‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’

దిల్లీ ఘటనలో ఓ కార్మికుడి చివరి ఫోన్‌ కాల్‌

దిల్లీ: ‘‘నా చుట్టూ మంటలు అలముకున్నాయి. మహా అయితే రెండు మూడు నిమిషాలు బతుకుతా. నేను చెప్పదలచుకున్నది ఒకటే.. నా కుటుంబాన్ని చక్కగా చూసుకో’’ అంటూ దిల్లీ అగ్నిప్రమాద మృతుడి చివరి ఫోన్‌ కాల్‌ ఇప్పుడు అందరినీ కంటతడి పెట్టిస్తోంది. అతడి సంభాషణ రికార్డింగ్‌ బట్టి ప్రమాద సమయంలో మృతి చెందిన కార్మికులు చివరి నిమిషంలో పడిన వేదన అర్థమవుతోంది. ఓ వైపు అగ్నికీలలు ఎగసిపడుతున్నా.. తప్పించుకునే పరిస్థితి లేక మంటలకు ఆహుతైనట్లు తెలుస్తోంది.

దిల్లీలోని ఆదివారం ఉదయం ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకున్న ఘటనలో ఆ భవనంలో పనిచేస్తున్న సుమారు 43 మంది కార్మికులు మృతిచెందిన సంగతి తెలిసిందే. మృతుల్లో ఒకరైన ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఓ కార్మికుడు.. చనిపోయే ముందు తన సోదరుడికి ఫోన్‌చేసి మాట్లాడిన ఆడియో బయటపడింది. ఫోన్‌ సంభాషణ బట్టి బాధితుడిని యూపీలోని బిజ్‌నోర్‌కు చెందిన ముషారఫ్‌ అలీ (30)గా గుర్తించారు. చివరి నిమిషంలో తన సోదరుడికి ఫోన్‌ చేస్తూ.. ‘‘అన్నయ్యా.. నేను మరికాసేపట్లో చనిపోతున్నా. నా చుట్టూ ఎటు చూసినా మంటలే. తప్పించుకుందామంటే మార్గం లేదు. రేపు దిల్లీ వచ్చి నా మృతదేహాన్ని తీసుకెళ్లు. ఇవాళ నేను ఏ మాత్రం బతికే అవకాశం లేదు. మహా అయితే మూడు నాలుగు నిమిషాలు. దేవుడి దయ ఉంటే తప్ప. నా కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకో అన్నయ్యా. నా మృతి విషయం ఇంట్లో పెద్దలకు కూడా చెప్పు’’ అంటూ సంభాషించిన ఆడియో వెలుగులోకి వచ్చింది. బాధితుడికి భార్య, ముగ్గురు ఆడపిల్లలు, ఒక కుమారుడు ఉన్నారు. మృతుడు నాలుగేళ్లుగా ఇదే కర్మాగారంలో పనిచేస్తున్నాడు.

ఇదీ చదవండి..
దిల్లీలో ఘోర అగ్నిప్రమాదం

మరిన్ని

భాజపా జాతీయ అధ్యక్షుడి ఎన్నిక నేడు [00:05]

భాజపా జాతీయ అధ్యక్షుడి కోసం సోమవారం ఎన్నిక నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం 10:30 నుంచి నామినేషన్‌ ప్రక్రియ చేపట్టనున్నారు. మధ్యాహ్నం 12.30 వరకు

రాహుల్‌ ఔటయ్యాక.. అదే అనుకున్నాం [00:01]

ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో కేఎల్‌ రాహుల్‌(19) ఔటయ్యాక.. కోహ్లీ, తాను ఇన్నింగ్స్‌ చక్కదిద్దాలని అనుకున్నామని ఓపెనర్‌ రోహిత్‌శర్మ అన్నాడు...

సీఏఏని విభేదించే హక్కు రాష్ట్రాలకుంది: కాంగ్రెస్ [00:00]

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం విషయంలో విభేదించే హక్కు రాష్ట్రాలకు ఉందని కాంగ్రెస్‌ పార్టీ పేర్కొంది. సీఏఏ అంశం కోర్టులో తేలే వరకు రాజ్యాంగ విరుద్ధమైన చట్టాన్ని....