టాప్‌ 10 న్యూస్ @ 9 PM

1. కొత్త చట్టాలొక్కటే పరిష్కారం కాదు: ఉపరాష్ట్రపతి

మహిళలపై జరుగుతున్న దురాగతాలను అరికట్టడానికి కొత్త చట్టాలను తీసుకురావడమొక్కటే పరిష్కారం కాదని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. అందుకు రాజకీయ సంకల్పం, పాలనా నైపుణ్యాలు అవసరమని అభిప్రాయపడ్డారు. అప్పుడే ఇలాంటి దురాగతాలను అరికట్టడం సాధ్యమని చెప్పారు. ఇటీవల హైదరాబాద్‌, ఉన్నావ్‌లో మహిళలపై జరిగిన దాడుల నేపథ్యంలో ఇక్కడి సింబియాసిస్‌ అంతర్జాతీయ యూనివర్సిటీ 16వ స్నాతకోత్సవ కార్యక్రమంలో ఆదివారం పాల్గొన్న సందర్భంగా ఉప రాష్ట్రపతి మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. దిశ కుటుంబ సభ్యుల వాంగ్మూలం నమోదు

దిశ హత్యకేసు, నిందితుల ఎన్‌కౌంటర్‌కు సంబంధించి జాతీయ మానవహక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) విచారణ కొనసాగుతోంది. విచారణలో భాగంగా  ‘దిశ’ తండ్రి, సోదరి ఎన్‌హెచ్‌ఆర్‌సీబృందం ఎదుట హాజరయ్యారు. శంషాబాద్‌లోని దిశ నివాసానికి వచ్చిన పోలీసులు.. ప్రత్యేక ఎస్కార్ట్‌ వాహనంలో వారిని రాష్ట్ర పోలీస్‌ అకాడమీకి తీసుకెళ్లారు. ఎన్‌హెచ్‌ఆర్‌సీ బృందం అరగంటపాటు దిశ తండ్రి, సోదరిని విచారించి వివరాలు సేకరించారు. నిందితుల ఎన్‌కౌంటర్‌పై వారి వాంగ్మూలాన్ని తీసుకున్నారు. ఘటన జరిగినరోజు, ఆ తర్వాతి రోజు పరిణామాలపై ఆరా తీశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. మద్యాన్ని ఆదాయవనరుగా భావించం:ఏపీమంత్రి

సమాజంలో ఎన్నో అనర్థాలకు మద్యమే కారణమని.. మూడేళ్లలో రాష్ట్రం నుంచి మద్యాన్ని వెలివేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని ఏపీ ఉప ముఖ్యమంత్రి, ఎక్సైజ్‌శాఖ మంత్రి నారాయణ స్వామి అన్నారు. మద్యాన్ని ఆదాయ వనరుగా తాము భావించడం లేదని చెప్పారు. గుంటూరులోని కొరిటిపాడులో మద్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర కార్యాలయాన్ని ఉప ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ మద్య నిషేధంతో రోడ్డు ప్రమాదాలు తగ్గాయని.. జగన్‌ ప్రభుత్వం నిర్ణయంతో ఎన్నో కుటుంబాలు కుదుటపడుతున్నాయని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఎన్‌ఆర్‌సీ బిల్లును వ్యతిరేకిస్తున్నాం: డి.రాజా

సీపీఐ జాతీయ సమావేశాలు ముగిశాయి. ఈ సందర్భంగా హిమాయత్‌నగర్‌లోని రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా మాట్లాడారు.‘‘ రెండు రోజుల పాటు జరిగిన జాతీయ సమావేశాల్లో తాజా రాజకీయ పరిణామాలు, దేశ ఆర్థిక పరిస్థితులపై చర్చించాం. కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 ప్రజాస్వామ్య విరుద్ధంగా తీసుకొచ్చారు. మోదీ, అమిత్‌ షా... జమ్ముకశ్మీర్‌ పరిస్థితులను పూర్తిగా అవగతం చేసుకోలేదు. ఎన్‌ఆర్‌సీ బిల్లును వ్యతిరేకిస్తున్నాం. ప్రధాని మోదీ రాజ్యాంగ విరుద్ధంగా బిల్లు తీసుకురావాలని చూస్తున్నారు’’ అని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. క్రమశిక్షణతో ఉంటే జనసేన గెలిచేది:పవన్‌

రాష్ట్రంలో కులాలకు అతీతంగా రైతు పథకాలు అమలు చేయాలని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రైతుకు గిట్టుబాటు ధర ఇవ్వకుంటే ఈనెల 12న కాకినాడలో దీక్ష చేస్తానని.. ఆ తర్వాత పరిస్థితులు ఎలా చేయిదాటతాయో చెప్పలేనని ఆయన వ్యాఖ్యానించారు. తూర్పుగోదావరి జిల్లా మండపేటలో జనసేన ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు సదస్సులో పవన్‌ మాట్లాడారు. ఈ సభకు భారీగా జనసేన కార్యకర్తలు హాజరయ్యారు. అరుపులు, కేకలతో కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించడంతో పవన్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. జనసైనికులకు క్రమశిక్షణ లేకే ఓడిపోయానని ఆయన వ్యాఖ్యానించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. దిల్‌సుఖ్‌నగర్‌లో సందడి చేసిన కథానాయిక నభానటేష్‌

7. చట్టాల సవరణలకు సంకల్పించాం: అమిత్‌షా

హత్యాచారం వంటి తీవ్ర నేరాల్లో న్యాయం ఆలస్యం అవుతుండడంతో ఐపీసీ, సీఆర్‌పీసీ చట్టాలను సవరించాలని ప్రభుత్వం సంకల్పించినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తెలిపారు. ఈ విషయమై చట్టంలో ఎలాంటి మార్పులు చేస్తే బాగుంటుందని సలహాలు కోరుతూ రాష్ట్రాలకు లేఖ రాసిన తర్వాత రోజే అమిత్‌షా ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. ప్రస్తుత ప్రజాస్వామ్యానికి అనుకూలంగా హత్యాచారం వంటి తీవ్రమైన నేరాల్లో శిక్ష ఆలస్యం కాకుండా ఉండేలా చట్టాల్లో సవరణలు చేయాల్సిన విషయాన్ని అమిత్‌షా నొక్కిచెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. పీఎంవోలో అధికారాలు కేంద్రీకృతం

దేశం ఆర్థిక మాంద్యం ఎదుర్కొంటున్న వేళ.. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురాం రాజన్‌ విమర్శలు చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించే విషయంలో సూచనలిస్తూ ఓ పత్రికలో వ్యాసం రాసిన ఆయన.. ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంవో)పై విమర్శలు గుప్పించారు. అధికారాలన్నీ పీఎంవోలోనే కేంద్రీకృతమయ్యాయని విమర్శించారు. మంత్రుల చేతిలో అధికారం లేకపోవడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో చిక్కుకునే సూచనలు కనిపిస్తున్నాయని అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9.  మాదాపూర్‌లో హై లైఫ్‌ ఎగ్జిబిషన్‌లో సందడి చేసిన మోడళ్లు

10. ‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’

 ‘‘నా చుట్టూ మంటలు అలముకున్నాయి. మహా అయితే రెండు మూడు నిమిషాలు బతుకుతా. నేను చెప్పదలచుకున్నది ఒకటే.. నా కుటుంబాన్ని చక్కగా చూసుకో’’ అంటూ దిల్లీ అగ్నిప్రమాద మృతుడి చివరి ఫోన్‌ కాల్‌ ఇప్పుడు అందరినీ కంటతడి పెట్టిస్తోంది. అతడి సంభాషణ రికార్డింగ్‌ బట్టి ప్రమాద సమయంలో మృతి చెందిన కార్మికులు చివరి నిమిషంలో పడిన వేదన అర్థమవుతోంది. ఓ వైపు అగ్నికీలలు ఎగసిపడుతున్నా.. తప్పించుకునే పరిస్థితి లేక మంటలకు ఆహుతైనట్లు తెలుస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

మరిన్ని

13 అంతస్తుల భవనంపైకి ఎక్కి రైతుల నిరసన [13:36]

ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ నిర్మాణంలో ఉన్న ఎమ్మెల్యే క్వార్టర్స్‌ భవనంపైకి ఇద్దరు రైతులు ఎక్కడం ఆందోళన కలిగిస్తోంది. తుళ్లూరు, నెక్కల్లు గ్రామాలకు చెందిన కొందరు రైతులు నూతనంగా నిర్మిస్తున్న ఎమ్మె్ల్యే క్వార్టర్స్‌ వద్ద

‘డమ్మీ కాన్వాయ్‌తో ట్రయల్‌ రన్‌..సిగ్గుచేటు’ [19:32]

హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ పెరిగే విధంగా తెలంగాణ సీఎం కేసీఆర్‌తో ఏపీ సీఎం జగన్‌ ఒప్పందం చేసుకున్నారని.. అందుకే అమరావతిని చంపేస్తున్నారని...

‘దిల్లీలో కొట్లాట..గల్లీలో షేక్‌హ్యాండ్‌’ [20:54]

తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి ఓటు వేయాలని మంత్రి హరీశ్‌రావు ఓటర్లను కోరారు. మున్సిపల్‌ ఎన్నికల...

కశ్మీర్‌లో ఇంటర్నెట్ ఆ సినిమాలు చూసేందుకే కదా! [23:52]

జమ్ముకశ్మీర్లో ఆర్టికల్‌ 370ని కేంద్రప్రభుత్వం రద్దు చేసిన తర్వాత అక్కడ ఇంటర్నెట్‌ సేవలు నిలిపివేయడాన్ని నీతిఆయోగ్‌ సభ్యుడు, జేఎన్‌యూ ఛాన్సలర్‌ వీకే సరస్వత్‌ సమర్థించుకున్నారు. ఆ ప్రాంతంలో అంతర్జాలాన్ని నిలిపివేయడం వల్ల పెద్దగా నష్టమేమీలేదని ఆయన అన్నారు.  ‘‘ కశ్మీర్లో  ఇంటర్నెట్‌ అందుబాటులో ఉన్నప్పుడు, లేనప్పుడు ఏం తేడా కనిపించింది.  అక్కడ ఇంటర్నెట్లో ఏం చూస్తారు...

గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం [23:44]

గుజరాత్‌ రాష్ట్రంలోని సురేంద్రనగర్‌ జిల్లా ఘోర దేవ్‌పరా వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాకు చెందిన ఐదుగురు దుర్మరణం పాలవగా, మరో ఐదుగురు గాయపడ్డారు. వీరంతా గుజరాత్‌లోని సోమనాథ్‌ ఆలయాన్ని దర్శించుకుని తిరిగి వస్తుండగా ఈ దారుణం చోటు చేసుకుంది

అణిచివేత చర్యలు అప్రజాస్వామికం: చంద్రబాబు [23:38]

అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో తెదేపా నేతల గృహనిర్బంధాలు, అక్రమ అరెస్టులను తెదేపా అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. తమ భవిష్యత్తుపై ఆందోళనతో ప్రజలు ఉన్నారని, ప్రభుత్వానికి తమ ఆకాంక్షలను తెలియజేయాలనుకున్న తరుణంలో ఈ విధమైన అణిచివేత చర్యలు...

మోదీ ట్వీట్‌ను కాపీ కొట్టిన బ్యూటీ [23:32]

చాలామంది ప్రముఖులు దేశంలో జరుగుతున్న పరిణామాలపై ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల వేదికగా స్పందిస్తుంటారు. వారి స్పందన...

తెదేపా నేతల గృహనిర్బంధం [23:24]

అమరావతి పరిరక్షణ సమితి, రాజకీయ పార్టీలు తలపెట్టిన అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో రాష్ట్రంలో ఎక్కడికక్కడ తెదేపా నేతలను పోలీసులు గృహనిర్బంధం చేస్తున్నారు. 13 జిల్లాల్లో తెదేపా నాయకులు, ఐకాస నేతలను పోలీసులు గృహనిర్బంధం చేశారు. ముందు జాగ్రత్తగా పోలీసులు ఇప్పటికే ప్రతిపక్ష తెదేపా నేతలకు నోటీసులు జారీ చేశారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో

రాజధాని కోసం ఆగిన మరో గుండె [23:19]

రాజధాని తరలింపు ప్రకటనల నేపథ్యంలో మరో మహిళా రైతు గుండె ఆగింది. అమరావతి రాజధానిని తరలించవద్దని చేపట్టిన దీక్షా శిబిరంలో...

దీపికపై అభిమానుల ఫైర్‌ [23:02]

బాలీవుడ్‌ నటి దీపిక పదుకొణె ఈ మధ్య కాలంలో ప్రధానంగా వార్తల్లో నిలుస్తోంది. మొన్నటి వరకూ జేఎన్‌యూ సందర్శనపై రాజకీయ నాయకుల నుంచి...