త్వరలో వైకాపాలోకి గోకరాజు సోదరులు!

భీమవరం పట్టణం: పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన భాజపా సీనియర్‌ నేత, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు సోదరులు వైకాపా తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. పార్టీలో చేరిక విషయాన్ని గంగరాజు సోదరుడు గోకరాజు రామరాజు ధ్రువీకరించారు. ఆయనతో పాటు అతని సోదరుడు, డీఎన్‌ఆర్‌ కళాశాల అధ్యక్షుడు వెంకట నరసింహరాజు, గోకరాజు గంగరాజు కుమారుడు జీవీకే రంగరాజు వైకాపాలో చేరనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే వారంతా సీఎం జగన్‌ సమక్షంలో వైకాపాలో చేరనున్నట్లు సమాచారం.

మరిన్ని

ప్రకాశం బ్యారేజీ మీదుగా రాకపోకలపై ఆంక్షలు [00:55]

అమరావతి పరిరక్షణ సమితి, రాజకీయ పార్టీలు తలపెట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యమానికి అనుమతి లేదని విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు...

‘దొరసాని’ రెండో సినిమా ఖరారు [00:55]

‘దొరసాని’తో హీరోయిన్‌గా రంగప్రవేశం చేసి అభిమానుల మనసు దోచుకున్న శివాత్మిక మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. రొమాంటిక్‌ హీరో ...

రాజధాని కోసం ఆగిన మరో గుండె [00:55]

రాజధాని తరలింపు ప్రకటనల నేపథ్యంలో మరో మహిళా రైతు గుండె ఆగింది. అమరావతి రాజధానిని తరలించవద్దని చేపట్టిన దీక్షా శిబిరంలో...

మోదీ ట్వీట్‌ను కాపీ కొట్టిన బ్యూటీ [00:54]

చాలామంది ప్రముఖులు దేశంలో జరుగుతున్న పరిణామాలపై ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల వేదికగా స్పందిస్తుంటారు. వారి స్పందన...

ఆ రైల్వే స్టేషన్లలో సంస్కృతం [00:54]

ఉత్తరాఖండ్‌ రైల్వేస్టేషన్లలోని నామ ఫలకాలపై ఉర్దూ స్థానంలో ఇకపై సంస్కృతం వచ్చి చేరనుంది. రైల్వే ప్లాట్‌ఫాంపై ఉండే నామ ఫలకాలు ఆ రాష్ట్రానికి చెందిన ద్వితీయ భాష....

సరికొత్త లుక్‌లో బాలకృష్ణ.. ఎందుకోసం..? [00:54]

పాత్ర అంటే ప్రాణం పెట్టే నటుల్లో అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ ఒకరు. ప్రస్తుతం ఆయనకు సంబంధించిన ఒక ఫొటో సామాజిక మాధ్యమాల...

గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం [00:53]

గుజరాత్‌ రాష్ట్రంలోని సురేంద్రనగర్‌ జిల్లా ఘోర దేవ్‌పరా వద్ద ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ప్రకాశం జిల్లాకు చెందిన ఐదుగురు దుర్మరణం చెందగా, మరో ఐదుగురు గాయపడ్డారు.

ఫేస్‌బుక్‌ పోస్టు.. సినిమాలాంటి ట్విస్టు [00:53]

మంచి చేసేవాళ్లకు ఎప్పటికైనా మంచి జరుగుతుందని చాలామంది నమ్ముతారు. ఈ వార్త చదివితే ఎవరికైనా అది  నిజమనిపించక మానదు.

రూపాయి విలువ చేసే చాక్లెట్లు దొంగిలించాడని.. [00:53]

బెంగళూరులో దారుణం జరిగింది. రెండు చాక్లెట్లు దొంగిలించినందుకు ఓ బాలుడి జుట్టు, కనుబొమ్మలు, కనురెప్పల వెంట్రుకలు ఓ సూపర్‌ మార్కెట్‌ యజమాని కత్తిరించాడు...........

హైదరాబాద్‌లో కాళ్లు,చేతులు కట్టి ఉరేశారు! [00:53]

గుర్తుతెలియని వ్యక్తులు ఓ యువకుడి కాళ్లు, చేతులు కట్టేసి ఉరివేసిన ఘటన హైదరాబాద్‌ శివారులో చోటుచేసుకుంది. బాలాపూర్‌ ఠాణా పరిధిలో...