంలో కె.బాలచందర్‌ విగ్రహావిష్కరణ కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది. ఇందులో రజనీకాంత్‌, మణిరత్నం, వైరముత్తు, కేఎస్‌ రవికుమార్‌, నాజర్‌, శ్రుతిహాసన్‌, అక్షరహాసన్‌, పూజాకుమార్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమల్‌హాసన్‌ మాట్లాడుతూ.. ‘‘రజనీ, నాకు మధ్య ఉన్న స్నేహం చాలా అపూర్వమైనది. చాలా ఏళ్లక్రితం ఇద్దరు యువకులు ఓ వేపచెట్టు కింద కూర్చుని ఆసక్తిగా మాట్లాడుకున్నారు. ఇకపై కలసి వెళ్లడం కాకుండా, తలో దారిన వెళ్లాలని నిర్ణయించుకున్నారు. నిజానికి వారి మాటలను ఎవరైనా పెద్దలు వినుంటే.. ‘వీరికి గర్వం పెరిగింది’ అని అనుకుని ఉండేవారు. ఆ యువకులే రజనీకాంత్‌, నేను! అప్పుడు మేం తీసుకున్న నిర్ణయం ఇప్పటికీ అద్భుతమైన విషయంగా అనిపిస్తోంది. ఆ యువకులను తలచుకుంటే నాకే ఆశ్చర్యమేస్తోంది. మేం పరస్పరం అభినందించుకుంటాం. విశేషాలను పంచుకుంటాం. మమ్మల్ని ఎవరూ విడదీయలేరు. దర్శకుడు మణిరత్నం శైలి అంటే మహా ఇష్టం. ఓ సారి మణిరత్నం దర్శకత్వంలో నటిస్తున్నట్లు రజనీకాంత్‌ చెప్పారు. టైటిల్‌ ‘తలబది’ అని చెప్పి ‘ఎలాగుంది?’ అని రజనీ అన్నారు. కానీ నాకేమో అది ‘గణపతి’ అని వినిపించింది. వెంటనే ‘నాకు నచ్చలేదు’ అనేశా. ‘ఏదో వినాయకచవితి పండుగలా ఉంది’ అన్నా. ఆయనకు ఏం అర్థం కాలేదు. ‘ఎందుకలా?.. తలబది టైటిల్‌కు దానికి ఏం సంబంధం’ అన్నారు. ‘అయ్యో.. సారీ, నాకు వేరేలా వినపడింది’ అన్నా. మా స్నేహం అలాంటిది. మేం చాలా సహజంగా, సరదాగా ఉంటాం. మా మధ్య గెలుపోటముల ప్రస్తావన ఉండదు. రెండు గోల్‌పోస్టులు ఉంటేనే ఆట రసవత్తరంగా ఉంటుంది. కొన్నేళ్లక్రితం ఓ సారి రజనీకాంత్‌ వచ్చి ‘నాకు ఇవన్నీ నచ్చలేదు. వెళ్లిపోదామని అనుకుంటున్నా!’ అని అన్నారు. నాకు కోపం వచ్చేసింది. ‘మీరు సాధించాల్సిన విషయాలు, బాధ్యతలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడే ఉండండి. ఆ ఆలోచనలు వద్దు’ అన్నా. ఇక, కె.బాలచందర్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన ప్రాణంతో ఉంటే ఇక్కడ అతిథిగా కూర్చునేవారు. లేనందువల్లే ఆయన శిలగా అక్కడ ఉన్నారు. దాదాపు 43 సంవత్సరాల ఆలస్యంగా రజనీకాంత్‌కు ఐకాన్‌ అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నిజానికి ఆయనకు తొలి సంవత్సరంలోనే అవార్డు ఇవ్వాల్సింది. అందుకు అర్హుడైన వ్యక్తి’’ అని పేర్కొన్నారు.

మరిన్ని

విడాకులు తీసుకున్న ప్రముఖ హీరో [00:57]

21 ఏళ్ల వైవాహిక బంధాన్ని విడాకులతో స్వస్తి పలికారు బాలీవుడ్‌ నటుడు అర్జున్‌ రాంపాల్‌. పరస్పర అంగీకారంతో అర్జున్‌ తన మొదటి భార్య జెసియా నుంచి విడాకులు...

అది నిజం కాదు..ఇది అసలైన ఫొటో.. [00:53]

రైళ్లలో పాటలు పాడుకుంటూ యాచన చేసే రాణు మండల్‌ ఓ ప్రయాణికుడు ఆమె పాటను యూట్యూబ్‌లో పెట్టడంతో రాత్రికి రాత్రే సెలబ్రిటీ

వెస్టిండీస్‌తో సిరీస్‌కు భారత్‌ జట్టు ఇదే [01:01]

వెస్టిండీస్‌తో సొంతగడ్డపై జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌కు భారత జట్టు ఎంపిక పూర్తైంది. విరాట్‌ కోహ్లీ సారథ్యంలో టీమిండియా వెస్టిండీస్‌తో మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. ఫాస్ట్‌ బౌలర్లు మహ్మద్‌ షమి, భువనేశ్వర్‌ కుమార్‌, స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ తిరిగి పరిమిత ఓవర్ల సిరీస్‌కు ఎంపికయ్యారు. ఆల్‌రౌండర్‌ కేదార్‌ జాదవ్‌ కూడా వన్డే జట్టులో స్థానం

తెలుగు రాష్ట్రాలు.. ఆసక్తికర చిత్రాలు [06:21]

ఆర్టీసీ బస్సు బోల్తా: 25 మందికి గాయాలు [03:34]

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ గ్రామీణ మండల పరిధిలోని అచ్చంపేట కూడలి వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 25 మంది గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  మలికిపురం నుంచి విశాఖ వెళ్తున్న తూర్పుగోదావరి జిల్లా రాజోలు డిపోకు

కొల్హాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ బోగీలో పొగలు [02:00]

మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం-ఇంటికన్నె రైల్వేస్టేషన్ల మధ్య ఓహెచ్‌ఈ (ఓవర్‌ హెడ్‌ ఎక్విప్‌మెంట్‌)తీగ తెగి పోవడంతో మణుగూరు నుంచి కొల్హాపూర్‌ వెళ్లే కొల్హాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ నిలిచిపోయింది. గురువారం రాత్రి...

సియాచిన్‌పై నోరు పారేసుకున్న పాక్‌.. [01:04]

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధ క్షేత్రం సియాచిన్‌పై పాకిస్థాన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. సియాచిన్‌ అనేది వివాదాస్పద ప్రాంతమని, అందులో భారత్‌ పర్యాటకుల సందర్శనలను చేపట్టవద్దని పాకిస్థాన్ పేర్కొంది.

భారతీయులపై ఉగ్ర ముద్ర వేసేందుకు కుట్ర [01:04]

ఐరాస భద్రతా మండలితో భారతీయులపై ఉగ్రవాదులుగా ముద్ర వేయించేందుకు పాకిస్థాన్‌ కుట్ర పన్నుతోంది. జైష్‌-ఎ-మహ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజర్‌ను ఐరాస భద్రతా మండలి అంతర్జాతీయ

మమత మంత్రులకు గవర్నర్‌ కౌంటర్‌ [01:04]

తాను చేసే వ్యాఖ్యలపై కాకుండా తమ శాఖలపై దృష్టి సారించాలని పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ జగదీప్‌ సింగ్‌ ధన్కర్‌ ఆ రాష్ట్ర మంత్రులకు సూచించారు. కొన్నిరోజులుగా మమత........

పీవోకే వ్యక్తిని వదిలిపెట్టిన భారత సైన్యం [01:04]

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ నుంచి అనుకోకుండా సరిహద్దు దాటి వచ్చిన ఓ వ్యక్తిని భారత సైన్యం గురువారం మానవతా దృక్పథంతో వదిలిపెట్టింది. ఇటీవల అతడిని వదిలేయాలంటూ పీఓకే అధికారులు భారత సైన్యాన్ని సంప్రదించగా వారు అంగీకరించారు.