మహేశ్‌-విజయశాంతి ఇది గమనించారా?

ఇంటర్నెట్‌డెస్క్‌: మహేష్‌బాబు కథానాయకుడిగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక కథనాయిక. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. సంక్రాంతి కానుకగా జనవరి 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోపక్క చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ప్రతి సోమవారం అభిమానులకు ఒక కానుక ఇవ్వనున్నట్లు తెలిపింది. ఇందులో భాగంగా డిసెంబరు 9న ‘‘సూర్యుడివో చంద్రుడివో’’ లిరికల్‌ సాంగ్‌ను విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా మహేశ్‌బాబు-విజయశాంతిలు పచ్చని పోలాల మధ్య కలిసి నడిచి వస్తున్న ఫొటోను దర్శకుడు అనిల్‌ రావిపూడి అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో సామాజిక మాధ్యమాల వేదికగా ట్రెండింగ్‌లో ఉంది. అంతేకాదు, 1989లో కృష్ణ- విజయశాంతి జోడీగా నటించిన ‘కొడుకుదిద్దిన కాపురం’ చిత్రంలో మహేశ్‌బాబు వీరికి కొడుకుగా నటించాడు. ఇప్పుడు మళ్లీ 2019లో మహేశ్‌బాబు-విజయశాంతిలు కీలక పాత్రల్లో ‘సరిలేరు నీకెవ్వరు’లో కలిసి నటిస్తుండటంతో అప్పటి, ఇప్పటి చిత్రాలు కలిపి ట్రెండింగ్‌లో ఉన్నాయి. 

‘‘సూర్యుడివో చంద్రుడివో..’’ దేవిశ్రీ ప్రసాద్‌ సర్‌ చక్కని ట్యూన్స్‌ ఇచ్చినందుకు ధన్యవాదాలు. రామజోగయ్యశాస్త్రిగారు అద్భుతమైన సాహిత్యంతో పాటకు ప్రాణం పోశారు. దేవిశ్రీ స్వరాలు సమకూర్చిన పాటల్లో ఇది కూడా ఒక అత్యుత్తమ గీతం మిగిలిపోతుంది’’ - ట్విటర్‌లో అనిల్‌ రావిపూడి

ఇటీవల విడుదల చేసిన ‘సరిలేరు నీకెవ్వరు’చిత్ర టీజర్‌ అభిమానులను విశేషంగా అలరిస్తోంది. ప్రకాష్‌రాజ్‌, సంగీత, రాజేంద్రప్రసాద్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్‌, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్‌, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై రామ బ్రహ్మం సుంకర, మహేశ్‌బాబు, దిల్‌రాజులు నిర్మిస్తున్నారు. 

 


మరిన్ని

13 అంతస్తుల భవనంపైకి ఎక్కి రైతుల నిరసన [13:36]

ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ నిర్మాణంలో ఉన్న ఎమ్మెల్యే క్వార్టర్స్‌ భవనంపైకి ఇద్దరు రైతులు ఎక్కడం ఆందోళన కలిగిస్తోంది. తుళ్లూరు, నెక్కల్లు గ్రామాలకు చెందిన కొందరు రైతులు నూతనంగా నిర్మిస్తున్న ఎమ్మె్ల్యే క్వార్టర్స్‌ వద్ద

‘డమ్మీ కాన్వాయ్‌తో ట్రయల్‌ రన్‌..సిగ్గుచేటు’ [19:32]

హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ పెరిగే విధంగా తెలంగాణ సీఎం కేసీఆర్‌తో ఏపీ సీఎం జగన్‌ ఒప్పందం చేసుకున్నారని.. అందుకే అమరావతిని చంపేస్తున్నారని...

‘దిల్లీలో కొట్లాట..గల్లీలో షేక్‌హ్యాండ్‌’ [20:54]

తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి ఓటు వేయాలని మంత్రి హరీశ్‌రావు ఓటర్లను కోరారు. మున్సిపల్‌ ఎన్నికల...

గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం [23:44]

గుజరాత్‌ రాష్ట్రంలోని సురేంద్రనగర్‌ జిల్లా ఘోర దేవ్‌పరా వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాకు చెందిన ఐదుగురు దుర్మరణం పాలవగా, మరో ఐదుగురు గాయపడ్డారు. వీరంతా గుజరాత్‌లోని సోమనాథ్‌ ఆలయాన్ని దర్శించుకుని తిరిగి వస్తుండగా ఈ దారుణం చోటు చేసుకుంది

అణిచివేత చర్యలు అప్రజాస్వామికం: చంద్రబాబు [23:38]

అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో తెదేపా నేతల గృహనిర్బంధాలు, అక్రమ అరెస్టులను తెదేపా అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. తమ భవిష్యత్తుపై ఆందోళనతో ప్రజలు ఉన్నారని, ప్రభుత్వానికి తమ ఆకాంక్షలను తెలియజేయాలనుకున్న తరుణంలో ఈ విధమైన అణిచివేత చర్యలు...

మోదీ ట్వీట్‌ను కాపీ కొట్టిన బ్యూటీ [23:32]

చాలామంది ప్రముఖులు దేశంలో జరుగుతున్న పరిణామాలపై ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల వేదికగా స్పందిస్తుంటారు. వారి స్పందన...

తెదేపా నేతల గృహనిర్బంధం [23:24]

అమరావతి పరిరక్షణ సమితి, రాజకీయ పార్టీలు తలపెట్టిన అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో రాష్ట్రంలో ఎక్కడికక్కడ తెదేపా నేతలను పోలీసులు గృహనిర్బంధం చేస్తున్నారు. 13 జిల్లాల్లో తెదేపా నాయకులు, ఐకాస నేతలను పోలీసులు గృహనిర్బంధం చేశారు. ముందు జాగ్రత్తగా పోలీసులు ఇప్పటికే ప్రతిపక్ష తెదేపా నేతలకు నోటీసులు జారీ చేశారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో

రాజధాని కోసం ఆగిన మరో గుండె [23:19]

రాజధాని తరలింపు ప్రకటనల నేపథ్యంలో మరో మహిళా రైతు గుండె ఆగింది. అమరావతి రాజధానిని తరలించవద్దని చేపట్టిన దీక్షా శిబిరంలో...

దీపికపై అభిమానుల ఫైర్‌ [23:02]

బాలీవుడ్‌ నటి దీపిక పదుకొణె ఈ మధ్య కాలంలో ప్రధానంగా వార్తల్లో నిలుస్తోంది. మొన్నటి వరకూ జేఎన్‌యూ సందర్శనపై రాజకీయ నాయకుల నుంచి...

ఫేస్‌బుక్‌ పోస్టు.. సినిమాలాంటి ట్విస్టు [22:52]

మంచి చేసేవాళ్లకు ఎప్పటికైనా మంచి జరుగుతుందని చాలామంది నమ్ముతారు. ఈ వార్త చదివితే ఎవరికైనా అది  నిజమనిపించక మానదు.