గచ్చిబౌలి స్టేడియంలో ‘వెంకీమామ’ సందడి

హైదరాబాద్: అగ్ర కథానాయకుడు వెంకటేష్‌ ఆదివారం రాత్రి గచ్చిబౌలి స్టేడియంలో సందడి చేశారు. ఇండియన్‌ సూపర్‌లీగ్‌లో భాగంగా హైదరాబాద్‌ ఎఫ్‌సీ×ఎఫ్‌సీ గోవా జట్ల మధ్య మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు వెంకటేష్‌ గచ్చిబౌలి స్టేడియానికి విచ్చేశారు. ఆయనతో పాటు, ‘వెంకీమామ’చిత్ర దర్శకుడు కె.ఎస్‌.రవీంద్ర(బాబి), నిర్మాత సురేష్‌బాబు, మరో దర్శకుడు క్రిష్‌ కూడా ఉన్నారు. వెంకటేష్‌ మ్యాచ్‌ను వీక్షిస్తున్న ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.

నాగచైతన్యతో కలిసి వెంకటేష్ నటించిన తాజా చిత్రం ‘వెంకీమామ’. రాశీఖన్నా, పాయల్‌రాజ్‌పుత్‌ కథానాయికలు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబరు 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌కు విశేష స్పందన వస్తోంది.

మరిన్ని

భాజపా జాతీయ అధ్యక్షుడి ఎన్నిక నేడు [00:05]

భాజపా జాతీయ అధ్యక్షుడి కోసం సోమవారం ఎన్నిక నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం 10:30 నుంచి నామినేషన్‌ ప్రక్రియ చేపట్టనున్నారు. మధ్యాహ్నం 12.30 వరకు

రాహుల్‌ ఔటయ్యాక.. అదే అనుకున్నాం [00:01]

ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో కేఎల్‌ రాహుల్‌(19) ఔటయ్యాక.. కోహ్లీ, తాను ఇన్నింగ్స్‌ చక్కదిద్దాలని అనుకున్నామని ఓపెనర్‌ రోహిత్‌శర్మ అన్నాడు...

సీఏఏని విభేదించే హక్కు రాష్ట్రాలకుంది: కాంగ్రెస్ [00:00]

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం విషయంలో విభేదించే హక్కు రాష్ట్రాలకు ఉందని కాంగ్రెస్‌ పార్టీ పేర్కొంది. సీఏఏ అంశం కోర్టులో తేలే వరకు రాజ్యాంగ విరుద్ధమైన చట్టాన్ని....